గౌరవాధ్యక్ష పదవికి హరీష్‌ రాజీనామా

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికార కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉన్నందున, ఆర్టీసీ టీఎంయు గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన హరీష్‌ రావు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ రావు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను టీఎంయు ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామరెడ్డికి పంపారు. తాను రాజీనామా చేసినా.. కార్మికుల సంక్షేమానికి నిరంతరం తన సహకారం ఉంటుందని హరీష్‌ రావు స్పష్టం చేశారు. కాగా తెలంగాణ ఉద్యమం సమయంలో కార్మికుల భాగస్వామ్యం పెంచాలనే లక్ష్యంతో హరీశ్‌ రావు టీఎంయు గౌరవాధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. ఆర్టీసీ కార్మిక యూనియన్‌ కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం సాధ్యపడటం లేదని.. దీంతో టీఎంయు బాధ్యతల నుంచి తప్పుకోవాలని హరీశ్‌ భావించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here