Featuredస్టేట్ న్యూస్

ఇంకెంత దూరం..

సుప్రీంకోర్టు దిశగా ప్రభుత్వం..

బిజెపి మద్దతు తీసుకునేలా ఆర్టీసీ..

ఎంతవరకైనా వెళ్లేందుకు ఇద్దరూ సిద్దం..

ఇబ్బందులు పడుతున్న ప్రయాణీకులు..

సమ్మె ఇంకెంత దూరమంటే ఎవ్వరి దగ్గర సమాధానం లేదు.. రాష్ట్రం నుంచి కేంద్రం చేతిలోకి వెళ్లిపోతుంది. హైకోర్టు నుంచి కార్మికులకు అనుకూలంగా తీర్పు వస్తే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు సిద్దమవుతోంది. ప్రభుత్వం చెపుతున్నా వినకుండా నిబంధనలకు విరుద్దంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని మొదటి నుంచి ప్రభుత్వం ఆరోపిస్తూ ఉంది. న్యాయపరమైనా డిమాండ్లను నేరవేర్చాలని గత నెల రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవని ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. ఇన్నిరోజుల నుంచి సమ్మె చేస్తున్న కనీసం చర్చల దిశగా ప్రభుత్వం ఒక్కసారి మాట్లాడిందీ లేదు. ప్రతిసారి ఆర్టీసీ ఉద్యోగులను తీసేశాము. వారికి ఉద్యోగాలు ఇచ్చేదీ లేదని చెపుతోంది. తుది గడువు ఇచ్చామని, దాని లోపు ఉద్యోగాల్లో చేరితే చేరాలి లేదంటే ఉద్యోగాలను వదులుకోవాల్సిందేనని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ప్రభుత్వం మాట విధానం వల్ల ఇప్పటికే కొంతమంది కార్మికులు అత్మహత్యకు పాల్పడి వారి ప్రాణాలను సైతం కోల్పోయారు. కెసిఆర్‌ ఎన్ని డిమాండ్లను పెట్టిన ఆర్టీసీ కార్మికులు వెనక్కితగ్గక పోయేసరికి ఇప్పుడు రాష్ట్ర సమస్య జాతీయ స్థాయిలో వెళుతున్నట్లే కనిపిస్తోంది.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న మంత్రులు, ఇతర నాయకులకు కెసిఆర్‌ మాట అంటే వేదవ్కాని ఆయనకు ఎదురు తిరిగేవారు, వ్యతిరేకంగా పనులు చేసే వారిని ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ సహించరనే ప్రచారం ఉంది. ఏదో రకంగా వారిని తన దారికి తెచ్చుకునే ఆపరచాణక్యుడు కెసిఆర్‌. అలాంటి కెసిఆర్‌ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ఆయన మాట, ఆయన విధించిన గడువును పెడచెవిన పెడుతున్నారు. సామరస్యకంగా చర్చలకు పిలుస్తే వస్తాము కాని అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లు మాట్లాడుతే సమ్మె విరమించే ప్రసక్తే లేదంటున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను తీసివేసి హక్కు రాష్ట్రానికి లేదని, తమకు న్యాయం జరిగే వరకు సమ్మె నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని చెపుతున్నారు. ఇరువర్గాల మధ్యలో హోరాహోరీగా సాగుతున్న సమ్మె ఇంకెన్నిరోజులు కొనసాగుతుందో అర్థం కావడం లేదు. ఇప్పటివరకు హైకోర్టు పరిధిలో ఉన్న సమస్య తేడా వచ్చిన సుప్రీంకోర్టు మెట్లు ఎక్కడానికి ప్రభుత్వం సిద్దంగా ఉంది. సుప్రీంకోర్టులో కాలయాపన చేస్తూ సమ్మెను విచ్చిన్నం చేయాలని ప్రభుత్వం ఆలోచనగా చెపుతున్నారు.. ప్రభుత్వం అలా ఆలోచిస్తే తాము కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి మద్దతు తీసుకునేలా కార్మికులు సిద్దమవుతున్నారు.. ఇరువురి పంతాలు, పట్టింపుల వల్ల జాతీయస్థాయికి చేరిన సమ్మె చివరకు రాష్ట్రంలో ఏలాంటి మార్పులకు దోహదం చేస్తుందో అర్థం కావడం లేదు. ఇరువురి పట్టింపుల వల్ల ఇప్పటికి ప్రజలు, ప్రయాణీకులు అవస్థలు పడుతున్నారు. రాష్ట్రంలోని పంచాయితీ జాతీయస్థాయికి వెళ్లేసరికి సమస్య పరిష్కరించేవరకు ఇంకెన్ని రోజులు పడుతుందో అర్థం కాని పరిస్ధితి నెలకొంది.

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌..

ఎవరికి వారే యమునాతీరుగా అన్నట్లుగా ఆర్టీసీ సమ్మె కొలిక్కేరావడం లేదు. ప్రభుత్వం ఇచ్చిన తుది గడువును కూడా ఆర్టీసీ కార్మికులు పక్కన పెట్టేశారు. న్యాయంగా ఉన్న తమ డిమాండ్లను నేరవేర్చకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా మాట్లాడుతోందని ఆర్టీసీ కార్మికుల ఆరోపణ. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోనే ఇన్నిరోజులు సమ్మె కొనసాగలేదని అలాంటిది ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కూడా సమస్యలను సాధించుకునేందుకు ఇన్నిరోజులు సమ్మె చేయడం రికార్డుగానే మారుతోంది. నెలరోజుల దాటి నిరంతరం సాగుతున్న సమ్మెకు పరిష్కారం రాష్ట్రం చేతుల నుంచి కూడా దాటిపోయింది. ఇప్పుడు ఇద్దరూ జాతీయస్థాయిలో తాడోపేడో తెల్చుకునేందుకు సిద్దమవుతున్నారు.

