Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలు

ఇదిగో ఆధారం ఇంకెప్పుడు చర్యలు

రెండు వందల శాతం అధిక ధరతో

ఈఎస్‌ఐలో మందుల కొనుగోలు

  • ఆధారాలు సమర్పిస్తున్న ఆదాబ్‌ హైదరాబాద్‌
  • చర్యల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది మంది కార్మికులు
  • మందులు లేక సంక్షోభం దిశగా కార్మికుల ఆరోగ్యం
  • ప్రేక్షక పాత్ర వహిస్తున్న తెరాస ప్రభుత్వం

హైదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): కేంద్ర ప్రభుత్వం ఈ ఎస్‌ ఐ కార్పొరేషన్‌ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి బీమా చెల్లిస్తున్న కార్మికుల ఆరోగ్య సంక్షేమం కొరకు ప్రతి ఐపి పై గత సంవత్సరంలో రూపాయలు 2150 చొప్పున రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు విడుదల చేశారు. ఈ సంవత్సరం నుండి కార్మికుడి ఆరోగ్య సంక్షేమం పై కేంద్ర ప్రభుత్వం ద ష్టి కేంద్రీకరించి వారికి ఉత్తమమైన వైద్య చికిత్సలు, పూర్తిస్థాయిలో ఔషధాలు అందించాలని గొప్ప ఉద్దేశంతో ఈ ఎస్‌ ఐ కార్పొరేషన్‌ ద్వారా బీమా చెల్లిస్తున్న కార్మికునికి రూపాయలు 3000 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులను విడుదల చేశారు. సుమారుగా 18 లక్షల మంది కార్మికులు ఈ ఎస్‌ ఐ కార్పొరేషన్‌ కు భీమ చెల్లిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వైద్య సదుపాయాల కోసం నిధులను విడుదల చేయకుండా దారి మళ్లిస్తున్నారు అని విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలుస్తుంది. దీర్ఘకాలిక రోగాలతో, విష జ్వరాలతో, ప్రాణాంతకమైన రోగాలతో తీవ్రమైన ఇబ్బందికి గురి అవుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా, చెల్లించిన బీమా సొమ్మును మెరుగైన వైద్య చికిత్సను అందించడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నిధులను విడుదల చేస్తే ప్రముఖ నాయకులు, అధికారులు కొమ్ము కై కార్మికుల డబ్బులను ఔషధాల కొనుగోలు పేరుతో కాజేశారని తెలిసినా కూడా చర్యలు తీసుకోకపోవడం ఆంతర్యం ఏమిటో అర్థంకాని ప్రశ్నగా మారింది. ఇంతటి దుర్మార్గమైన అవినీతి అధికారులపై ప్రభుత్వం చర్యలకు వెనుకంజ వేయడానికి బలమైన కారణాలే అగుపిస్తున్నాయి. ఈ కుంభకోణంలో బడా నాయకుల హస్తం ఉండటంతోనే ఏసీబీ దర్యాప్తు చేస్తుందనీ, కమిషనర్‌ ఆఫ్‌ ఎంక్వైరీ దర్యాప్తు చేస్తోందనీ ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తున్నారు అని స్పష్టంగా అర్థమవుతుంది. కేంద్ర ప్రభుత్వం కార్మికుల ఆరోగ్య సంక్షేమం కొరకు నిధులను విడుదల చేయడంలో ఎలాంటి జాప్యం చేయకుండా సక్రమంగా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు కేటాయిస్తే ఎంతో మంది కార్మికులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో, విష జ్వరాలతో, ప్రాణాంతకమైన రోగాలతో బాధపడుతున్న వారి ఆరోగ్య సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత గల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసమని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. మాజీ కార్మిక మంత్రి, ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ సంచాలకులు, అధికారులు కుమ్ముక్కై ఔషధాల కొనుగోలులో భారీ ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని కార్మికులు ఆరోపిస్తున్నారు. అధికారులపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ నివేదిక అందినా కూడా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి నివేదిక ఆధారంగా సంబంధిత అధికారులపై ఈ రోజు వరకు కూడా చర్యలు చేపట్టకపోవడం తో ఎన్నో అనుమానాలకు తావిస్తుంది. ఈ ఔషధాల కొనుగోలు కుంభకోణంలో తెరవెనుక ప్రధానమైన పెద్ద నాయకులు అవినీతి బాగోతం బట్టబయలు అవుతుందనే డైరెక్టర్‌ దేవికారాణి, ఇతర అధికారుల పై చర్యలు తీసుకోవడంలేదని కార్మిక నాయకులు ఆరోపిస్తున్నారు. ఇంత భారీ ఎత్తున కుంభకోణం జరిగిందని నివేదిక ఆధారంగా బట్టబయలు అవుతున్న కార్మిక శాఖ మంత్రి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం శోచనీయం. కమీషన్లకు కక్కుర్తిపడి రేట్‌ కాంట్రాక్ట్‌ ధరల కంటే రెండు వందల శాతం పైగా అధికంగా ధర నిర్ణయించి కొనుగోలు చేసిన దేవికారాణి. ఈ విషయాన్ని విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ అధికారులు వారు సమర్పించిన నివేదికలో స్పష్టంగా అంకెల పరంగా వివరించడం జరిగింది ఈ క్రింది పట్టికను చూడగలరు.

