Featured

సేవాగుణంతో వైద్యం..

ఎంతోమందికి పునర్జన్మనిస్తున్న వైద్యుడు..

మోకాళ్ల చికిత్సలో ఆగ్రగణ్యుడు..

డాక్టర్‌ మీర్‌ జువ్వాద్‌ జార్‌ ఖాన్‌పై ప్రత్యేక కథనం..

దేశవిదేశాలలో ఉన్నత చదువులు చదివాడు.. జర్మనీలో లెక్కకు మించిన సర్జరీలు చేశారు.. ఆయన వైద్యం చేస్తున్నాడంటే చాలు ఏలాంటి కీలు నొప్పి ఉన్నా మటు మాయం అవుతోంది. ఆయన చేతి స్పర్శతో రోగికి సాంత్వన కలిగిస్తారు. దేశ విదేశా లలో ఎక్కడెక్కడ తిరిగినా నయం కాని ఎన్నో కీళ్ల చికిత్సలను విజయవంతం చేసి ఎంతోమంది కలలను నేరవేర్చిన మహ మానవతావాది.. జీవితంలో నడవలేననుకుని ఆవేదనతో, బాధతో కుమిలిపోతున్న అభాగ్యులకు ఆ వైద్యుడు దేవుడిగా మారి పోయాడు. ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఆ వైద్యుడే డాక్టర్‌ మీర్‌ జువ్వాద్‌ జార్‌ ఖాన్‌. అతను చేస్తున్న అత్యాధునిక చికిత్సపై ఆదాబ్‌ హైదరాబాద్‌ ప్రత్యేక కథనం..

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): మనిషి నడవాలంటే మోకాళ్లు బలంగా, పటిష్టంగా ఉంటాయి. ఇప్పటి సమాజంలో మోకాళ్ల నొప్పులతో ఎంతోమంది, ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. చిన్న వయస్సు, పెద్ద వయస్సు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారు. చిన్న చిన్న పనులే ఆయాసం, అలసట రావడం దానికి తోడు కీళ్ల నొప్పులు మరింతగా తిరగబడడం మనిషి ఆరోగ్యానికి ప్రధాన కారకాలుగా నిలుస్తున్నాయి. రోడ్డు ప్రమాదంలో నడవలేని వారిని, అనునిత్యం మోకాళ్ల నొప్పులతో బాధపడే వారికి నేనున్నానంటూ చికిత్సతో నయం చేస్తున్నారు డాక్టర్‌ మీర్‌ జువ్వాద్‌ జార్‌ ఖాన్‌..

ఉన్నత చదువులన్నీ జర్మనీలోనే.. డాక్టర్‌ మీర్‌ జువ్వాద్‌ జార్‌ ఖాన్‌ ఎంబిబిఎస్‌, ఎం.ఎస్‌ ఆర్దోపెడిక్‌ విదేశాలలోనే చదివారు. అంతర్జాతీయ స్థాయిలో ఆయన చేస్తున్న సేవలకు ఎంతో గుర్తింపు ఉంది. జర్మనీలోని అంతర్జాతీయ వైద్య సంస్థ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ స్పెషల్‌ ఆర్థోపెడిక్స్‌ నుంచి ఫెలోషిప్‌ అందు కున్నారు. ఆర్థోప్లాస్టీ, ఆర్థో స్కోపీలో ఈ ఫెలోషిప్‌ అందుకున్నారు. మీర్‌ జవ్వాద్‌ జార్‌ ఖాన్‌ ట్రామా జాయింట్‌ రీప్లేస్‌మెంట్‌ సర్జన్‌గా మంచి పేర గడించారు. యూరప్‌లో ప్రముఖ ఆర్థో ప్రొపెసర్‌తో పనిచేశారు. జర్మనీలో ఎన్నో జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ సర్జరీలు, ఆర్థోస్కోపీ సర్జరీలో దిగ్విజయంగా పనిచేశారు. నడుము, మోకాళ్లు, భుజాలు, కీళ్ల సర్జరీలు చేయడంలో ఎంత నైపుణ్యం సాధించారు. ఎం.ఎస్‌ ఆర్థోలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక మార్కులు సాధించి ముందంజలో నిలిచారు. ముంబాయిలోని లీలావతి హాస్పిటల్‌, ఢిల్లీలోని మ్యాక్స్‌ హాస్పిటల్‌ వైద్యశాలలోనూ అపూర్వమైనా సేవలు అందించిన గొప్ప వైద్యులు..

