Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలు

ఇక్కడ మా ఇష్టం… అక్కడ ప్రజాభీష్టం

శభాష్‌ పోలీస్‌

అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌

ఇద్దరు కవిూషనర్లు స్వత హాగా మృదుస్వభావులు. అన్యాయాలను, అక్రమాలను, దౌర్జన్యాలను సహించరు. అయితే ఖమ్మం కవిూషనర్‌ను కిందస్థాయి ఉద్యోగులు తప్పుదారి పట్టిస్తుండగా… నిజామాబాద్‌ కవిూషనర్‌ మాత్రం చెక్‌.. డబుల్‌ చెక్‌.. ఫైనల్‌ చెక్‌ అంటూ ముందుకు సాగుతున్నారు. బంగారు తెలంగాణలో బెస్ట్‌ పోలీసింగ్‌ తీరుకు దర్ప ణం పట్టే విరుద్ద సంఘటనలు కొద్ది గంటల వ్యవధిలో చోటు చేసుకున్నాయి. ప్రజలు కట్టే పన్నులతో జీతభ త్యాలు పొందే పోలీసులు ఖమ్మం జిల్లాలో హైకోర్టులో కేసు ఉండగా… ఆదేం తెలి యనట్లు వ్యవహరిస్తూ.. ఓ విధంగా విమ ర్శలు పాలవుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో ఆదర్శవంతంగా ముందుకు సాగటం గమనార్హం.

ఖమ్మంలో ఇదీ విషయం: బాధితుల కథ నం, పోలీసు రికార్డుల ప్రకారం…క్రైం నెంబర్‌ 348 /2017లో

22-08-2012 సైదులుకు పగడాల కృష్ణవేణికి వివాహం జరిగింది. తరువాత ఆ కుటుంబం పై వరకట్న వేధింపుల చట్ట ప్రకారం విూద కేసులు పెడతామని, లేదంటే చంపుతామని బెదిరించి పగడాల అనంతరాములు, ఆయన తమ్ముడు పగడాల మల్లేశ్‌, పగడాల కృష్ణ వేణి అలియాస్‌ చెక్కల కృష్ణవేణిలు కలిసి నాలుగు లక్షల రూపాయలు వసూలు చేశారు. 2011లో చెక్కల ఉమామహేశ్వరావుతో కృష్ణవేణికి శ్రీశైలంలో జరిగిన తొలి వివాహం విషయం దాచిపెట్టి, అతనితో విడాకులు తీసుకోకుండా సైదులుతో వివాహం చేసి మోసం చేశారు. క్రైం నెంబర్లు 546/2013, 41/2014, ఈ కేసులలో పూర్తి సాక్ష్యాధారాలతో అభియోగ పత్రాలు నమోదు చేయబడలేదు.

గత చరిత్ర:

క్రైం నెంబర్‌ 117/2011లో పోలీసు అధికారులను తప్పుదారి పట్టించిన వైనం. చెక్కల ఉమామహేశ్వరరావు అనే వ్యక్తితో 24-05-2011వ తేదీన పగడాల కృష్ణవేణి గత చరిత్ర ప్రకారం ఆ మరుసటి రోజున శ్రీశైలంలో 25-05-2011న వివాహం చేసుకున్నారు.

అయితే పగడాల అనంతరాములు, ఆయన తమ్ముడు పగడాల మల్లేశ్‌ లు చాలా తెలివిగా చెక్కల ఉమామహేశ్వరరావు కృష్ణవేణిలు పెళ్లి చేసుకున్న ఐదు రోజుల తర్వాత అనగా 28-05-2011న ఖానాపురం హవేలి పోలీసు స్టేషన్‌ లో క్రైం నెంబర్‌ (117/2011) తప్పుడు పిర్యాదు చేశారు. ఈ పిర్యాదులో చెక్కల కృష్ణవేణి వయస్సు (2011) నాటీకి 19 సంవత్సరాలు కాగా, 17 సంవత్సరాల మైనరు బాలికగా పేర్కొంటూ నాటి పోలీసులను తప్పు దారి పట్టించారు. క్రైం నెంబర్‌ 94/2016 కేసులో పూర్తిగా విచారణ చేయకుండానే మూసివేత నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసును హైకోర్టు పోలీసు కమిషనర్‌ ను విచారణ జరిపి అఫిడవిట్‌ దాఖలు చేయాలని చెప్పి నప్పటికీ.. ఆగ మేఘాల విూద హైకోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకంగా కేసు మూసివేసినట్లు జిల్లా న్యాయస్థానంకు తెలిపారు. పగడాల కుటుంబ సభ్యులు చెక్కల కృష్ణవేణి అలియాస్‌ పగడాల కృష్ణవేణిని అడ్డుగా పెట్టుకొని అమాయకులను పెళ్ళి పేరుతో వల విసిరి, ఆ తరువాత కేసులు పెడతామని, చంపుతామని బెదిరించి లక్షల రూపాయలను వసూలు చేయడం ”ఒక వ్యాపారం”గా మార్చుకున్నారని రెడ్డిబోయిన సైదులు తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సూత్రధారి – సెటిల్‌ మెంట్లు:

