Featuredస్టేట్ న్యూస్

సంతోషం సగమేనా..

మూడు నెలల జీతాలెక్కడ..

అలమటించిన కార్మికులు..

జీతాలు వస్తాయో, లేదో తెలియదు..

వేతనాలపై ప్రకటన చేయని ప్రభుత్వం.

డిమాండ్లను నేరవేర్చుకోవాలి.. హక్కులను కాపాడుకోవాలి.. ప్రభుత్వంలో విలీనం కావాలనే ఆలోచనతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు.. దాదాపుగా మూడు నెలల పాటు నిరవధిగ సమ్మె చేశారు.. ధర్నాలతో, రాస్తారోకోలతో ఆర్టీసీని స్తంభింజేస్తూ, రూపాయి జీతం తీసుకోకుండా సమ్మె సాగింది.. ప్రభుత్వం దిగిరావడం, ఉన్న ఆర్టీసీని తీసేస్తామని చెప్పడంతో ఆర్టీసీ కార్మికుల్లో ఒక రకమైనా ఆందోళన మొదలయ్యింది. ప్రభుత్వం అనుసరించిన విధానాలకు ఇరవైమందికి పైగా ఆర్టీసీ కార్మికులు అత్మహత్యలు చేసుకున్నారు. చివరకు మా ఉద్యోగం మాకు కావాలని చెప్పిన ఆర్టీసీ ఉద్యోగులు ఆవేదనతో కన్నీళ్లు పెట్టుకునే స్థాయికి వచ్చారు.. తమ ఉద్యోగం తమకు దక్కుతుందో లేదో అనే ఆందోళనే వారిని మరింత మానసికంగా కుంగతీసిందని చెప్పవచ్చు.. ఎట్టకేలకు ఆర్టీసీ కార్మికులందరూ ప్రభుత్వం చేసిన ప్రకటనతో ఎవరి విధుల్లో వారు చేరిపోయారు. ఉద్యోగం వస్తుందో, రాదో అనే ఆవేదనతో ఉన్న ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగం వచ్చింది కాని మూడు నెలల నుంచి జీతాలు లేకుండా సమ్మె చేశారు. వాటి పరిస్థితి ఏంటో వారికి అర్థం కావడం లేదు. జీతాల గురించి ఎవరిని అడగాలో, ఏంటో తెలియక సతమతమవుతున్నట్లు తెలుస్తోంది.. జీతాలు లేకుండా అలుపెరగని సమ్మె సాగించారు. ఆ మూడు నెలలు బతకడానికి ఎన్నో అప్పులు చేశారు. ప్రభుత్వం విధుల్లో చేరమని చెప్పింది కాని మూడు నెలల జీతాల విషయం మాత్రం చెప్పలేదు.. ఆ జీతాలు ఇస్తారా, లేదా అనే సందిగ్థమే ఇప్పుడు అందరిలో ఉంది.. ఆర్టీసీ కార్మికుల వేతనాలపై ప్రభుత్వం స్పందిస్తుందో, లేదో చూడాల్సిందే..

