Featuredప్రాంతీయ వార్తలువార్తలువిద్య

– గ్రూప్‌-2 లైన్‌ క్లియర్‌

బబ్లింగ్‌, వైట్‌ నర్‌ అభ్యర్థులకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

  • 343 మంది విద్యార్థులకు ఊరట

హైదరాబాద్‌ : గ్రూప్‌ 2 ఫలితాలకు అడ్డంకి తొలగిపోయింది. బబ్లింగ్‌, వైట్‌ నర్‌ అభ్యర్థులకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సాంకేతిక కమిటీ సిఫార్సుతో ఎంపిక పక్రియ కొనసాగించా లంటూ కమిషన్‌ను ఆదేశించింది. అభ్యర్ధుల ఎంపిక పక్రియలో బబ్లింగ్‌, వైట్‌ నర్‌ వాడిన కూడా పరిగణలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. దీంతో గతంలో సింగిల్‌ బెంచ్‌ తీసివేసిన 343 మంది అభ్యర్ధులకు డబుల్‌ బెంచ్‌లో ఊరట లభించిన్లటైంది. హైకోర్టు తీర్పుతో గతంలో తీసివేసిన 343 మంది అభ్యర్ధులను పునర్‌ సవిూక్షించనున్నది.ఈ పరీక్షల్లో 1032 పోస్టులకు 1 : 3 రేషియోలో 3147 మంది సెలక్ట్‌ అయ్యారు. ఇప్పటికే ఈ అభ్యర్ధులకు సంబంధించిన వెరిఫికేషన్‌ కూడా పూర్తయ్యింది. ఇప్పుడు హైకోర్టు

ఇచ్చిన తీర్పుతో 1 : 2 రేషియో పద్ధతిలో మరోసారి మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేసి.. ఇంటర్వ్యూలకు పిలవనున్నారు. గ్రూప్‌-2 ద్వారా 1032 పోస్టులను భర్తీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ 2015 నోటిఫికేషన్‌ జారీ చేసింది. వైట్‌నర్‌ వినియోగించిన, బబ్లింగ్‌లో, వ్యక్తిగత వివరాల నమోదులో పొరపాట్లు చేసినవారిని కూడా టీఎస్‌పీఎస్సీ అర్హులుగా గుర్తించడం వల్ల అర్హులైన అభ్యర్థులు నష్టపోతారని, గ్రూప్‌-2 నియామకాలను నిలిపేయాలని కోరుతూ హైదరాబాద్‌కు చెందిన రామచంద్రారెడ్డి, పలువురు వేరువేరు పిటిషన్ల ద్వారా హైకోర్టును ఆశ్రయించారు.


హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం 3గంటల సమయం వరకు తీవ్ర ఎండతో ఉక్కిరిబిక్కిరైన జనానికి సాయంత్రం కురిసిన భారీ వర్షం ఉపశమనం కలిగించింది. హైదరాబాద్‌ అంతా కారు మబ్బులు కమ్ముకోవడంతో నగరం చీకటిమయంగా మారింది. సాయంత్రం 5గంటలకే వాతావరణమంతా మబ్బులతో చల్లబడింది. నగరంలోని శేరిలింగంపల్లి, చందానగర్‌, మియాపూర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌, కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, జీడిమెట్ల, ఈఎస్‌ఐ, ఎస్సార్‌నగర్‌, మైత్రివనం, మాదాపూర్‌, సోమాజిగూడ, బంజారాహిల్స్‌ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురవగా.. ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, కుషాయిగూడ, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్‌ ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. క్యుములో నింబస్‌ మేఘాల ప్రభావంతో గంటపాటు వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు.

వర్షం కారణంగా ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్‌ వెల్లడించారు. ఇప్పటికే అత్యవసర బృందాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. రోడ్లపై పెద్ద పెద్ద ఫ్లెక్సీలు, ¬ర్డింగ్‌ల వద్ద వాహనాలు నిలపవద్దని ప్రజలకు సూచించారు. ఈదురు గాలులతో కూడిన వర్షానికి పలుచోట్ల చెట్లు విరిగిపడినట్టు సమాచారం.

ఒకేసారి వస్తే ట్రాఫిక్‌ పరేషాన్‌

4 నుంచి 5:30 గంటల వరకు వర్షం పడటంతో ఎక్కడి వారు అక్కడే ఆగిపోయారు. దీనికితోడు ఆఫీసులు వదిలే సమయం కావటంతో.. అందరూ ఒకేసారి రోడ్లపైకి వస్తారు. దీంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తనున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. ట్రాఫిక్‌ జాం అయ్యింది. ఈ క్రమంలోనే ఆఫీసుల నుంచి అందరూ ఒకేసారి బయటకు రావొద్దని సూచిస్తున్నారు ట్రాఫిక్‌ పోలీసులు. సమయం చూసుకుని.. కొంచెం లేటుగా అయినా రోడ్లపైకి రావాలని కోరుతున్నారు. ముఖ్యంగా హైటెక్‌ సిటీలోని ఐటీ ఉద్యోగులు ఈ విషయంలో కొంచెం ఆలోచించాలని కోరుతున్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్‌, కమిషనర్‌ నగరంలోని ఎమర్జెన్సీ టీమ్‌ లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జీహెచ్‌ ఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. వారికి కేటాయించిన ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే ఇంజనీరింగ్‌ అధికారులు, డిప్యూటీ కమిషనర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close