Featuredస్టేట్ న్యూస్

గురునానక్‌ కాలేజీ దోపిడి తంతూ..!

గురునానక్‌ అటానమస్‌ పేరుతో పరీక్ష పత్రాల రుసుములను చీఫ్‌ వ్యాలివేటర్కు చెల్లింపులో మోసం!

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): 2016 నుంచి అటానమస్‌ స్టేటస్‌తో పని చేస్తున్నటువంటి గురునానక్‌ ఇంజనీరింగ్‌ కళా శాలలో బీటెక్‌ పరీక్ష పత్రాల విషయంలో కూడా అధ్యాపకులకు చెల్లించడం లేదు. ఒక్క సారి కథనం లోకి వెళ్లి చూస్తే 2016లో గురునానక్‌ కళాశాలకు అటానమస్‌ స్టేటస్‌ రావడం జరిగింది. ఆ సంవత్సరం దాదాపు పన్నెండు వందల మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవడం జరిగింది. ఆ కళాశాలలో సెమిస్టర్‌ విధా నంతో పరీక్షలు నడుస్తున్నాయి, సెమిస్టర్‌కి ఐదు సబ్జెక్టులు ఉంటా యి. బీటెక్‌ పరీక్షల అనంతరం పరీక్షల విభాగం పరీక్ష పేపర్లను ఒక బండిల్ల రూపంలో తయారు చేస్తుంది. ప్రతి బండిల్ల 30 పేపర్లను పొందుపరుస్తారు. అందులో మూడు పేపర్లను అక్కడ పనిచేసే అధ్యాపకులతో చీఫ్‌ వాల్యుయేషన్‌ పేరుతో చేయిస్తారు. అంటే 40 బండిళ్లు అవుతాయి, 5 సబ్జెక్టులు దాదాపు 200 అవు తాయి. ఇందులో ప్రతి బండిలు నుంచి మూడు పేపర్లు తీసుకుం టే ఆరువందల పేపర్లు చీఫ్‌ వాల్యూవేషన్‌ జరుగుతుంది. ఒక్క పేపర్‌కి 25 రూపాయల చొప్పున చెల్లించాలి. మొత్తంగా ఆ సెమి స్టర్‌కి 15000 రూపాయలు మరియు స్క్రూటినీ నిమిత్తం దాదాపు 8 వేల రూపాయలు మొత్తంగా సెమిస్టర్‌కి 23 వేల రూపాయలు చెల్లించాలి. అదే స్టూడెంట్స్‌ సెకండ్‌ సెమిస్టర్‌కి వెళ్తే మరొక 23,000 మరియు సప్లిమెంటరీ పేపర్స్‌లో ఒక 8000 అంటే మొత్తం దాదాపు 31,000 చెల్లించాల్సి ఉంది. కానీ చెల్లిం చడం లేదు. 2017లో మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ విద్యా ర్థులు 1200 మంది రెండవ సంవత్సరం మొదటి సెమిస్టర్‌ విద్యార్థులు 1200 మంది తీసుకుంటే,మొత్తం 24 వందల (దాదాపు) మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకోవడం వారి పరీక్ష పేపర్లను 400 బండిలుగా తయారుచేస్తారు. అదనంగా సప్లమెం టరీ పేపర్లు కూడా వాటికి తోడవుతాయి. వీరికి రెండు సెమిస్ట రులకు దాదాపు 160000/- రూపాయలు వరకు చెల్లిం చాలి. ఇలా తీసుకుంటే 2018 మరియు 2019 సంవత్సరంలో కూడా ఇంతవరకు చీఫ్‌ వాల్యూవేషన్‌ డబ్బులు చెల్లించలేదు. మొత్తంగా చూస్తే దాదాపు ఏడు నుంచి ఎనిమిది లక్షల రూపా యలు చీఫ్‌ చేసినవారికి చెల్లిస్తామని ఇప్పటివరకు చెల్లించకుండా అధ్యాప కులను ప్రతి రూపాయి తో మోసం చేస్తూ వారి రక్తాన్ని పీడిస్తూ నామ్కే వాస్తే జీతాలతో వాళ్ళ జీవితాలలో భయభ్రాం తులను సష్టిస్తూ వారిని సమయపాలన లేకుండా ఉద్యోగంలో పనిచేస్తూ వారి జీవితానికి భరోసా లేకుండా పోయింది. ఇంతటి మోసం చేస్తూ కోట్లకు పడ గలెత్తిన ఇలాంటి కళాశాలల పై చర్యలు తీసుకోవాలని పలు వురు మేధావులు విద్యావంతులు కొర్తున్నారు. ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ ఈ కళాశాలలో అధ్యాపకుల జీతాల మోసమే అను కున్నాం కానీ పరీక్ష విభాగంలో చెల్లించే రుసుములు కూడ చెల్లించక పోవడం దారుణం, రేపు ఇలాంటి కళాశాలకు యూనివర్సిటీ హోదా ఇస్తే ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మరే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి ఇలాంటి కళాశాల పైన చర్య తీసుకొని యూనివర్సిటీ హోదా కల్పించాకుడదన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close