హైవే పెట్రోలింగ్ అధికారులు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలి

0

కరీంనగర్ పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి

హైవే పెట్రోలింగ్ అధికారులు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని కరీంనగర్ పోలీస్ కమీషనర్ విబి కమలాసన్ రెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రులకు తరలించి మెరుగైన వైద్య సేవలు అందించాలని పేర్కొన్నారు.

శుక్రవారం నాడు కరీంనగర్ కమీషనర్ కేంద్రంలో హైవే పెట్రోలింగ్ అధికారులతో పోలీస్ కమిషనర్ విబి కమలాసన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో బాధితులను ఒక గంటలోపు మెరుగైన వైద్య సౌకర్యం కల్పించినట్లయితే 90% ప్రాణాలను కాపాడవచ్చని అన్నారు. ప్రమాదాల సమాచారం అందిన వెంటనే 108 అంబులెన్స్ లకు సమాచారం అందించాలన్నారు. అంబులెన్సుల రాక ఆలస్యం అయినట్లయితే హైవే పెట్రోలింగ్ వాహనాలు ల్లోనే బాధితులను ఆసుపత్రులకు ఆలస్యం లేకుండా తరలించాలని సూచించారు. 50% రోడ్డు ప్రమాదాలను తగ్గించాలని ఉద్దేశంతో హైవే పెట్రోలింగ్ ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. హైవే పెట్రోలింగ్ వాహనాల అధికారులు మెరుగైన సేవలు అందించి పోలీస్ శాఖ ప్రతిష్టను పెంపొందించాలని కోరారు. సమర్థవంతమైన సేవలందించే అధికారులకు రివార్డులను అందజేస్తామని ప్రకటించారు. విధుల్లో బాధ్యతలను విస్మరించే వారిపై శాఖాపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ డిసిపి (పరిపాలన)ఎస్ శ్రీనివాస్ ఇన్స్పెక్టర్లు మహేష్ గౌడ్, సదానందం, సంతోష్ కుమార్,దామోదర్ రెడ్డి, తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here