హిందీ ‘అర్జున్‌ రెడ్డి’ ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్‌

0

టాలీవుడ్‌ లో సెన్షేషనల్‌ హిట్‌ అయిన ‘అర్జున్‌ రెడ్డి’ చిత్రంను హిందీలో ‘కబీర్‌ సింగ్‌’ గా రీమేక్‌ చేస్తున్న విషయం తెల్సిందే. విజయ్‌ దేవరకొండ షాలిని పాండే ఒరిజినల్‌ వర్షన్‌ లో నటించగా హిందీ రీమేక్‌ లో షాహిద్‌ కపూర్‌ మరియు కియారా అద్వానీలు జంటగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయినట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రకటించారు. ఇదే సమయంలో సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. ట్రైలర్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు యూనిట్‌ సభ్యులు గుడ్‌ న్యూస్‌ చెప్పారు. మే 13వ తారీకున ‘కబీర్‌ సింగ్‌’ ట్రైలర్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుపుకుంటున్న ఈ చిత్రంను జూన్‌ 21న విడుదల చేయాలని భావిస్తున్నారు. అర్జున్‌ రెడ్డిని మించిన బోల్డ్‌ కంటెంట్‌ ఈ చిత్రంలో ఉంటుందని దర్శకుడు సందీప్‌ వంగ ఒరిజినల్‌ ఫ్లేవర్‌ మిస్‌ అవ్వకుండా కొన్ని సీన్స్‌ ను యాడ్‌ చేయడంతో పాటు రొమాన్స్‌ ను మరింతగా జోడించినట్లుగా తెలుస్తోంది. తెలుగు తమిళ చిత్రాలు హిందీలో రీమేక్‌ అయ్యి చాలా వరకు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఈమద్యే తెలుగు ‘టెంపర్‌’ చిత్రం రణ్‌ వీర్‌ సింగ్‌ రీమేక్‌ చేసి మంచి విజయాన్ని దక్కించుకున్నాడు. ఇప్పుడు కబీర్‌ సింగ్‌ కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందనే నమ్మకం సినీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. బాలీవుడ్‌ ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యేలా అర్జున్‌ రెడ్డి కథ ఉంటుంది. అందుకే హిందీలో ఈ చిత్రం తప్పకుండా దుమ్ము రేపడం ఖాయంగా చిత్ర యూనిట్‌ సభ్యులు నమ్మకంగా ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here