ఈ అన్ని కేసుల్లోనూ అసలు సూత్రధారి పగాడాల మల్లేష్‌ అలియాస్‌ మల్లిగాడు అలియాస్‌ అర్భన్‌ సెటిల్‌ మెంట్‌ గాడు కీలక వ్యక్తి అని ఓ కేసులో బాధితులు హ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఓ మహిళ ఏకంగా ఈ నీచుడిని చంపడానికి ప్రభుత్వశాఖనే ఆయుధాలు ఇవ్వండని కోరింది.(ఆయితే ప్రభుత్వ అనుమతి కోరిన ఒంటరి, నిర్భాగ్య మహిళపై కేసు పెట్టడం పోలీసుశాఖకే చెల్లింది.) ఈ వ్యక్తి వెనుక ఓ ప్రజాప్రతినిధి ఉన్నట్లు మల్లేష్‌ స్వయంగా చెప్పిన ఆడియోలు ఉన్నాయి. ఇతగాడు స్థానిక పోలీస్టేషన్‌ లను కేంద్రంగా చేసుకొని భూ సెటిల్‌ మెంట్లు చేస్తున్న విషయం, ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన ఫిర్యాదు అందినట్లు తెలిసింది.

ప్రస్తుతం:

బంగారం దోపిడి, ఇంటివిూద దౌర్జన్యం, హైకోర్టులో సెక్షన్లు మార్చాలనే కేసు పెండింగ్‌ లో ఉండగానే… ఈ విషయాలను జిల్లా కోర్టుకు తెలియజేయకుండా… బాధితురాలు హైమావతి పెట్టిన కేసులో సాక్ష్యాలుగా పోలీసుశాఖ బాధితులను పిలవడం ఆశ్చర్యకరం. అభినందనీయం.

ఃనీలీ

నిజామాబాద్‌ లో నిఖార్సయిన కవిూషనర్‌:

పోలీస్శాఖలో కొత్తగా ‘వర్టికల్‌’ విధానాన్ని అమలుచేయనున్నారు. ఇక ఎవరి పనులు వారు నిర్వర్తించటమే దీని ముఖ్య ఉద్దేశం. కేటాయించిన పనికి అన్నివిధాలుగా వారే బాధ్యులు అవుతారు. ఠాణా ఎస్హెచ్వో నుంచి కిందిస్థాయి ¬ంగార్డు వరకు ఇది వర్తిస్తుంది. 5ఎస్‌ విధానంలో భాగమైన ఈ వర్టికల్‌ విధానం అమలుచేయటం ద్వారా సమూళ ప్రక్షాళన సాధ్యమవనుందని ఉన్నతాధికారుల యోచన.

I కమిషనరేట్లో వర్టికల్‌ విధానం అమలుచేయడానికి సీపీ కార్తికేయ శనివారం ఏసీపీలు, సీఐలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా చర్చించారు. ఉన్నతాధికారులు జారీ చేసిన మార్గదర్శకాలపై సమాలోచనలు చేసి కమిషనరేట్లో పక్కాగా అమలుచేయాల్సిన ఆవశ్యకతను వారికి వివరించారు. అన్ని ఠాణాల ఎస్‌.హెచ్‌.వోలు పక్కాగా అమలుచేసేలా సీఐలు బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.

పదకొండు అంశాలు

వర్టికల్‌ విధానాన్ని మొత్తం పదకొండు అంశాలుగా విభజించారు. స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌, సెక్షన్‌ ఇన్ఛార్జి, రిసెప్షన్‌ స్టాఫ్‌, స్టేషన్‌ రైటర్‌, ఇన్వెస్టిగేషన్‌ రైటర్‌, బ్లూకోట్స్‌, డిటెక్టివ్‌ స్టాఫ్‌, వారెంట్స్‌ స్టాఫ్‌, టెక్నికల్‌ టీమ్‌, కోర్టు స్టాఫ్‌, ట్రాఫిక్‌ స్టాఫ్‌ అంశాలుగా పరిగణించాల్సి ఉంటుంది.

? ఒకరు నిర్వర్తించే బాధ్యతలకు వారే పూర్తి బాధ్యత తీసుకోవాలి. సంఘటన ఏదైనా, సమయం ఎప్పుడైనా సంబంధిత సిబ్బంది తీసుకొన్న పనిని సకాలంలో పూర్తిచేయాల్సి ఉంటుంది.

? కార్పొరేట్‌ కంపెనీలు, బ్యాంకులు తదితర ప్రజాసేవల రంగంలో ఉన్నమాదిరి ఎవరి పనిని వారు మాత్రమే పూర్తిచేయాలి. సెలవులు, ఇతర కారణాలతో విధుల్లో ఉండని సమయాల్లో ఎస్హెచ్వోలు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటారు.

? అన్ని ఠాణాల్లో అంశాల వారీగా సిబ్బంది పేర్లు, ఫోన్‌ నంబర్లను ప్రత్యేకంగా పొందుపరాల్సి ఉంటుంది.

ముగింపు:

చట్టం ఎవరికీ చుట్టం కాదు. కాకూడదు. బాధితులు బలహీనులు.. దౌర్జన్యకారులు బలవంతులైతే.. చట్టంలోని సెక్షన్లు.. న్యాయం మారితే .. ఈ దేశంలో న్యాయదేవత ఒడిలో బాధితులు ఓదార్చబడతారా..? దౌర్జన్యకారులు లాభ పడతారా… మేరా భారత్‌ మహాన్‌. జైహింద్‌.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close