Featuredప్రాంతీయ వార్తలు

దివ్యాంగులకు మంజూరైన యూనిట్లను గ్రౌండింగ్ చేయాలి

జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్

ఆదిలాబాద్ (ఆదాబ్ హైదరాబాద్) దివ్యాంగులకు మంజూరైన యూనిట్లను వెంటనే గ్రౌండింగ్ చేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ దివ్య దేవరాజన్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని కలెక్టర్ నిర్వహించి అర్జీదారుల నుండి వారి సమస్యలకు సంబంధించిన అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించి సాధ్యాసాధ్యాల మేరకు  చర్యలు  చేపట్టడానికి ఆయా శాఖాధికారులకు అందించారు అంతకముందు కలెక్టర్ మాట్లాడుతూ 13 మంది దివ్యాంగులకు మంజూరైన వివిధ యూనిట్లను వెంటనే స్థాపించాలని గ్రౌండింగ్ చేయాలని జిల్లా లీడ్ మేనేజర్ ను ఆదేశించారు. ఆర్థోపెడిక్ వికలాంగులను  పరిశీలించి సదరం సర్టిఫికెట్లు జారీ చేయుటకు చర్యలు చేపట్టాలని అన్నారు. దివ్యాంగులకు ఐదుశాతం రెండు పడకల  ఇళ్లను  మంజూరు చేయ్యాలని అన్నారు. ఈ నెల చివరి నాటికి ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగుల కోసం వికాసం కేంద్రాన్ని ప్రారంభించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మహిళల   లైంగిక వేధింపుల గురించి  కమిటీని ఏర్పాటు చేయాలని వచ్చే సోమవారం లోగా కమిటీలను ఏర్పాటు చేయని వారిపై  చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. దళిత బస్తీ కింద మూడు ఎకరాల భూమి మంజూరు, పింఛన్లు, భూ సమస్యలు, ఉపాధి కల్పన, ఆర్థిక సహకారం, వైద్య ఖర్చులకు  ఆర్థిక సహాయం, గిరిజన సంక్షేమ శాఖ ద్వారా సహకారం అందించాలని పలు అర్జీలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి సంధ్యారాణి, డిఆర్ఓ నట్రాజ్, ఆర్డీవో సూర్యనారాయణ, జిల్లా పరిషత్ సిఇవో కిషన్ డిఆర్డివో రాజేశ్వర్ రాట్ రోడ్ డిఇఓ రవీందర్ రెడ్డి ఎల్డిఎం  చంద్రశేఖర్ సంక్షేమ శాఖల అధికారులు సిబ్బందులు తదితరులు పాల్గొన్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close