ప్రభుత్వం ఆలోచన కఠినమే..

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సంధించిన సమ్మె అస్త్రం కెసిఆర్‌ ప్రభుత్వానికి ఏ మాత్రం మింగుడుపడని రీతిలో మారిపోయింది. రాజకీయంగా తాను ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్న భావనను హుజూర్‌నగర్‌ ఉప ఎన్నిక ఫలితం పటాపంచలు చేయడంతో ముఖ్యమంత్రి కెసిఆర్‌లో ఎనలేని ఆత్మవిశ్వాసం పెరిగిందని చెపుతున్నారు. తెలంగాణలో తనకు ప్రత్యామ్నాయం అంటూ ఏమీ లేదన్న నమ్మకంతో ఉన్న గులాబీ బాస్‌, ఆర్టీసీ సమ్మె విషయంలో మాత్రం కఠినంగానే ఉండాలని భావిస్తున్నారు. ఇంకా పది సంవత్సరాల వరకు తానే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉంటానని బలంగా నమ్మె కెసిఆర్‌ రానున్న రోజుల్లో ఉద్యోగుల విషయంలో పలు సంస్కరణలు మార్పులు చేయాలన్న యోచనలో ఉన్నారు. వ్యవస్థలో పాతుకుపోయిన పలు ప్రభుత్వ విభాగాల్లో ఊహకు అందని రీతిలో మార్పులు చేయాలని గట్టు పట్టుదలతో ఉన్నారు. ఇందులో మొదటిది తెలంగాణ ఆర్టీసీ కార్మికులు విషయంలో కెసిఆర్‌ వ్యవహరిస్తున్న వైఖరేప్రధానమని తెలుస్తోంది. గడిచిన ముప్పై రెండు రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె విషయంలో కెసిఆర్‌ అంచనాలు తప్పఅయ్యాయా అంటే అవుననే మాట కూడా వినిపిస్తోంది. నలభైవేల మందికి పైగా ఉన్న ఆర్టీసీ ఉద్యోగుల్లో ఎనభై శాతానికి పైనే చిరుద్యోగులేనని వారి సగటు జీతం నెలకు ముప్పైఐదు వేల కంటే తక్కువేనని ఇలాంటి నేపథ్యంలో పది నుంచి పదిహేను రోజులకు మించి సమ్మె చేసే సత్తా లేదన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. తన అంచానలకు భిన్నంగా ముప్పై రెండు రోజులుగా సమ్మె చేయడం ఒక ఎత్తు ఐతే, తాము పని చేసిన సెప్టెంబర్‌ నెల జీతాల్ని కూడా అందని నేపథ్యంలో మొత్తంగా రెండు నెలలపాటు జీతాల్లేక విలవిలలాడటం ఖాయమని అదే జరిగితే సమ్మెకు చెల్లుచీటీ చెప్పి విధుల్లో చేరుతారన్న నమ్మకంలో ప్రభుత్వం ఉంది. కాని ఆర్టీసీ కార్మికుల ప్రభుత్వ ఆలోచనకు వ్యతిరేకంగా సమ్మె కొనసాగిస్తూ ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగ సంఘాల్లో చీలిక తేవాలన్నదీ కెసిఆర్‌ వ్యూహంగా కనిపిస్తున్న ఆ వ్యూహం కూడా బెడిసికొట్టినట్లుగానే కనిపిస్తోంది.

ఒకరికి మించి మరొకరి వ్యూహాలు..

రాష్ట్రంలో ఎవరికి వ్యతిరేకంగా వచ్చినా, మరెవరికి అనుకూలంగా వచ్చిన సుప్రీంకోర్టు మెట్ల ఎక్కేందుకు ఖాయంగా కనిపిస్తోంది. న్యాయపరమైనా డిమాండ్లపై తామెంత పోరాడినా ప్రభుత్వం సానుకూలంగా స్పందించదన్న సంకేతాల్ని స్పష్టం చేయడంతో పాటు, హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చినా, సుప్రీంకోర్టు తలుపు తట్టటం ద్వారా కాలం గడిచేలా చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. తాము చెప్పినట్లు వినని ఆర్టీసీ ఉద్యోగులకు ఆర్థిక ఇబ్బందులు పెరిగే కొద్దీ తాము చెప్పిన మాటను తూచా తప్పకుండా వింటారన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న మాట వినిపిస్తోంది. హైకోర్టులో తీర్పు తమకు ప్రతికూలంగా వచ్చినా, సుప్రీంకోర్టు తలుపు తడుదామన్న రాష్ట్ర ప్రభుత్వపు మాట వెనక పక్కా వ్యూహం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాలయాపనతో ఆర్టీసీ ఉద్యోగుల్ని ఆర్థికంగా బలహీనం చేయటమే ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. దీనికి విరుగుడుగా ఆర్టీసీ సంఘాలు కేంద్రంలో ఉన్న బిజెపి ఆగ్రనాయకత్వాన్ని కలిసి వారి మద్దతు తీసుకునేలా ప్రణాళికలు సాగిస్తున్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close