Featuredస్టేట్ న్యూస్

అవినీతి గుట్టు రట్టు అవుతుందని రికార్డులను అమ్మేశారా ?

ఉన్నత అధికారుల అనుమతి లేకుండా రికార్డుల అమ్మకం ?

  • పబ్లిక్‌ రికార్డ్‌ యాక్ట్‌ 1997, డిజిటల్‌ సర్వీస్‌ బిల్‌ 2012 చట్టాల బేఖాతర్‌
  • చట్టవిరుద్ధంగా రికార్డుల ధ్వంసం
  • అమ్మిన రికార్డుల వివరాలు ఎక్కడ ?
  • అవినీతిపరులకు రక్షించడానికా ?
  • రికార్డుల అమ్మకంతో ప్రభుత్వానికి కోట్ల నష్టం

హైదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): హైదరాబాద్‌ జిల్లా విద్యా శాఖ కార్యాలయంలో పబ్లిక్‌ రికార్డ్‌ ఆక్ట్‌ 1997, డిజిటల్‌ సర్వీస్‌ బిల్‌ 2012 విరుద్ధంగా హైదరాబాద్‌ జిల్లా కార్యాలయంలో రికార్డులను 9 డిసెంబర్‌ 2019 తేదీన 1700 వందల కిలోల ఫైళ్లను, 22 క్వింటాళ్ల స్క్రాప్‌ ను అమ్మడం జరిగింది. డీఈవో కార్యాలయంలో 2018లో బోగస్‌ ఈటిఆర్‌ కుంభకోణం బహిర్గతం కావడంతో నీతిమాలిన పనిలో భాగస్వాములైన వారికి శాఖాపరమైన చర్యలు తీసుకోవడం, వారి మీద క్రిమినల్‌ కేసు నమోదు కావడం, అవినీతి అధికారులు రిమాండ్‌ కావడం జరి గింది. కానీ 2018లో కేవలం 14 బోగస్‌ ఈ టిఆర్‌లు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. కానీ వాస్తవంగా హైదరాబాద్‌లో పదుల సంఖ్యలో ప్రైవేట్‌ పాఠశాలలు బోగస్‌ గుర్తింపు సర్టిఫికెట్ల ద్వారా కొనసాగుతున్న విషయం జగమెరిగిన సత్యం. నగరంలోని కొన్ని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు బోగస్‌ పత్రాలను స ష్టించి గుర్తింపు సర్టిఫికెట్లను పొందినట్లు అనేక ఆరోపణలు వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్‌ జిల్లా కార్యాలయంలో సమగ్ర విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వచ్చి అవినీతి లో భాగ స్వాములైన అధికారులకు ఇబ్బంది కలగ వచ్చు అన్న దుర్మా ర్గమైన ఆలోచనలతో తూకంలో రికార్డులను అమ్మేశారు, దీనితో పాటు స్క్రాప్‌ ని కూడా అమ్మడం జరిగింది. పబ్లిక్‌ రికార్డ్‌ యాక్ట్‌ 1997 ప్రకారం రికార్డులు మూడు రకాలు ఉంటాయి 1. ఎల్ల కాలం ఉండవలసిన రికార్డ్‌ 2. కొన్ని సంవత్సరాల వరకు ఉండవలసిన రికార్డ్‌ 3 అమ్మ వలసిన, దహనం చేయవలసిన, ధ్వంసం చేయవలసిన రికార్డులు. పబ్లిక్‌ రికార్డ్‌ యాక్ట్‌ 1997 డిజిటల్‌ సర్వీసెస్‌ బిల్‌ 2012 ప్రకారం రికార్డులను డిజిటల్‌ రూపంలో భద్ర పరుస్తూ, ధ్వంసం చేయ వలసిన రికార్డులను చెక్‌ లిస్ట్‌ తయారుచేసి డిపార్ట్మెంట్‌లోని ఉన్నత అధికారులతో అనుమతి తీసుకున్నాక వాటిని అమ్మడం కానీ, కాల్చడం కానీ, ధ్వంసం చేయడం గాని చేయవచ్చు.ఉదాహరణకు కార్యాలయం ఉద్యోగస్తుల ఫైల్స్‌, అటెండెన్స్‌ రిజిస్టర్‌ ఎప్పటికీ రికార్డ్‌ రూమ్‌ లో భద్రపరచాలి, తాత్కాలికంగా అనుమతులు తీసుకున్న పత్రా లను, లెటర్లను సంవత్సరకాలం వరకే గుర్తింపు ఉంటుంది కాబట్టి ఐదు సంవత్సరాల వరకు రికార్డులను భద్రపరచి చెక్‌ లిస్ట్‌ తయారుచేసి ఉన్నతాధికారులతో ప్రతి రికార్డు పై అనుమతి పొందిన తర్వాత మాత్రమే అమ్మడం కానీ ధ్వంసం చేయడం కానీ చేయాలి.

