అతడు గేమ్‌ ఛేంజర్‌

0

ప్రపంచకప్‌కు ధోనీ సేవలు అవసరం

ముంబయి: టీమిండియా మాజీ సారథి ఎంఎస్‌ ధోనీని విమర్శించే వారిపై టీమిండియా సారథి విరాట్‌ కోహ్లీ మండిపడ్డాడు. వికెట్‌ కీపర్‌గా టీమిండియాకు ధోనీ అందించిన సేవలు వెలకట్టలేనివన్నాడు. అతడి అనుభవం ప్రపంచకప్‌లో టీమిండియాకు కీలకం కానుందని చెప్పాడు. విరాట్‌ కోహ్లీ మొదటి సారిగా ప్రపంచకప్‌లో భారత జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ధోనీ జట్టులో ఉండటం వల్ల తాను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నాడు. దీనిపై కోహ్లీ మాట్లాడుతూ.. ‘నా క్రికెట్‌ కెరీర్‌ మొదలైంది ధోనీ సారథ్యంలోనే. కొన్ని సంవత్సరాలుగా అతడిని దగ్గర నుంచి చూస్తున్నాను. ధోనీ జట్టులో ఉండటం ఎంతో ముఖ్యం.అతడు గేమ్‌ ఛేంజర్‌. ఎన్నో కీలక సమయాల్లో స్టంప్స్‌ వెనక వికెట్లను తీశాడు. ఇటీవల జరిగిన ఐపీఎల్‌లోనూ అతడేంటో చూశాం. జట్టులో ప్రతి ఒక్కరూ బాగా రాణించాలంటే ధోనీ సలహాలు, సూచనలు ఎంతో అవసరం’ అని తెలిపాడు. ఇక ప్రపంచ కప్‌లో రిషభ్‌ పంత్‌కు బదులు దినేశ్‌ కార్తిక్‌ను ఎంచుకోవడం పైనా విరాట్‌ మాట్లాడాడు. ‘మ్యాచ్‌లో జట్టు ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు దినేశ్‌ కార్తిక్‌ అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. దినేశ్‌ ఎన్నోసార్లు మ్యాచ్‌ను గట్టెక్కించాడు. ఫినిషర్‌గానూ దినేశ్‌ అద్భుతం. ఆటగాళ్లలో 15 మందిని జట్టుకు ఎంపిక చేయడం అంత సులభం కాదు. అందుకే నేను ఆటగాళ్లకు చెబుతున్నాను. అందరూ సిద్ధంగా ఉండండి. ఎప్పుడైనా ఏదైనా అవకాశం వస్తే మిమ్మల్ని ఎంపిక చేసుకోవచ్చు’ అని పేర్కొన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here