జీవనశైలి

పచ్చని చేలా.. పావడ గట్టిన కిన్నెరసాని

కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..విశ్వనాధ పలుకై.. అది విరుల తేనెచినుకై..కూనలమ్మ కులుకై.. అది కూచిపూడి నడకై..పచ్చని చేలా.. తనననన..పావడగట్టి.. తనననన పచ్చని చేలా..పావడగట్టి..కొండమల్లెలే కొప్పునబెట్టి, వచ్చే దొరసాని.. మా వన్నెల కిన్నెరసాని.. ఈ పాట వినగానే కిన్నెరసాని అందాలు కళ్లముందు కదలాడుతాయి. మనసును పరవశింపజేసే ప్రక తి సౌందర్యం కిన్నెరసాని సొంతం. ఒకవైపు అభయారణ్యంలో దుప్పుల గెంతులు, హంసల హోయలు, బాతుల చప్పుడు. మరోవైపు వరద నీటితో నిండుకుండలా రిజర్వాయర్‌, సరస్సు మధ్యలో ద్వీపం అందులో పచ్చని అడవిని చూడగానే చిత్రకారుని చేతిలో రూపుదిద్దుకున్న అందమైన చిత్తరువులా కనువిందు చేస్తుంది. గజిబిజీ నగరజీవితానికి దూరంగా పచ్చని పావడ గట్టినట్లు ఉండే పరిసరాలతో మనసును సేదతీర్చుతున్న వన్నెల కిన్నెరసానిని ఒకసారి చూసొద్దాం రండి.

కిన్నెరసాని గోదావరి నదికి ఉపనది. ఇది వరంగల్‌ జిల్లాలోని మేడారం – తాడ్వాయి కొండసానువుల్లో పుట్టి ఆగ్నేయంగా ప్రవహించి కొత్తగూడెం జిల్లాలో భద్రాచలానికి కాస్త దిగువన బూర్గంపాడు, వేలేరు గ్రామాల మధ్యన గోదావరిలో కలుస్తుంది. దట్టమైన అడవి, కొండల మధ్య ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం యానంభైలు గ్రామం వద్ద కిన్నెరసాని నదిపై రిజర్వాయర్‌ను నిర్మించారు. 1972లో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. ఈ జలాశయం పచ్చని కొండలతో కూడిన ద్వీపాల సముదాయం, ఉరకలేస్తున్న జింకలు ఈ ప్రాంత అందాలను రెట్టింపు చేస్తూ పర్యాటకులకు స్వర్గధామంగా మారుస్తున్నాయి.

ఎకో టూరిజం

సహజసిద్ధంగా ఏర్పడిన ఇక్కడి ప్రాంతాన్ని వీక్షించడానికి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తుండడంతో జీవావరణానికి హాని జరుగుతుందని గుర్తించిన ప్రభుత్వం 1981లో ఈ ప్రాంతాన్ని కిన్నెరసాని అభయారణ్యంగా ప్రకటించింది. 1985లో రీసెర్చ్‌ల్యాబ్‌ ఏర్పాటు చేసి అంతరిస్తున్న జంతుజాలాన్ని సంరక్షించే చర్యలు చేపట్టింది. తర్వాత ఎకో టూరిజం పేరిట కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని మరింత అభివ ద్ధి చేసి ప్రాజెక్ట్‌లో విహారానికి బోటింగ్‌, కొండ ప్రాంతాల్లో ట్రెక్కింగ్‌ సౌకర్యాలను ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి ఈ ప్రాంతాన్ని అభివ ద్ధి పరుస్తున్నది.

అభయారణ్యం

కొత్తగూడెనికి సమీపంలో ఉన్న కిన్నెరసాని అభయారణ్యం ప్రక తి రమణీయతకు, పక్షుల కిలాకిలా రావాలకు పెట్టింది పేరు. ఇది గోదావరి నదికి కుడివైపున 635 చదరపు కి.మీ.లలో విస్తరించి ఉంది. చుట్టూ దట్టమైన అరణ్యం, అద్భుతమైన కొండల అందాలతో చూపరులను కట్టి పడేసే సొగసులు కిన్నెరసాని సొంతం. సింహాలు, క ష్ణ జింకలు, అడవి పందులు, నక్కలు, హైనాలు, ఎలుగుబంట్లు,, చిరుత పులులు, ఇలా ఎన్నో జంతువులకు అవాసం ఈ అభయారణ్యం. జలాశయం సమీపంలోని అభయారణ్యంలో ఉరకలేస్తున్న జింకలు సందర్శకుల ఆనందాన్ని ద్విగుణీక తం చేస్తాయి. దీనిని మరింత అభివ ద్ధి చేసేందుకు ప్రభుత్వం క షి చేస్తున్నది.

