బిజినెస్

ఆయన సెలవుల విలువ ఐదు మిలియన్‌ డాలర్లు..!

ఎల్‌ అండ్‌ టీ చెయ్యిపట్టుకొని నడిపించిన మార్గదర్శి,ఆయన నిజమైన ‘నాయక్‌’

లార్సెన్‌ అండ్‌ టర్బో(ఎల్‌ అండ్‌ టీ) పరిచయం అక్కర్లేని సంస్థ. మౌలిక వసతుల రంగంలో ఎనలేని ముద్ర వేసిన ఈ కంపెనీ.. నవ భారత నిర్మాణానికి పటిష్ఠ పునాదులు వేయడంలో తనవంతు సహకారాన్ని అందిస్తూ వచ్చింది. అలాంటి ఓ ఉన్నత స్థాయి కంపెనీని కొత్త పుంతలు తొక్కించిన ఘనత ఆ కంపెనీ ప్రస్తుత ఛైర్మన్‌ అనిల్‌ మణిభాయ్‌ నాయక్‌(ఏ.ఎం.నాయక్‌)దే. విదేశీ యాజమాన్యం నుంచి దేశీయ అధిపతుల చేతికి వచ్చిన కంపెనీలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి ‘ఎల్‌ అండ్‌ టీ’ని నవ్య పథాన నడిపారు. ఈ క్రమంలో సొంత కుటుంబ బాధ్యతల్ని సైతం పక్కనబెట్టి ‘పనిరాక్షసి’లా కంపెనీకే అంకితమయ్యారు. తన 55 ఏళ్ల వ త్తి జీవితంలో ఒక్కరోజు కూడా సెలవు పెట ్టలేదంటే ఆయన నిబద్ధత ఎంటో అర్థం చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తి అసలు ‘ఎల్‌ అండ్‌ టీ’లో ఎలా చేరారు.. కంపెనీతో పాటు ఆయన ఎలా ఎదిగారో ఓ లుక్కేద్దాం..!

ఇంగ్లిష్‌తో ఇబ్బంది… ఏ.ఎం.నాయక్‌ దక్షిణ గుజరాత్‌లోని ఓ మారుమూల గ్రామంలో జూన్‌ 9, 1942న జన్మించారు. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. అప్పట్లో వీరి కుటుంబాన్ని టీచర్ల కుటుంబంగా జనాలు సంబోధిస్తుండేవారు. ఉద్యోగరీత్యా నాయక్‌ తండ్రి ముంబయిలో స్థిరపడ్డారు. కానీ, గ్రామాల పునర జ్జీవనంలో పాలుపంచుకోవాలన్న మహాత్మా గాంధీ పిలుపుతో తిరిగి సొంత గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో అనేక సేవా, సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు. దీంతో నాయక్‌ ప్రాథమిక విద్యాభ్యాసమంతా స్థానిక పాఠశాలల్లోనే సాగింది. అనంతరం ఇంజినీరింగ్‌ విద్యపై మక్కువతో ప్రవేశం కోసం సంవత్సరం పాటు వల్లభ్‌ విద్యానగర్‌లోని వి.పి.సైన్స్‌ కాలేజిలో సన్నద్ధమయ్యారు. బిర్లా విశ్వకర్మ మహావిద్యాలయలో మెకానికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా గ్రామీణ ప్రాంతాల్లో సాగడంతో ఆంగ్ల భాషపై నాయక్‌ పట్టు సాధించలేకపోయారు. ఉద్యోగ జీవితం ప్రారంభించడానికి తొలుత ఇది ఆయనకు ప్రతిబంధకంగా మారింది. విద్యాభ్యాసం పూర్తి కాగానే తండ్రి చేసిన సిఫార్సు లేఖను తీసుకొని ముకుంద్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ కంపెనీలో పనిచేస్తున్న వీరెన్‌ జె షా వద్దకు వెళ్లారు. అయితే ఆంగ్ల భాషా నైపుణ్యాలు మెరుగ్గా లేకపోవడంతో ఉద్యోగం ఇవ్వడానికి ఒప్పుకోలేదు.

