Featuredస్టేట్ న్యూస్

బేరం ఎంతకు కుదిరింది…?

బోడుప్పల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ను ప్రశ్నించిన బిజెపి బోడుప్పల్‌ విభాగం ప్రధాన కార్యదర్శి దాసరి మహేష్‌ యాదవ్‌

హైదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌):

బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో వైన్‌ షాప్‌ కోసం చేపడు తున్న నిర్మాణం అక్రమమని బిజెపి నాయకులు ధర్నా చేయడంతో వెంటనే కూల్చివేసిన కమిషనర్‌ వారం రోజులు తిరగకుండానే మళ్లీ నిర్మాణం చేపట్టినా మౌనం వహించడం వెనుక బేరం ఎంతకు కుదిరింది అన్నది చర్చనీయాంశంగా మారింది. మున్సిపల్‌ అనుమతులు లేవని జెసిబి తో కూల్చివేసిన అధికారులు మూడు రోజుల్లో వారి మనసులు మార్చిన మంత్రం లోని వివరాలు తెలుసుకునేందుకు కార్పొరేషన్‌ ప్రజలు ఆరా తీస్తున్నారు.కార్పొరేషన్‌ పరిధిలోని జ్యోతి నగర్‌ బస్‌ స్టాప్‌ ,సాయి రాం నగర్‌ తదితర పది కాలనీల ప్రజలకు ఇబ్బందులు సష్టించ నున్న వైన్‌ షాప్‌ నిర్మాణం వద్దే వద్దంటూ ఇటీవల పలువురు మహిళలు ధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే.కాగా పీర్జాది గూడ మున్సిపాలిటీ కి చెందిన వ్యక్తికి బోడుప్పల్‌ పరిధిలో వైన్‌ షాప్‌ కేటాయించడంతో బోడుప్పల్‌ నాయకులు కొందరు కుట్ర పూరితంగా వ్యవహ రిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది.

వైన్‌ షాప్‌ ఏర్పాటుతో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నా యని వివిధ కాలనీ సంక్షేమ సంఘాలు ఆందోళన వ్యక్త పరిచారు అని బోడుప్పల్‌ మున్సిపల్‌ బిజెపి ప్రధాన కార్యదర్శి దాసరి మహేష్‌ వివరించారు.వైన్‌ షాప్‌ నిర్మాణం అక్రమమని తాము ధర్నా చేపట్టడంతో నిర్మాణా నికి అనుమతులు లేవని కూల్చివేసిన అధికారులు మూడు రోజుల్లోనే తిరిగి అక్రమ నిర్మాణం కట్టుకునేందుకు సహకరిం చడం మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతుంది అనడానికి ప్రత్యక్ష నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. నిర్మాణాలను కొనసాగనివ్వరాదని తాము కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేయగా ,అక్రమ నిర్మాణానికి నోటీసులు ఇచ్చామని కమిషనర్‌ చెప్పిన సమాధానం చూస్తే లంచం ఇస్తే ఏ పనైనా చేసుకోవచ్చు అన్న ట్లుగా ఉందని దాసరి మహేష్‌ ఆరోపించారు.

ఇప్పటికే ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, చివరకు కాలువలను సైతం కబ్జా చేస్తున్నా పట్టించుకోని అధికారులు నడిరోడ్డుపై అక్రమ నిర్మాణం చేపడితే ఆపకోవడం వింతేమీ కాదనీ ఆయన ఎద్దేవా చేశారు. పేదల పట్ల నిబంధనల పేరుతో కొరడా ఝుళిపించే అధికారులు వైన్‌ షాప్‌ అక్రమ నిర్మాణానికి సహకరించడం పట్ల సమాధానం చెప్పా టలని బోడుప్పల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ బిజెపి పార్టీ ప్రధాన కార్యదర్శి దాసరి మహేష్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close