ఆయన వైద్యమే ఒక ప్రత్యేకత.. ఇప్పటివరకు యాంటీరియర్‌ అప్రోచ్‌ (తుంటి మార్పిడి) విదేశాలకే పరిమితమై ఉండేది. ఈ తుంటి మార్పిడి కోసం ఇంతకుముందు వెనుక భాగం నుంచి ఆపరేషన్‌ చేసేవారు. అయితే ఇప్పుడు డా. మీర్‌ జవ్వాద్‌ జార్‌ ఖాన్‌ మొదటిసారిగా ముందు భాగం నుంచి ఆపరేషన్‌ చేసి విజయం సాధించారు. ఇలా చేయడం వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని చెపుతున్నారు. యాంటీరియర్‌ అప్రోచ్‌తో మొత్తం తుంటి కీలు మార్పిడితో పాటు, అప్రోచ్‌ చాలా చిన్న గాటులతో కూడి ఉంటుందని, దీనివలన రక్తం పోవడం, కారడం వంటివి జరగదు అంటారు. రోగాలు తుంటికీలు స్థానభ్రంశం కోసం ఎటువంటి రిస్క్‌ లేకుండా శస్త్ర చికిత్స తర్వాత కేవలం నాలుగు గంటల్లోనే నడవవచ్చన్నారు. భారతదేశంలోని కొద్దిమంది సర్జన్లలో ఒకరు మాత్రమే తుంటి కీలు మార్చేందుకు యాంటీరియర్‌ అప్రోచ్‌ వాడుతున్నారని చెపుతున్నారు.

మరిచిపోలేని అనుభవం… తన వైద్యవృత్తిలో మరిచిపోలేని అనుభవమని, నిత్యం ఎన్నో కేసులు వస్తూనే ఉంటాయి కాని కొన్ని కేసులు మాత్రమే జీవితాంతం గుర్తుంటాయంటారు డాక్టర్‌ జవ్వాద్‌ మీర్‌ జాన్‌ ఖాన్‌. అస్సాంకు చెందిన నశీర్‌ అలి పోలీస్‌ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఆయన చిన్నకు మారుడికి పదకొండెళ్ల వయస్సులోనే రెండు కాళ్లు విరిగాయి. చదువులో చురుగ్గా ఉన్న నడవలేని పరిస్థితుల్లో ఉన్న తన కొడుకును చూసి తల్లిదండ్రులు నిత్యం బాధపడేవారు. ఎంతోమంది వైద్యుల దగ్గర వైద్యం చేయించినా ఫలితం లేకపోయింది. ఇస్లామ్‌ అంతటి ఆనారోగ్య పరిస్థితిలోనూ తన చదువును కొనసాగిస్తూ ఉన్నాడు. ఇస్లామ్‌ తల్లిదండ్రులు తమ కొడుకు వైద్యం కోసం దేశంలోని ఎన్నో సుప్రసిద్ద ఆసుపత్రులన్నీ తిరిగినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో ఒక డాక్టర్‌ పిల్లాడిని పరిశీలించి నేనే ఈ పిల్లాడికి ఆపరేషన్‌ చేస్తాను కాని పిల్లాడు నడుస్తాడనే హామీ ఇవ్వలేను అని చెప్పాడంట. ఒక రోజు అతనికి డాక్టర్‌ మీర్‌ జవ్వాద్‌ జార్‌ ఖాన్‌ గురించి తెలిసింది. అతని వీడియో లు, ఆర్టికల్‌ చదివాడు. ఏదో విధంగా డాక్టర్‌ను కలిసి తనకు జరిగిన రోడ్డు ప్రమాదం గురించి వివ రించారు. ఎక్స్‌రే. ఇతర వైద్య రిపోర్టులన్నీ డాక్టర్‌ గారికి మెయిల్‌ చేశాడు. రిపోర్టులన్నీ పరిశీలించి వైద్యం చేసి నిన్ను ఆసుపత్రి నుంచి నడిపిస్తూ పంపిస్తానని ఆ పిల్లాడికి హామీ ఇచ్చాడు. ఆ పిల్లాడికి చెప్పినట్లుగానే ఆపరేషన్‌ చేసి నడిచేలా చేశారు. కేవలం నెలరోజుల వ్యవధి లో పూర్తి ఆరోగ్యంతో తన స్వంత రాష్ట్రమైనా అస్సాంకు వెళ్లిపోయాడు. ఇది జీవితంలో మరిచిపోలేని సంఘటనగా ఆయన వివరించారు.

ఆయన సేవలకు

గుర్తింపుగా ఎన్నో ఆవార్డులు..

డాక్టర్‌ మీర్‌ జవ్వాద్‌ జార్‌ ఖాన్‌ తమ సేవలకు గుర్తింపుగా ఎన్నో ఆవార్డులు వచ్చా యి. హైదరా బాద్‌కు చెందిన హ్యుమన్‌ టచ్‌ ఆర్థోపెటిక్‌ ఆసుపత్రి డాక్టర్‌ మీర్‌ జవ్వాద్‌ జార్‌ ఖాన్‌కు ఉత్తమ వైద్యుడిగా అవా ర్డును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్య మంత్రి రోశ య్య చేతుల మీదుగా అందిం చారు. వాటితో పాటు తమ వైద్యసేవలకు గాను ఎన్నో అవార్డులు దక్కాయి.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close