కానీ హైదరాబాద్‌ జిల్లా కార్యాలయంలో అవినీతి అక్రమార్కుల వారు చేసిన అవినీతి బాగోతం బట్టబయలు అవు తుందని, ఒకే వ్యక్తితో మూడు కొటేషన్లను తీసుకొని రికార్డులను కిలో రూ: 17 /- చొప్పున ధర నిర్ణయించి వందల కిలోల రికా ర్డులను అమ్మేసారు.సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం సమాచారాన్ని భద్రపరచి కావలసిన సమాచారాన్ని పౌరులకు అంద చేయవలసిందిగా చట్టాన్ని రూపొందించడం, పౌరులకు హక్కులను కల్పించడం జరిగింది. కానీ అధికారులు చట్టాలను బేఖాతరు చేస్తూ వారు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి రికార్డులనే మాయం చేసిన హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖ కార్యా లయ అధికారులు. దీని ద్వారా ప్రభుత్వానికి వందల కోట్ల రూపా యల నష్టం జరగడానికి ఆస్కారం ఉన్నది. చిన్న విషయాన్ని గమనిద్దాం నగరంలో అనేక సంవత్సరాల ముందు ప్రభుత్వ పాఠశాలలో, ఎయిడెడ్‌ పాఠశాలలు మాత్రమే ఉండేవి. సేవా దక్పథంతో నిరుపేద ప్రజలకు చాలా తక్కువ ఫీజుతో విద్యను అందిస్తామని నగరంలోని ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడంతో ప్రభుత్వం వారి ఆధ్వర్యంలో ఎయిడెడ్‌ పాఠశాలలకు అనుమతులు ఇస్తూ, ఎయిడెడ్‌ పాఠశాలలకు ఆర్థిక సౌజన్యని అందిస్తూ వందల ఎక రాల భూమిని లీజుకు ఇవ్వడం జరిగింది. కానీ ప్రస్తుతం నగరం లో కొన్ని పాఠశాలలు ఎయిడెడ్‌ పాఠశాలగా గుర్తింపు పొంది, ప్రైవేట్‌ పాఠశాలల కొనసాగుతున్నాయి. ప్రైవేట్‌ పాఠ శాలగా మార్చుకోవడానికి విద్యాశాఖ నుండి మళ్లీ అనుమతులు తీసు కోవాలి కానీ ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పాత గుర్తిం పు పత్రాలతోనే పాఠశాలలను కొనసాగిస్తూ సేవ అనే ముసు గులో వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ప్రభు త్వం ఎయిడెడ్‌ పాఠశాలలకు కేటాయించిన ప్రభుత్వ భూమి పూర్తి వివరాలు జిల్లా విద్యాశాఖ కార్యాలయం లోని రికార్డులో భద్రపరచి ఉన్నాయి. కానీ హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖ అధికా రులు ఆలోచన లేకుండా ప్రభుత్వ అనుమతులు లేకుండా రికార్డు లను అమ్మేయడం తో భూమి వివరాలు రికార్డులు లేకపోవడంతో ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల నష్టం జరుగుతుంది. ఈ విషయాన్ని గుర్తించకుండా స్వార్థ ప్రయోజనాల కోసం తాము చేసిన అవినీతి బాగోతం ఎక్కడ బహిర్గతం అవుతుందో అన్న దుర్మార్గమైన ఆలోచనతో రికార్డులను అమ్మేశారు. అధికారులు చేసిన నిర్వాకం క్షమించరాని నేరంగా భావించవచ్చు. ఇకనైనా ప్రభుత్వం ఈ విషయంపై పూర్తి దర్యాప్తు చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్తలు, విద్యార్థి నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

విలువైన సమాచారాన్ని ప్రభుత్వ అనుమతి లేకుండా అమ్మడం చట్ట విరుద్ధం. రికార్డు మాయం కావడంతో ప్రభుత్వానికి వందల కోట్లు నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం ప్రైవేటు యాజమాన్యాలకు కేటాయించిన భూమి వివరాలు ధ్వంసం కావడంతో ,ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకోవడానికి, విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వ స్థలాలను గుర్తించి విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇబ్బందికరంగా మారే అవకాశాలు ఉన్నాయి. కావున విలువైన రికార్డులను ధ్వంసం చేసిన జిల్లా విద్యాశాఖ అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి..

టిజివిపి జిహెచ్‌ఎంసి అధ్యక్షుడు శ్రీశైలం యాదవ్‌

సమాచార హక్కు చట్టం ప్రకారం హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖ పబ్లిక్‌ ఇన్ఫర్మేషన్‌ అధికారికి సమాచారాన్ని కోరగా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా , జిల్లా కార్యాలయంలో సమాచారం లేదని లిఖితపూర్వకంగా పలు సందర్భాల్లో సమాచారం ఇవ్వడం జరిగింది. సమాచార హక్కు చట్టం లో పౌరులకు సమాచారాన్ని కల్పించాలని హక్కులను కల్పించిన సమాచారం ఇవ్వకుండా చట్టాలను బేఖాతరు చేస్తూ వారి స్వార్థ ప్రయోజనాల కోసం సమాచారాన్ని ధ్వంసం చేస్తున్నారు. కావున ఉన్నత అధికారులు చట్టాలను ఉల్లంఘిస్తూ అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి. – మహమ్మద్‌ ఫరీదుద్దీన్‌ స.హ. కార్యకర్త

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close