Featuredస్టేట్ న్యూస్

హైటెక్‌ సిటీ-రాయదుర్గం మెట్రో సేవలు ప్రారంభం

  • ప్రారంభించిన మంత్రులు కేటీఆర్‌, పువ్వాడ
  • హైదరాబాద్‌ మెట్రోకు రెండేండ్లు..

హైదరాబాద్‌

హైదరాబాద్‌ మెట్రో రైలు సేవలు మరింత విస్తరించాయి. ఐటీ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హైటెక్‌ సిటీ-రాయదుర్గం మార్గాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ శుక్రవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌తో కలిసి ఉదయం 10.15 గంటలకు ఫ్రారంభించారు. అనంతరం అక్కడి నుంచి మెట్రో రైల్‌లో మైండ్‌ స్పేస్‌ ముందున్న రాయదుర్గం స్టేషన్‌ వరకు ప్రయాణం చేశారు. ఆ తరువాత రోడ్డు మార్గంలో నానక్‌రాంగూడ ఫైనాన్షియల్‌ డిస్టిక్ట్‌ కు వెళ్లి అక్కడ బుల్‌ స్టాట్యూ ప్రారంభించారు. మెట్రో రైల్‌ ఎం.డి.ఎన్‌వీఎస్‌ రెడ్డి, రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీ ఎస్‌.కె.జొషీ, మున్సిపల్‌ అడ్మినిస్టేష్రన్‌ అండ్‌ అర్బన్‌ డెవలప్‌ మెంట్‌ స్పెషల్‌ సెక్రెటరీ అరవింద్‌ కుమార్‌, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రెండు స్టేషన్ల మధ్య ఒకటిన్నర కిలోమీటర్ల దూరం కాగా, ఐటీ ఉద్యోగులకు ఎంతో ఉపయోగపడుతుంది. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ప్రయాణికులను అనుమతించనున్నారు. దీంతో నాగోల్‌ నుంచి హైటెక్‌సిటీ వరకు నడిచే మెట్రో రైలు… మైండ్‌ స్పేస్‌ వరకు అందుబాటులోకి వచ్చింది. ఇప్పటివరకు 56 కిలోమీటర్ల మార్గంలో మెట్రో సేవలు అందుబాటులో ఉండగా, దీనికి మరో కిలోమీటరున్నర పెరిగింది. సరిగ్గా రెండేళ్ల కిందట నాగోల్‌- అమీర్‌పేట్‌- మియాపూర్‌ మార్గంలో తొలిసారిగా మెట్రో పరుగులు పెట్టింది. ఆ తర్వాత అమీర్‌పేట-ఎల్బీనగర్‌, ఈ ఏడాది మార్చిలో అమీర్‌పేట్‌ – హైటెక్‌సిటీ మార్గంలో మెట్రో సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం హైటెక్‌ సిటీ నుంచి రాయదుర్గం మధ్య ఒకటే స్టేషన్‌.. అయినా కారిడార్‌-3లో ఇది కీలకం. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఐటీ సంస్థలు ఉండగా, వీటిలో లక్షలాది మంది పనిచేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి హైటెక్‌ సిటీ వరకు ప్రస్తుతం మెట్రోలో వస్తున్న ఉద్యోగులు దుర్గం చెరువు, హైటెక్‌సిటీ స్టేషన్ల వద్ద దిగి మైండ్‌స్పేస్‌తో పాటు ఇతర ఆఫీసులకు షటిల్‌ బస్సులు, ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రస్తుతంమెట్రో ప్రారంభం కావటంతో ప్రయాణం సులువుకానుంది.

హైదరాబాద్‌ మెట్రోకు రెండేండ్లు..ఎన్నో రికార్డులు

హైదరాబాద్‌ మెట్రో ఆల్‌టైమ్‌ రికార్డ్‌ సృష్టిస్తోంది. 56 కిలోమీటర్లు.. 810 సర్వీసులు.. ప్రతి రోజూ దాదాపు 4 లక్షల మంది ప్రజలు జర్నీ చేస్తుంటారు. మెట్రోకు రెండేళ్లగా ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ప్రారంభమై రెండేళ్లు పూర్తౌెన రోజే.. మరో రూట్‌ అందుబాటులోకి వచ్చింది. హైటెక్‌సిటీ – రాయదుర్గం మధ్య సర్వీస్‌లను 2019, నవంబర్‌ 29వ తేదీ శుక్రవారం మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. పబ్లిక్‌ అండ్‌ ప్రైవేట్‌ పార్టిసిపేషన్‌ పద్ధతిలో నిర్మించిన మెట్రో రైల్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా రికార్డు సాధించింది. అలాగే దేశంలో ఢిల్లీ తర్వాత రెండో అతిపెద్ద నెట్‌వర్క్‌ కలిగి ఉన్న ప్రాజెక్టుగా కూడా హైదరాబాద్‌ మెట్రో పేరు దక్కించుకుంది. గత రెండు సంవత్సరాల్లో 12 కోట్ల 5లక్షల మంది మెట్రోలో ప్రయాణించారు. అంతే కాకుండా మొత్తం రెండు సంవత్సరాల కాలంలో 4లక్షలకు పైన ట్రిప్పులతో.. 86 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన ఘనత మెట్రోకే దక్కుతుంది. సిటీలో మెట్రో రైల్‌ రెండేండ్లు పూర్తి చేసుకుంది. 2017 నవంబర్‌ 28న ప్రధాని నరేంద్ర మోడీ మియాపూర్‌?లో సర్వీసులు ప్రారంభించారు. నవంబర్‌ 29 నుంచి నాగోలు టు మియాపూర్‌ సేవలు అందుబాటులోకి వచ్చాయి. జంట నగరాల పరిధిలో మొత్తం 66 మెట్రో స్టేషన్లతో 72 కిలో మీటర్ల మేర మెట్రో సేవలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కారిడార్‌ 1లో మియాపూర్‌ నుంచి ఎల్బీనగర్‌ వరకు 29 కిలో మీటర్లు, కారిడార్‌2 లో జేబీఎస్‌ నుంచి ఫలక్‌?నుమా వరకు15 కిలో మీటర్లు, కారిడార్‌ 3లో నాగోలు నుంచి రాయదుర్గం వరకు 28 కిలోమీటర్లు మెట్రో నిర్మించాలని ప్రతిపాదించారు. సాధారణ రోజుల్లో ప్రతి ఆరు నిమిషాలకు ఒక రైలును నడిపిస్తూ పీక్‌ అవర్స్‌?లో ప్రతి మూడు నిమిషాలకో ట్రైన్‌?తో సిటీజనాల కష్టాలు తీరుస్తోంది. ఇక నిన్నటి వరకూ సాగిన ఆర్టీసీ సమ్మె కాలంలో.. భాగ్యనగర ప్రజలు ఇబ్బందులు పడకుండా మెట్రో ఎంతో సహాయ పడింది. మధ్యలో చిన్న చిన్న అవరోధాలు ఎదురైనా అన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు దూసుకుపోతోంది. ఇక కారిడార్‌2లో భాగమైన జేబీఎస్‌ ఎంజీబీఎస్‌ వచ్చే నెలలో మొదలుపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులకు చెక్‌ పెడుతూ.. సౌండ్‌ పొల్యూషన్‌కి దూరంగా.. స్మార్ట్‌, ఎకో ఫ్రెండ్లీ విధానంతో హైదరాబాద్‌ మెట్రో దూసుకుపోతోంది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైటెక్‌సిటీ -రాయదుర్గం మెట్రో మార్గం కూడా అందుబాటులోకి వచ్చింది.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close