రిపోర్ట్‌ కాపీ….

ఔషధాల కొనుగోలులో భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డ వారికి శిక్షించాల్సిందే

  • బీజేపీ సిటీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాంచందర్‌ రావు

బీమా చెల్లిస్తున్న ప్రతి కార్మికునికి పూర్తి వైద్య సేవలు, ఔషధాలు అందించవలసిన బాధ్యతగల ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ డైరెక్టరేట్‌ అధికారులు స్వార్థ ప్రయోజనాల కోసం వారికి నచ్చిన ఏజెన్సీ వారికి ఔషధాల సరఫరా కొరకు లోపాయకారి ఒప్పందాల తో టెండర్లు ఖరారు చేసి భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఎంతో మంది కార్మికులు ప్రాణాంతకమైన రోగాలతో ఇబ్బందిపడుతున్న రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా , ఆరు నెలల నుండి కార్మిక రాజ్య భీమా దవాఖానాల్లో, డిస్పెన్సరీలలో మందులు లేకపోవడం బాధాకరం. ఔషధాల కొనుగోలులో భారీ ఎత్తున అవకతవకలను గుర్తించి విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించి ఏడు మాసాలు గడిచిన కూడా ఈ రోజు వరకు చర్యలు తీసుకోక పోవడానికి ఆంతర్యము ఏంటో అర్థం కావడం లేదు. ఈ కుంభకోణంలో కొంతమంది బడా నాయకుల హస్తం ఉండటంతోనే చర్యలు తీసుకోవడానికి భయపడుతున్నారా? . అవినీతికి పాల్పడ్డ వారు ఎంతటి వారైనా ఉపేక్షించకుండా శిక్షించాల్సిందే. ఈ విషయంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరితంగా పూర్తిస్థాయిలో వైద్య చికిత్సలతో పాటు మందులు కార్మికులకు అందే విధంగా చర్యలు చేపట్టాలి లేని పక్షాన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంది.

మందుల కొనుగోళ్లలో భారీగా అవినీతికి పాల్పడ్డ అధికారులను వెంటనే సస్పెండ్‌ చేయాలి

  • పీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్‌

మందుల కొనుగోలులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని విజిలెన్స్‌ అండ్‌ ఎన్ఫోర్స్మెంట్‌ అధికారులు గుర్తించి నివేదిక ప్రభుత్వానికి అందించిన చర్యలు తీసుకోకుండా అవినీతికి పాల్పడ్డ అధికారులను రక్షించడం మా? వెంటనే ప్రభుత్వం అవినీతికి పాల్పడ్డ ఇన్సూరెన్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌ సంచాలకులు దేవికారాణి, మరో ఐదుగురి నీ వెంటనే సస్పెండ్‌ చేయాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు ఐఎంఎస్‌ మందుల కొనుగోళ్లపై సిబిఐ ద్వారా దర్యాప్తు చేయిస్తే ఈ అవినీతి బాగోతంలో భాగస్వాములైన బడాబాబులు, అధికారుల అవినీతి బాగోతం బట్టబయలు అవుతుంది.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close