Featuredస్టేట్ న్యూస్

అత్యాధునికంగా ఉద్యాన విశ్వవిద్యాలయం

  • అన్ని హంగులతో ఆధునిక కూరగాయల మార్కెట్‌
  • లాంఛనంగా ప్రాంభించిన సిఎం కెసిఆర్‌
  • అధికారులతో వివరాలపై ఆరా
  • గజ్వేల్‌లో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం

గజ్వేల్‌

సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ములుగులో నూతనంగా నిర్మించిన అటవీ కళాశాల, పరిశోధన కేంద్రాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు. అనంతరం కళాశాల ఆవరణలో సీఎం కేసీఆర్‌ మొక్క నాటారు. ఈ సందర్భంగా కళాశాలలోని సిబ్బంది, విద్యార్థులతో సీఎం ముచ్చటించారు. ప్రాంగణమంతా కలియతిరిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు కూడా నిర్మాణంతో పాటు, వివిధ రకాల సౌకర్యాల ఏర్పాటుకు సంబంధించి వివరించారు. ఉద్యాన కళాశాలను 47కోట్ల వ్యయంతో నిర్మించారు. అత్యాధునిక హంగులతో ఇది రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌ రావు, ఈటెల రాజేందర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, నిరంజన్‌ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి. చీఫ్‌ కన్జర్వేటర్‌ రాధ, వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి,ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తమిళనాడులోని గట్టుపాలయం ఫారెస్ట్‌ కాలేజీ దేశంలోనే అత్యధిక సంఖ్యలో 120 మంది ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ (ఐఎఫ్‌ఎస్‌) అధికారులను అందించింది. అంతకంటే ఎక్కువమంది ఐఎఫ్‌ఎస్‌లను తెలంగాణ నుంచి తయారుచేసేందుకు వీలుగా దేశం గర్వించే రీతిలో ఫారెస్ట్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని భావించిన సీఎం కేసీఆర్‌ ఆలోచనకు అనుగుణంగా ములుగులో ఫారెస్ట్‌ కాలేజీ రూపుదిద్దుకున్నది. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న ఫారెస్ట్‌ కాలేజీని పూర్తిస్థాయి లేదా డీమ్డ్‌ యూనివర్సిటీగా ¬దా పెంచడానికి ప్రభుత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నది. దూలపల్లి ఫారెస్ట్‌ అకాడమీలో తాత్కాలికంగా కొనసాగుతున్న బీఎస్సీ ఫారెస్టీ కోర్సులు నూతన క్యాంపస్‌లోకి మారనున్నాయి. 2020 నుంచి ఎమ్మెస్సీ, పీహెచ్‌డీతోపాటు ఏకకాలంలో ఫారెస్ట్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఫారెస్ట్‌ కాలేజీ పరిపాలనా భవనాన్ని దాదాపు 12 ఎకరాల పరిధిలో, రెండు లక్షల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించారు. దీని నిర్మాణానికి ప్రభుత్వం రూ.75 కోట్లు మంజూరు చేసింది. గజ్వేల్‌ నియోజవకవర్గం నర్సంపల్లి రిజర్వ్‌ఫారెస్ట్‌ బ్లాక్‌లో సువిశాల ప్రాంతంలో పరిపాలనా విభాగం, తరగతి గదులు, సెమినార్‌ హాల్స్‌, ల్యాబ్‌లు, హాస్టళ్లు, క్యాంటీన్‌లు, ఆడిటోరియం, రైతు హాస్టళ్లు, గెస్ట్‌హౌస్‌లు, పరిశోధనా విభాగాలను ఏర్పాటుచేశారు. అటవీవనరులు, అటవీ ఉత్పత్తుల యాజమాన్యం, వాటి వాడకం, అటవీ సాంఘిక శాస్త్రం, సామాజికశాస్త్రంతోపాటు వన్యప్రాణి శాస్త్రం, పట్టణాల్లో అడవుల పెంపకం, సుందరీకరణ, సిల్వికల్చర్‌ విధానాలపై వివిధ విభాగాలుంటాయి. ఇకపోతే ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ను కూడా సిఎం కెసిఆర్‌ ప్రారంభించారు. ఇందులో కూరగాయలతో పాటు మాంసం ఉత్పత్తులు కూడా లభించనున్నాయి. మార్కెట్‌ మొత్తాన్ని అధునాతనంగా తీర్చిదిద్దారు. ఇక్కడే కూరగాయలు ఖరీదుచేసిన సిఎం 2వేల రూపాయలు ఇచ్చి వారిని అభినందించారు. మార్కెట్‌ విరాలు అడిగి తెలుసుకున్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close