పర్యాటకానికి పెద్దపీట

కొత్తగూడెం జిల్లా కేంద్రం నుండి 24 కి.మీ., హైదరాబాదు నుంచి 304 కి.మీ. దూరం ఉన్న ఈ ప్రాంతం పర్యాటకుల సందర్శనకు అత్యంత అనువైన సుందర ప్రదేశం. వివిధ ప్రాంతాల నుండి వచ్చే పర్యాటకులు కొత్తగూడెం రైల్వేస్టేషన్‌లో దిగితే అక్కడి నుండి వివిధ వాహనాల్లో కిన్నెరసాని చేరుకోవచ్చు. మన ప్రభుత్వం రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల అభివద్దిపై ప్రత్యేక దష్టి సారించింది. పర్యాటకానికి అన్ని విధాలుగా అనువుగా ఉన్న ఈ ప్రాంతాన్ని అభివద్ధి చేసేందుకు గాను తెలంగాణ పర్యాటక అభివ ద్ది సంస్ధ రూ.53 లక్షల వ్యయంతో డీలక్స్‌ బోట్‌, స్పీడ్‌ బోట్లను కిన్నెరసాని అందాలను వీక్షించేందుకు ఏర్పాటు చేసింది. 35 మంది పర్యాటకులు ఒకేసారి ప్రయాణించే వీలున్న డీలక్స్‌ బోటులో పెద్దలకు ఒక్కొక్కరికి రూ. 50 లు, పిల్లలకు ఒక్కొక్కరికి రూ. 35లు చొప్పున చార్జీ ఉన్నది. స్పీడ్‌ బోటింగ్‌లో నలుగురు పర్యాటకులకు రూ. 300లు, ఆరుగురు పర్యాటకులకు రూ. 400లు వసూలు చేస్తున్నారు. బోటింగ్‌ ద్వారా కిన్నెరసాని అందాలను మరింత చేరువగా పర్యాటకులు వీక్షించి మధురానుభూతిని పొందవచ్చు.

కిన్నెరసాని పాటలు

కిన్నెరసాని నది వ త్తాంతాన్ని వర్ణిస్తూ విశ్వనాథ సత్యనారాయణ కిన్నెరసాని పాటలు అనే కవితా సంపుటాన్ని రాశాడు. ఇది 1925లో కోకిలమ్మ పెళ్లితో పాటు ఒకే సంచికలో ప్రచురితమైంది. విశ్వనాథ సత్యనారాయణ తండ్రి శోభనాద్రి కష్టదశలో కిన్నెరసాని వాగుకు ఆవల ఉన్న గ్రామంలో కౌలుకు భూమి తీసుకుని వ్యవసాయం చేశారు. ఆయనతో పాటుగా కుమారుడు విశ్వనాథ సత్యనారాయణ కూడా వెంట వెళ్ళేవారు. ఆ గ్రామానికి వెళ్ళే మార్గంలో వాగును దాటేప్పుడు కిన్నెరసాని వాగును భద్రాచలం అడవులలో చూసినప్పుడు ఆయన మనస్సు ఆ వాగుతో మైమరిచింది. చుట్టూ పొదలూ పుట్టలూ, పాములు పక్కగా పోయిన ఆయనకు పట్టలేదు. ఆ వాగులాగే తన భావప్రవాహం అంతలా సాగిపోయింది. అలా ఆయన కిన్నెరసానిపై అనేక పాటలు రాశారు.

నిండుకుండలా రిజర్వాయర్‌

రాష్ట్రంలో వర్షాలు విరివిగా పడుతుండడంతో ఈ ప్రాంతం మరింత అందాల్ని సంతరించుకుంది. వరద నీటితో నిండుకుండలా కిన్నెరసాని రిజర్వాయర్‌ దర్శనమిస్తున్నది. దీంతో పర్యాటకులు ఆ నీటి సవ్వడులను చూసి తన్మయత్వం పొందుతున్నారు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉండడంతో అభయారణ్యంలోని దుప్పులు ఫెన్సింగ్‌ పక్కకు వస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. సమీపంలో ఉన్న పర్యావరణ విజ్ఞాన కేంద్రానికి వెళ్లి అక్కడి విగ్రహాలను పరిశీలిస్తున్నారు. రిజర్వాయర్‌లో బోటులో ప్రయాణిస్తూ ప్రాజెక్ట్‌లోని ద్వీపానికి చేరుకుని పచ్చని అడవుల్లో తిరుగుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్కడి జంతువులు, పక్షులు, సరీస పాలను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇక్కడ పర్యాటకులకు అవసరమైన వసతి సౌకర్యాలు, కాటేజీలు, హోటళ్ళు ఉన్నాయి. కాగా పర్యాటకుల రక్షణకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close