Featuredస్టేట్ న్యూస్

గ్రామాల్లో రాజుకుంటున్న పరిషత్‌ వేడి

  • గులాబీ శ్రేణులకు మళ్లీ పరీక్షలే
  • అప్పుడే ఆశావహుల ప్రచార సందడి
  • టీఆర్‌ఎస్‌లో జడ్పీలకు గట్టి అభ్యర్థుల ఎంపిక
  • ఇక కసరత్తు చేయనున్న ఎమ్మెల్యేలు, ఎంపిలు

హైదరాబాద్‌ : పరిషత్‌ ఎన్నికల్లోనూ గులాబీ జెండా ఎగురేయాలన్న కేసీఆర్‌ పిలుపుతో టిఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలెత్తుతోంది. గ్రామాల్లో ఇప్పటికే పరిషత్‌ ఎన్నికల సందడి నెలకొంది. ఎంపి ఎన్నికలతో పోలిస్తే ఇవి గ్రామాలకు సంబంధించినవి కావడంతో టిఆర్‌ఎస్‌ శ్రేణులు ముందుకు కదిలాయి. తెలంగాణభవన్‌లో సోమవారం పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన టీఆర్‌ఎస్‌ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌ ఎన్నికలపై ప్రధానంగా చర్చించిన ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఎంపీలుగా పోటీచేసినవారు, రాజ్యసభ సభ్యులు, పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ దాదాపు రెండుగంటలసేపు ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమం మొదలైననాటి నుంచి ఇప్పటివరకు ఉన్న పరిస్థితులను వారికి వివరించారు. భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక, గెలుపు బాధ్యతలను ఎమ్మెల్యేలే తీసు కోవాలని సూచించారు. రాష్ట్రంలోని 32 జెడ్పీలను గెలువబోతున్నామని, 16 ఎంపీ స్థానాలు మనవేనని కేసీఆర్‌ ధీమా వ్యక్తంచేశారు. పార్టీ క్యాడర్‌లో పాత కొత్తలను కలుపుకొని పనిచేయాలన్న సీఎం.. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టిక్కెట్లు వస్తాయని హావిూ ఇచ్చారు. దీంతో ఇప్పుడు మరోమారు గ్రామాల్లో ఎన్నికల హడావిడి కనిపించబోతున్నది. లోక్‌సభ ఫలితాలకు ముందే మళ్లీ గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలు కానుంది. తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాలను తెరాస కచ్చితంగా గెలుస్తుం దన్న విశ్వాసంలో పార్టీ అధినేత కేసీఆర్‌ ఉన్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత దిల్లీలో చక్రం తిప్పేది తామేనని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మొత్తం 32 జిల్లా పరిషత్‌లను, 530 మండల పరిషత్‌ పీఠాలను కైవసం చేసుకుంటామని వెల్లడించారు. 535 జడ్పీటీసీ, 5,857 ఎంపీటీసీ స్థానాలు తెరాస ఖాతాలో నే పడాలన్నారు. అభ్యర్థులను ఎంపిక చేసి టికెట్లు ఇచ్చేది ఎమ్మెల్యేలేనని, మంత్రుల ఆమోదంతో ఇద్దరూ కలిసి జాబితాలను ఖరారు చేయాలన్నారు. అభ్యర్థుల ఎంపికలో ఉద్యమకారులకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. విూకు పోటీ అవుతారని, కిందిస్థాయి నేతలను అణగదొక్కవద్దని కూడా కేసీఆర్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. దీన్ని పరిగణనలోనికి తీసుకొని సమర్థులకు అవకాశం ఇవ్వాలని అన్నారు. రాష్ట్రంలో భారీ

సంఖ్యలో పదవులు ఉన్నాయని, నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, త్వరలోనే పార్లమెంటు కార్యదర్శుల నియామకాలు జరుగుతాయని, అందరికీ అవకాశాలు వస్తాయన్న ఆశను కూడా చూపారు. ఇప్పటికే అనేక గ్రామాలు, మండలాల్లో ఆశావహులు ప్రచారంలోకి దిగారు. తమకు టిక్కెట్‌ రావడమే ఆలస్యం అన్నరీతిలో ముందుకు సాగుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలు కీలకం కానున్నారు. వారు సచించే వారికి ఎంపిటిసి, జ్‌పిటిసిలు దక్కనున్నాయి. జడ్పీలకు కూడా గట్టి అభ్యర్థులను నిలపాలన్న సూచన కూడా చేశారు. కోవలక్ష్మి, పుట్టా మధులకు జడ్పీ ఛైర్మన్‌లుగా ప్రకటించడం ద్వారా గట్టి అభ్యర్థులనే రంగంలోకి దించబోతున్నట్లు సూచనలు చేశారు. దీంతో 30 జడ్పీల్లో కూడా ఇక గట్టి అభ్యర్థులను మాత్రమే సూచించాల్సి ఉంటుంది. మొత్తంగా ఇప్పుడు గ్రామాల్లో టిఆర్‌ఎస్‌ శ్రేణులు బిజీగా మారారు. మరో పరీక్షను వారు ఎదుర్కోబోతున్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close