హైదరాబాద్‌ ఆదాబ్‌ హైదరాబాద్‌…

తెలంగాణ ఆర్టీసీ కార్మికులను ఓ రేంజ్‌లో ఆడుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎట్టకేలకు వారికి తీపి కబురు చెప్పి వారి నోటిని తీపి చేశాడు. సమ్మెలో కేసీఆర్‌ డౌన్‌ డౌన్‌ అన్న కార్మికులు తీపి కబురు వినగానే ఆయన చిత్రపటాలకు పాలాభిషేకాలు చేశారు. ‘సార్‌ చానా మంచోడు’ అంటూ ప్రశంసలు కురిపించారు. ముందు తమ ఉద్యోగాలు నిలబడ్డాయి. అది చాలు కార్మికులకు, ఆగమేఘాల మీద డ్యూటీలకు బయలుదేరారు. అంతా బాగానే ఉందిగాని, సీఎం కేసీఆర్‌ ఆర్టీసీ కార్మికులకు సంతోషాన్ని సగమే పంచాడు. ఇంకా పూర్తిగా వారి పొట్ట నింపలేదు. ఇంకా పూర్తిగా వారిని కడుపులో పెట్టుకోలేదు. ఎలాంటి షరతులు పెట్టకుండా కార్మికులను ఉద్యోగాల్లో చేర్చుకున్నాడు కదా. ఇంకేం కావాలనే అనుమానాలు రావచ్చు. అందరిని చేర్చుకున్నాడు కాని సమ్మెలో ఉన్న జీతాల మాట మాత్రం ఎత్తలేదు. వారు మూడు నెలల జీతం వస్తుందని అనుకుంటున్నారు. సెప్టెంబరులో వారు డ్యూటీలోనే ఉన్నారు. ఆ నెల జీతం ఇవ్వలేదు. అక్టోబరు 5 నుంచి సమ్మెలోకి వెళ్లారు. నవంబరు చివరి వారం వరకు సమ్మెలో ఉన్నారు. సమ్మెలో ఉన్న కాలానికి కూడా జీతం ఇవ్వాలనుకుంటే మూడు నెలల జీతం ఇవ్వాలి. సమ్మె కాలానికి జీతం ఇచ్చే విషయంపై ఆలోచించి నిర్ణయం తీసుకున్నా సెప్టెంబరు నెల జీతం తక్షణమే ఇచ్చేస్తే వారికి ఉపశమనం కలుగుతుంది కదా. సమ్మె కాలానికి జీతం ఇచ్చిన సందర్భాలు గతంలో ఉన్నాయి. కార్మికుల సెలవులు గట్రా లెక్కలు కట్టి అడ్జస్టు చేసి జీతాలు ఇచ్చారు. ఈసారి కూడా అలాగే ఇస్తారని కార్మికులు ఆశ పడుతున్నారు. డ్యూటీల్లో చేరాలని తీపి కబురు వినిపించిన కేసీఆర్‌ జీతాల విషయం ఏవిూ చెప్పకుండా చేదును అలాగే ఉంచాడు. ఇన్నాళ్లూ ఉద్యోగాలు ఉంటాయో పోతాయోనని ఆందోళనపడి భయపడిపోయిన కార్మికులు ఇక నుంచి జీతాలు వస్తాయో రావోనని ఆందోళన పడతారు. దాంతో మళ్లీ గుండెపోటు మరణాలు, ఆందోళనతో మతిస్థిమితం తప్పడం మొదలైనవి జరుగుతాయేమో అనిపిస్తుంది. కార్మికులు ఆత్మహత్యలు చేసుకునేంతగా, గుండెపోటుతో చనిపోయేలా ఎడాపెడా అదుకున్న ముఖ్యమంత్రి ఇంకా కొంతకాలం అదుకోడని గ్యారంటీ ఏమిలేదు. ఒకవేళ జీతాలు ఇవ్వకపోయినా డిమాండ్‌ చేసే దమ్ము, ధైర్యం కార్మికులకు ఉంటాయా అనేది తెలియడం లేదు..

యూనియన్ల మాటలు నమ్మోద్దు…

కార్మికులు మళ్లీ యూనియన్ల జోలికి పోవద్దని, యూనియన్ల మాటలు వింటే మీ ఉద్యోగాలే పోతాయనిచెప్పకనే చెపుతూ హెచ్చరికలు చేశాడు సిఎం.. హైకోర్టు చెప్పినట్లుగా తాను లేబర్‌ కోర్టుకు రిఫర్‌ చేస్తే ఉద్యోగాలు ఊడిపోతాయని చెప్పాడు. లేబర్‌ కోర్టు తాను చెప్పినట్లు చేస్తుందనే అర్థం కావొచ్చు. ఆర్‌టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమని తాము ప్రకటించబోమని హైకోర్టు స్పష్టం చేసినా కేసీఆర్‌ మాత్రం ఇది చట్టవిరుద్ధమేనని తీపి కబురు వినిపిస్తూ కూడా తన స్టాండ్‌ విూదనే ఉన్నాడు. ఆర్‌టీసీని ప్రైవేటీకరణ చేసే ఆలోచన తనకు లేదన్నాడు. ‘ఆర్టీసీని పెట్టుబడిదారులకో, షావుకార్లకో ఇవ్వదలచుకోలేదు’ అన్నాడు. కార్మికులకు బుద్ధి రావాలనే ఉద్దేశంతోనే తాను కావాలనే కఠినంగా వ్యవహరించినట్లు చెప్పాడు. అంటే ఆర్‌టీసీ కార్మికులను భయపెట్టడానికి, వారు తిరిగి జీవితంలో సమ్మె ఊసెత్తకుండా ఉండటానికి కేసీఆర్‌ ఇన్నాళ్లు ‘కార్మికులతో ఆట’ అనే నాటకం ఆడాడు. విూడియాకు రకరకాల లీకులు ఇచ్చి చివరకు ‘ఇదంతా ఉత్తిదే’ అని తేల్చిపారేశాడు. తాను నియంతను, దుర్మార్గుడిని కానని, మంచి మనసున్నవాడినని చెబుతూ శుభం కార్డు వేశాడు. మంత్రులు చెప్పినందువల్ల తాను కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్నట్లు సెలవిచ్చాడు. కాని అంత సీనుండదు. కేంద్రానికి భయపడి కేసీఆర్‌ దిగొచ్చాడని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌ చెప్పుకున్నాడు. కాని అందులో నిజానిజాలు తెలియవు. తక్షణం కనిపిస్తున్న కారణం మున్సిపల్‌ ఎన్నికలు. అవి త్వరలోనే జరగబోతున్నాయి. తాను మొండిపట్టుదలతో ఉంటే మున్సిపల్‌ ఎన్నికల్లో నష్టం కలుగుతుందని అనుకొని ఉండొచ్చు. టీఆర్‌ఎస్‌ ఓడిపోతే ప్రతిపక్షాలకు, ముఖ్యంగా బీజేపీకి బలం చేకూరతుందని భావించివుండొచ్చు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close