40 మంది ఐఐటీయన్లను కాదని… ఓవైపు ఆంగ్ల భాషపై పట్టు కోసం పరిశ్రమిస్తూనే మరోవైపు ఉద్యోగ వేటనూ కొనసాగించారు నాయక్‌. మొత్తానికి చిన్న కంపెనీ అయిన నెస్టర్‌ బాయిలర్స్‌లో చేరారు. కానీ, ‘ఎల్‌ అండ్‌ టీ’పై ఉన్న మక్కువ ఆయన్ని అక్కడ ఎంతో కాలం ఉంచలేదు. యాజమాన్యం మారడంతో అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. అదే సమయంలో ప్రపంచ మేటి ఎలక్ట్రానిక్‌ సంస్థల్లో ఒకటైన ఫిలిప్స్‌ నుంచి కూడా ఆయనకు ఇంటర్వ్యూ లెటర్‌ అందింది. కానీ, ఎల్‌ అండ్‌ టీ కోసం ఫిలిప్స్‌ వద్ధనుకున్నారు. అయితే సంస్థలో ప్రవేశం ఆయనకు అంత సులువేమీ కాలేదు. నాయక్‌ వంతు వచ్చేసరికి దాదాపు 40 మంది ఐఐటీయన్లను ముఖాముఖి బ ందం తిరస్కరించింది. తొలి రౌండ్‌లో నాటి మేనేజర్‌ ఇ.టి. బేకర్‌.. నాయక్‌ నైపుణ్యాలకు ముగ్ధుడయ్యారు. మంచి ప్యాకేజీ ఇవ్వడానికి కూడా సిద్ధమయ్యారు. కానీ, రెండో రౌండ్‌లో బేకర్‌ బాస్‌ గున్నార్‌ హన్సెన్‌ మాత్రం నాయక్‌ను తిరిగి జూనియర్‌ ఇంజినీర్‌గా చేరమని సలహా ఇచ్చారు. అదీ నెస్టర్‌ బాయిలర్స్‌లో తీసుకున్న తీసుకున్న కంటే తక్కువ వేతనంతో. అయినా నాయక్‌ అంగీకరించారు. అలా 1965, మార్చి 15న రూ.670 నెలవారీ వేతనంలో ఆయన ఎల్‌ అండ్‌ టీ ప్రస్థానం ప్రారంభమైంది. తన ప్రత్యేక నైపుణ్యాలు, నిబద్ధతతో అతి తక్కువ కాలంలోనే పదోన్నతులు పొందారు. సంస్థ ప్రతి హోదాలో పనిచేశారు. 2003లో కంపెనీ ఛైర్మన్‌ని ఎన్నుకోవాల్సిన సమయంలో ఆయన తప్ప ఇంకెవరూ ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహించలేరన్న స్థాయికి చేరుకున్నారు.

ఒక్క సెలవూ పెట్టలేదు… తనకు అప్పగించిన బాధ్యతను సమర్థంగా నిర్వహించేందుకు నాయక్‌ ఎంత దూరమైనా వెళ్లారు. నిరంతరం శ్రమించారు. కుటుంబ బాధ్యతల్ని సైతం పట్టిం చుకోలేదు. వ్యాపార వర్గాల్లో పని రాక్షసిగా ముద్ర వేయించుకున్నారు. ఆయనలో ఉన్న ఈ లక్షణాలే కంపెనీని ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు సహకరించాయి. అనారోగ్య కార ణాలరీత్యా ఒకటి, రెండు సందర్భాల్లో తప్ప ఎప్పుడూ సెలవు పెట్టలేదంటే కంపెనీ పట్ల, దాని అభివద్ధి పట్ల ఆయనకున్న ప్యాషన్‌ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. వ్యాపారాల్లో కాలాను గుణంగా వస్తున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు కంపెనీలో ప్రవే శపెట్టారు. సాంకేతికను జోడించారు. భౌగోళిక, రాజకీ యంగా వస్తున్న మార్పుల్ని సైతం అవకాశాలుగా మలు చుకు న్నారు. అనేక రంగాలకు ఎల్‌ అండ్‌ టీ సేవల్ని విస్తరిం చారు. ఆయన నేత త్వంలోనే కంపెనీ ఐటీ, న్యూక్లియర్‌ పవర్‌, ఏరోస్పేస్‌, మౌలికవసతలు, నీరు-వ్యర్థాల శుద్ధి, ఆర్థిక సేవలు సహా మరికొన్ని రంగాలకు విస్తరించింది. అయితే కంపెనీ కార్యక లాపాల్ని విస్తరించడమే కాదు.. భారంగా మారిన పోర్ట్‌ఫో లియో లకు స్వస్తి పలకడానికి ఏమాత్రం వెనకాడలేదు.

