ఏడవరోజు కొనసాగిన హజారే దీక్ష

0

ఆందోళనకరంగా అన్నా ఆరోగ్య పరిస్థితి: వైద్యులు

రాలేగావ్‌ సిద్ధి: కేంద్రంలో లోక్‌పాల్‌, రాష్ట్రాల్లో లోకాయుక్త ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌పై ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మంగళవారంతో ఏడవ రోజుకు చేరుకుంది. ఐదు కిలోలు బరువు తగ్గడంతో ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. అన్నాజీ ఇంతవరకూ 5.5 కిలోల బరువు కోల్పోయారని, ఆయన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని, ఈ విషయం ఆయనకు తెలిపామని డాక్టర్‌ ధనంజయ్‌ పోతె తెలిపారు. షుగర్‌ లెవల్‌ తగ్గిపోయిందని, సాధ్యమైనంత త్వరగా నిరాహార దీక్ష విరమించాలని కోరామన్నారు. సెలైన్‌ లేదా ఓఆర్‌ఎస్‌ తీసుకోవాలని తాము సూచించినప్పటికీ ఆయన నిరాకరిస్తున్నారని, ఇదేవిధంగా నిరాహార దీక్ష సాగిస్తే మూత్రపిండాలు, మెదడు దెబ్బతినే ప్రమాదం ఎంతైనా ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. 81ఏళ్ల అన్నా హజారే జనవరి 30 నుంచి నిరాహార దీక్ష సాగిస్తున్నారు. కాగా, గ్రామంలో ఏ ఒక్కరూ ఇంట్లో వంట చేసుకోకుండా హజారే దీక్షలో పాల్గొన్నారని రాలేగావ్‌ సిద్ధి డిప్యూటీ సర్పంచ్‌ లంకేష్‌ తెలిపారు. అన్నాజీ డిమాండ్లు నెరవేరకుంటే గ్రామమంతా ఆత్మాహుతి చేసుకుంటుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను దీక్ష విరమించేలా చేయాలని, ఇందుకు తమ గ్రామస్థులంతా సిద్ధమని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తరఫున రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్‌ భమ్రె, రాష్ట్ర ప్రభుత్వం తరఫున గిరీష్‌ మహాజన్‌లు సోమవారం అన్నా హజారేను కలిసి నిరాహార దీక్ష విరమింపజేసే ప్రయత్నాలు చేశారు. అయితే ప్రభుత్వ ప్రతిపాదనల్లో ఎలాంటి బలమైన నిర్ణయాలు లేవని, ప్రజలను తప్పుదారి పట్టేంచేలా ఉన్నాయని, తమ దీక్ష కొనసాగుతుందని హజారే తెగేసి చెప్పారు. మంగళవారం రాలేగావ్‌ సిద్ధిలో.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫఢ్నవీస్‌, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్‌ సింగ్‌, రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్‌ భమ్రే, మహారాష్ట్రమంత్రులు, అధికారులు అన్నాహజారేను దీక్షాశిబిరంలో కలిశారు. అన్నా డిమాండ్లు, సూచనలు ఎలా అమలు చేస్తున్నదీ వివరించారు. దీక్షను విరమించాలని సీఎం ఫడ్నవీస్‌ విజ్ఞప్తి చేశారు. ఐతే? అన్నా హజారే తన నిరసన కొనసాగించేందుకు నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సోమవారం అన్నాహజారే తీవ్ర విమర్శలు చేశారు. తన డిమాండ్లను 90శాతం నెరవేర్చామని ఫడ్నవీస్‌ చెబుతున్న మాటల్లో నిజం లేదని అన్నారు అన్నా. ఫఢ్నవీస్‌ అన్నీ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ, ఢిల్లీలోని అరవింద్‌ కేజ్రీవాల్‌ తన ఉద్యమాన్ని ఉపయోగించుకుని అధికారంలోకి వచ్చాయన్నారు. నాలుగేళ్లుగా లోక్‌ పాల్‌ అమలుచేయకుండా మాటలు చెప్పాయన్నారు. కేంద్రం ఇచ్చిన హావిూలను నిలబెట్టుకోకపోతే పద్మ భూషణ్‌ ను తిరిగి ఇచ్చేస్తానని హెచ్చరించారు. హజారే ప్రాణాలను కేంద్రమే కాపాడాలని శివసేన కోరింది. లోక్‌ పాల్‌ పై మరోసారి అన్నాహజారే నిరాహార దీక్షకు దిగడాన్ని ఢిల్లీ సీఎం స్వాగతించారు. హజారే దీక్షకు మద్దతు ఇచ్చారు. తన నిరసన ఉద్యమంలో పాల్గొనేందుకు కేజ్రీవాల్‌ ను స్వాగతిస్తాననీ.. ఐతే? తనతో పాటు? వేదికను పంచుకునేందుకు అవకాశం మాత్రం ఇవ్వనని తెగేసి చెప్పారు హజారే. బీజేపీ నేతలు, అరవింద్‌ కేజ్రీవాల్‌ అందరూ మాట తప్పినవారే అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here