-మెప్పించి.. ఇప్పించండి..

0

ప్రధాని మనసు కరిగించండి

  • ప్రత్యేక ¬దాపై గట్టిగా కోరాం
  • నేడు నీతి ఆయోగ్‌ సమావేశం
  • డిప్యూటీ స్పీకర్‌ పుకార్లు వద్దు
  • అమిత్‌ షాతో ఏపీ సీఎం జగన్‌ భేటి

న్యూఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ఏర్పాటు కాబోయే నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చినట్లు ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పారు. ఈ సమావేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత వహిస్తారని, ఆ సమావేశంలో ప్రత్యేక¬దా ఆవశ్యకతను ఆయనకు వివరిస్తానని జగన్‌ వెల్లడించారు. ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు అడుగుతూనే ఉంటామని, నీతి ఆయోగ్‌లో ప్రధానికి గుర్తు చేస్తామని జగన్‌ అన్నారు. గతంలో ఏ రాష్ట్రానికీ ప్రత్యేక ¬దా ఇవ్వొద్దని నీతి ఆయోగ్‌ చెప్పిందని, అందుకే ఇవ్వలేకపోతున్నట్లు కేంద్రం చెబుతుందని, అసలు రాష్ట్రానికి ¬దా ఎందుకు కావాలనే విషయాన్ని నీతి ఆయోగ్‌కు వివరించడానికి నివేధిక సిద్ధం చేసుకున్నట్లు జగన్‌ చెప్పారు. అలాగే రాష్ట్ర వ్యవహారాలు కేంద్ర ¬ంమంత్రి పరిధిలోకి ఎక్కువగా వస్తాయని, ఈ క్రమంలోనే అమిత్‌షాను కలిశానని, ప్రధాని మనసు కరిగించండి అని అమిత్‌ షాను కోరానని చెప్పారు. రాష్ట్రానికి సంబంధించిన పనుల నిమిత్తం రెండు, మూడు రోజులు జగన్‌ ఢిల్లీలో ఉంటారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. శనివారం ప్రధాని మోడీ నాయకత్వంలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశంలో జగన్‌ పాల్గొంటారు. నీతి ఆయోగ్‌లో ప్రత్యేక¬దా అడుగుతూ పోతాం అని, దేవుడి దయతో ప్రత్యేక ¬దా వస్తే మంచిది అని జగన్‌ అన్నారు. భేటీ ముగిసిన అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేక ¬దా అంశంతో పాటు, విభజన చట్టంలో పేర్కొన్న అనేక అంశాలు అన్నీ ¬ంమంత్రి పరిధిలోనే ఉన్నాయి.. వాటన్నింటికీ సంబంధించి ¬ంమంత్రి అమిత్‌ షాకు లేఖ కూడా ఇచ్చామని తెలిపారు. రాష్ట్రానికి ప్రత్యేక ¬దా అవసరం ఎంతో ఉందని చెప్పామని, రాష్ట్రం అన్నిరకాలుగా ఇబ్బంది ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో సహాయ సహకారాలు కావాలని విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించారు. నేడు నీతి అయోగ్‌ సమావేశం ఉంది.. ఆ సమావేశం ప్రధాని ఆధ్వర్యంలో జరగబోతోంది.. ఆ సమావేశంలో కూడా మా సమస్యల్ని ప్రస్తావిస్తామని వైఎస్‌ జగన్‌ చెప్పారు. ప్రత్యేక ¬దా కచ్చితంగా ఇవ్వాలని కోరతామని, ఎప్పుడు, ఎక్కడ అవకాశం వచ్చినా ప్రత్యేక ¬దా కావాలని కోరుతూనే ఉంటానని స్పష్టంగా పేర్కొన్నారు. దేవుడి దయతో ప్రత్యేక ¬దా సాధించడానికి ప్రయత్నిస్తాను.. రాష్ట్రానికి ప్రత్యేక ¬దా ఇచ్చేలా ప్రధానిని ఒప్పించాలని అమిత్‌ షాను కోరినట్లు తెలిపారు. వైఎస్సార్‌సీపీకి లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ పదవిపై లేనిపోనివి ఊహించుకోవద్దని హితవు పలికారు. తాము ఆ పదవి కావాలని కోరలేదు వారు ఇస్తామనీ చెప్పలేదన్నారు. ఇప్పటి వరకు దానిపై ఎలాంటి చర్చ జరగలేదని, కాబట్టి దానిపై మాట్లాడటం అనవసరమన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here