Featuredవిద్యస్టేట్ న్యూస్

పాఠశాలలో బందీల మేనా- ?

ఆటస్థలం లేక విద్యార్థులకు ఇబ్బంది
* క్రీడలను ప్రోత్సహించాలని ప్రభుత్వ పాఠశాలలు
* స్థలం లేక జాతీయ పండుగలు జరుపుకొనుటకు ఇక్కట్లు.
* ప్రభుత్వ స్కూల్లోనే జీవో ఎంఎస్ నెంబర్ వన్ ఉల్లంఘన
* విద్యార్థుల సమస్యలను పట్టించుకోని జిల్లా విద్యాశాఖ అధికారి.
* ప్రైవేట్ స్కూళ్ల యజమాన్యాల తో జేబులు నింపుకుంటున్న   విద్యాశాఖ అధికా
రులు 

మలక్పేట్, ఆదాబ్ హైదరాబాద్ :హైదరాబాద్ జిల్లాలోనే ఎంతో చరిత్ర కలిగిన గవర్నమెంట్ సిటీ మోడల్ హై స్కూల్, ఆ కాలంలోనే ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యనందించి రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిన పాఠశాల నేడు జిల్లా విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఆట స్థలం లేక ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. చాదర్ఘాట్ లోని సిటీ మోడల్ స్కూల్ ఆవరణలో గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ చాదర్ఘాట్, ఓల్డ్ గవర్నమెంట్ సిటీ మోడల్ ప్రైమరీ స్కూల్, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ కట్టెలు గూడా,  నాలుగు స్కూలు  ఒకే భవనంలో కొనసాగుతున్నాయి. నాలుగు పాఠశాలలలో కలిపి  సుమారుగా పన్నెండు వందల మంది నిరుపేద విద్యార్థులు చదువుతున్నారు. , గతంలో ఈ స్కూల్ ప్రాంగణం సుమారుగా 12 ఎకరాల విస్తీర్ణంలో  ఉండేది రాను రాను కొంతమంది ప్రైవేటు వ్యక్తులు పాఠశాల స్థలాన్ని ఆక్రమించారు. గతంలో ప్రస్తుతం ఉన్న పాఠశాల ఆవరణంలో ఆజం పుర ఉన్నత పాఠశాల No 2, ఆజం పుర ఉన్నత పాఠశాల No 1 ఉండేది. కొంతకాలం అనంతరం ప్రక్కన ఉన్న సిటీ మోడల్ స్కూల్ ని ఈ భవనంలోకి మార్చినారు.  అప్పట్లో విద్యార్థులకు ఆటస్థలం తో సహా అన్ని సౌకర్యాలు ఉండేది. పాఠశాలలో అప్పటి విద్యాశాఖ అధికారులు  క్రీడలను ప్రోత్సహిస్తూ  ఆట పాటలు, క్రీడా పోటీలు అనేక కార్యక్రమాలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఉన్న విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యంతో పాఠశాలకు కనీసం ఆటస్థలం లేని పరిస్థితి ఏర్పడింది.  