ఉద్ధండుల నుంచి సంస్థను కాపాడి… కంపెనీని విస్తరించే క్రమంలో అంబానీ, బిర్లా లాంటి ఉద్ధండులతోనూ నాయక్‌ తలపడ్డారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఒకానొక దశలో ఎల్‌ అండ్‌ టీని టేకోవర్‌ చేసేందుకు ప్రయత్నించింది. కానీ అది సాధ్య పడలేదు. దీంతో అప్పటికే తమ వద్ద ఉన్న వాటాల్ని ఆదిత్య బిర్లాకు చెందిన గ్రాసిమ్‌కు విక్రయించేశారు. దీంతో కంపెనీలో ఆదిత్య బిర్లా గ్రూపు క్రియాశీలకంగా మారింది. యాజమాన్యం మారే పరిస్థితులు ఏర్పడ్డాయి. కానీ, నాయక్‌ తన చతురతతో ఎల్‌ అండ్‌ టీ మౌలిక స్వరూపం మారకుండా జాగ్రత్త పడ్డారు. సిమెంట్‌ ఇండస్ట్రీలో రారాజుగా ఎదగాలనకుంటున్న బిర్లా కలని పసిగట్టారు. ఎల్‌ అండ్‌ టీలోని సిమెంట్‌ వ్యాపారాన్ని వదులు కునేందుకు సిద్ధమయ్యారు. ప్రతిగా సంస్థ ఉద్యోగులతో కలిసి ‘ఎంప్లాయిస్‌ ఫౌండేషన్‌’ ఏర్పాటు చేసి గ్రాసిమ్‌ షేర్లన్నింటినీ తిరిగి ‘ఎల్‌ అండ్‌ టీ’కి చేర్చారు. అలా సంస్థ ఉనికిని కాపాడగలిగారు.

అదొక్కటే ఆయన చేసిన తప్పట…

కంపెనీ పట్ల తనకున్న నిబద్ధత, అంకితభావంతో వ్యాపార వర్గాల్లో పని రాక్షసి ముద్ర వేయించుకున్న నాయక్‌ కుటుంబం కోసం మాత్రం సమయం కేటాయించలేకపోయారు. తన జీవితంలో ఏదైనా పశ్చాత్తాపం ఉందా అంటే ఇదొక్కటే అంటారు. అలాగే తాను చేసిన ఏకైక తప్పు తన కొడుకు జిగ్నేష్‌, కూతరు ప్రతీక్షను విదేశాలకు పంపడమేనంటుంటారు. భారత్‌కు తిరిగి రావాలని వారికి ఇప్పటికీ సూచిస్తుంటారట. 1991లో దేశవ్యాప్తంగా నెలకొన్న అస్థిర పరిస్థితుల కారణంగా మెరుగైన విద్యాభ్యాసం కోసం కొడుకును విదేశాలకు పంపారు నాయక్‌. ఇక కూతరు ప్రతీక్ష.. పెళ్లైన తర్వాత అమెరికాలోనే డాక్టర్‌గా సెటిల్‌ అయ్యారు.

75 శాతం సంపద దాతత్వానికే… స్వయంకషితో సంస్థలో అంచెలంచెలుగా ఎదిగిన నాయక్‌.. దాతత్వ కార్యక్రమాల్లోనూ ముందున్నారు. తన సంపదలో 75 శాతం సామాజిక సేవకే ఇస్తానని హామీ ఇచ్చారు. ఒకవేళ ఆయన పిల్లలు భారత్‌కు తిరిగి రాకపోతే ఆ 75 శాతం కాస్త 100 శాతం కూడా కావొచ్చన్నారు. ఆ మొత్తాన్ని తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో విద్య, వైద్య తదితర రంగాల్లో ప్రజలకు సేవలందించేందుకు ఉపయో గించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇలా తాను ఎంచుకున్న రంగంలో విశేష సేవలు అందించి.. దేశ పారిశ్రామిక రంగ అభివద్ధిలో తనదైన పాత్ర పోషించిన అనిల్‌ కుమార్‌ మణిభాయ్‌ నాయక్‌ను భారత ప్రభుత్వం రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌తో సత్కరించింది. జూనియర్‌ ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరి తన కషి, పట్టుదలతో కంపెనీలో అత్యున్నత పదవిని అలంకరించారు నాయక్‌. దాదాపు అర శతాబ్దం పాటు నిరంతర పరిశ్రమతో కంపెనీని ఉన్నత శిఖరాలకు చేర్చిన అనిల్‌ మణిభాయ్‌ నాయక్‌ జీవితం ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకం.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close