‘కాళేశ్వరం’లో భారీ అవినీతి

0
  • కొత్త ప్రభుత్వంలో చుక్క నీరు కూడా రాలేదు..
  • 15 శాతం పనులకే ప్రారంభోత్సవమా..?
  • ప్రభుత్వాన్ని నిలదీసిన భట్టి విక్రమార్క
  • విూరొస్తే వైఎస్‌ఆర్‌ ఆత్మక్షోభిస్తుంది
  • జగన్‌కు లేఖ రాసిన భట్టి

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కొత్త ప్రభుత్వం, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణకు అదనంగా చుక్క నీరు కూడా రాలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ… ఆత్మగౌరం, సామాజిక తెలంగాణ అనే పదాలకు అర్థాలే మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ”ఉమ్మడి శాసనభలో ఉప సభాపతిగా విభజన బిల్లును ప్రవేశపెట్టిన నేను కోట్లాది మంది ప్రజల ఆశలు నెరవేరతాయని ఆశించా. కానీ నీళ్లు, నిధులు, నియామాకాల విషయంలో ప్రజలు నిస్పృహల్లో ఉన్నారని భట్టి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని.. 21న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవం చేస్తామంటున్నారు.. అయితే ఆ రోజుల ఎన్ని లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నారో కేసీఆర్‌ స్పష్టం చేయాలని విక్రమార్క డిమాండ్‌ చేశారు. కేవలం మేడిగడ్డ ప్రాజెక్ట్‌ పూర్తి చేసి, అన్నారం ప్రాజెక్ట్‌లోని నీళ్లు పంపింగ్‌ చేస్తారు.. 15 శాతం కూడా పనులు పూర్తి చేయకుండా ప్రారంభోత్సవం చేస్తున్నారంటే.. రాష్ట్ర ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చని భట్టి చురకలు అంటించారు. మేడిగడ్డ నుంచి గంధమల వరకు ఎంతమేర పనులు పూర్తి చేశారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. 15 శాతం పనులకే రూ. 50 వేల కోట్లు వ్యయం అయితే.. మిగిలిన 85 శాతం పనులకు ఎన్ని వేల కోట్లు కావాలని భట్టి ప్రభుత్వాన్ని నిలదీశారు.

విూరొస్తే వైఎస్‌ఆర్‌ ఆత్మక్షోభిస్తుంది: లేఖ

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి విూరొస్తే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ఆత్మ క్షోభిస్తోందని…. ఈ కార్యక్రమానికి రాకూడదని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ను కోరారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌కు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క ఆదివారం నాడు లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌ మార్చడంతో పాటు ప్రాజెక్టు లో అవకతవకలకు పరోక్షంగా విూరు కూడ పరోక్షంగా బాధ్యులు అవుతారని ఆయన వివరించారు. టెండర్ల వివరాలను జ్యూడిషీయల్‌ కమిషన్‌ ముందు పెడతామని జగన్‌ నిర్ణయాన్ని మల్లు భట్టి విక్రమార్క స్వాగతించారు. తెలంగాణలోనూ కూడ ఇదే తరహాలో టెండర్ల వివరాలు జ్యూడీషీయల్‌ కమిషన్‌ ముందు ఉంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలను జ్యూడిషియల్‌ కమిషన్‌ ముందు ఉంచాలని ఆయన కోరారు. ఈ నెల 21వ తేదీన కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభోత్సవం చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకొన్నారు.ఈ మేరకు మహరాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ను కేసీఆర్‌ ఆహ్వానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here