హైదరాబాద్ నగరంలో రవాణా సౌకర్యార్థం మెట్రోరైలు నిర్మాణం ప్రారంభించడంతో  ఎల్బీనగర్ నుండి చందానగర్ వరకు హైదరాబాద్ మెట్రో రైల్ నిర్మాణం కొరకు భూసేకరణలో సిటీ మోడల్ పాఠశాల కొంత భూభాగాన్ని మెట్రో రైల్ అధికారులు తీసుకోవడం జరిగింది. జిల్లా విద్యాశాఖ అధికారులు, మెట్రో రైల్ నిర్మాణ అధికారుల మధ్య మెట్రో రైల్ నిర్మాణం కొరకు స్కూల్ స్థలాన్ని తీసుకున్నందుకు అన్ని సౌకర్యాలతో భవనాన్ని నిర్మించి, ఆట స్థలాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి ఇస్తామని మెట్రో రైల్ నిర్వాహక అధికారులు, విద్యా శాఖ అధికారుల మధ్య ఒప్పందం కుదిరింది. కానీ ఈ రోజు ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ  సుమారుగా 600 చదరపు గజాలు ఉన్న స్థలాన్ని విద్యార్థుల ఆటస్థలం కోరకు అభివృద్ధి చేసి ఇవ్వకుండా మెట్రో రైల్ అధికారులు ఆ స్థలాన్ని మెట్రో వాహనాల పార్కింగ్ కొరకు ఉపయోగించుటకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ విషయంపై విద్యార్థి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  విద్యార్థులు స్కూల్ ముందు మెట్రో రైల్ అధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా ధర్నా చేశారు. ఈ విషయంపై ప్రస్తుతం ఉన్న హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారి బి. వెంకట నరసమ్మ స్పందించి వెంటనే జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి విద్యార్థులకు ఆటస్థలం కేటాయించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కానీ సంవత్సరకాలం కావస్తున్న జిల్లా జాయింట్ కలెక్టర్ , జిల్లా విద్యాశాఖ అధికారి విద్యార్థుల సమస్యను మాత్రం ఇప్పటివరకు పరిష్కరించలేకపోయారు.ప్రతి విద్యా సంవత్సరం ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది.  ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో విద్యాశాఖ అధికారులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అట్టి సమయంలో విద్యార్థి తల్లిదండ్రులకు ప్రైవేట్ పాఠశాలలు వద్దు ప్రభుత్వ పాఠశాలలు ముద్దు అని, నాణ్యమైన ప్రభుత్వ పాఠశాలలో అందిస్తామని, అన్ని సౌకర్యాలు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయని  విద్యార్థి తల్లిదండ్రులకు తెలిపిన  విద్యా శాఖ అధికారులు. కానీ ప్రభుత్వ పాఠశాలలో  వాస్తవ పరిస్థితులు విరుద్ధంగా ఉన్నాయి. సిటీ మోడల్ స్కూల్ లో కనీసం విద్యార్థులు పాఠశాలలో జాతీయ పండుగలు జరుపుకోలేని పరిస్థితి . ఈ విషయంపై పలుమార్లు విద్యార్థి సంఘ నాయకులు జాయింట్ కలెక్టర్, జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోవడంలేదని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలో జీవో ఎంఎస్ నెంబర్ 1 ప్రకారము ఆటస్థలం ఉండాలి, నియమ నిబంధనలు పాటించాలి అని ఆదేశాలు జారీ చేసే జిల్లా విద్యాశాఖ అధికారులు, తన పర్యవేక్షణలో ఉన్న సిటీ మోడల్ పాఠశాలలో ఆట స్థలం లేక ఇక్కట్లు పడుతున్న విద్యార్థులకు ఆటస్థలం  కేటాయించలేక పోవడానికి  వారి విధి నిర్వహణ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు.ఆట స్థలం కేటాయించడంలో నిర్లక్ష్యం చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి పై వెంటనే చర్యలు సెక్స్ తీసుకోవాలి….. ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ అధ్యక్షులు నవీన్.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తామని, అన్ని సౌకర్యాలు కల్పిస్తామని ప్రగల్బాలు పలకడం తప్పించి ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు లేకుండా, ఆటస్థలాలు లేకుండా, క్రీడలను ప్రోత్సహించకుండా ప్రభుత్వ పాఠశాలను కొనసాగుతున్నాయి. సిటీ మోడల్ స్కూల్ సంబంధించిన స్థలాన్ని  విద్యార్థులకు ఆట స్థలంగా  కేటాయించడంలో నిర్లక్ష్యం చేసిన జిల్లా విద్యాశాఖ అధికారి పై వెంటనే చర్యలు తీసుకొని, జిల్లా కలెక్టర్ ఈ విషయంపై దృష్టి కేంద్రీకరించి వెంటనే విద్యార్థులకు ఆట స్థలం కేటాయించడానికి చర్యలు చేపట్టాలి.ఈ సమస్యకు పరిష్కారం దిశగా కోనసాగకపోతె ఆందోళనలు చేస్తాం. 

  వెంటనే విద్యార్థులకు ఆటస్థలాన్ని  కేటాయించాలి….. బీజేవైఎం నాయకుడు నవీన్ రెడ్డి 

ప్రభుత్వ స్కూల్లో అన్ని సదుపాయాలతో పాటు క్రీడలను కూడా ప్రోత్సహిస్తున్నారని విద్యార్థి  తల్లిదండ్రులకు తెలపడంతో వారు భారీగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించి నారు . సిటీ మోడల్ స్కూల్ లో ఆట స్థలం లేక పిల్లలు పాఠశాలకు హాజరు కావడానికి  ఆసక్తి కనబరచడం లేదు, పాఠశాల ప్రాంగణంలో ఉన్న ఆట స్థలాన్ని  కేటాయించకుండా  మెట్రో రైల్ నిర్వాహకులకు పార్కింగ్ కొరకు కేటాయించడంతో విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది,  వెంటనే  స్కూల్ ప్రాంగణంలోని ఆట స్థలాన్ని విద్యార్థులకు కేటాయించాలి. ఏ మాత్రం ఆటస్థలం కేటాయించడంలో నిర్లక్ష్యం చేస్తే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్ జిల్లా విద్యా శాఖ కార్యాలయ ముట్టడి కార్యక్రమం చేపడతాం.Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close