Featuredరాజకీయ వార్తలు

కేసీఆర్‌ ఘన విజయం

గజ్వేల్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్‌ విజయ దుందుభి మోగించారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో ప్రత్యర్థి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి వంటేరు ప్రతాపరెడ్డిపై 51,515 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధిం చారు. కేసీఆర్‌ ఓటమే లక్ష్యంగా పాచికలు కదిపిన ప్రజాకూటమి దారుణంగా భంగపడింది. గత ఎన్నికల్లో ఇదే వంటేరు ప్రతాప్‌ రెడ్డి టీడీపీ తరుఫున బరిలోకి దిగగా.. కేసీఆర్‌ కేవలం 19,391 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ తరఫున బరిలోకి దిగిన నర్సారెడ్డి అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు. సరిగ్గా ఎన్నికల ముందు నర్సారెడ్డిని తమ వైపు తిప్పుకుని కాంగ్రెస్‌ పెద్ద ఎత్తుగడనే వేసింది. నర్సారెడ్డి, వంటేరు ప్రతాప్‌ రెడ్డిల కలయికతో సీఎం కేసీఆర్‌ ఓటమి తప్పదని జోరుగా ప్రచారం జరిగింది. కానీ కేసీఆర్‌ గత ఎన్నికల్లో కంటే రెట్టింపు మేజార్టీతో గెలుపొం దారు. కేసీఆర్‌, మంత్రి హరీష్‌రావుల వ్యూహాల ముందు కాంగ్రెస్‌ ఎత్తుగడలు పనిచేయలేదని ఫలితాలతో స్పష్టమైంది. ముఖ్యంగా మంత్రి హరీష్‌ రావు తన నియోజకవర్గం సిద్దిపేట కన్నా ఎక్కువగా గజ్వేల్‌ల్లోనే ప్రచారం నిర్వహించి కేసీఆర్‌ గెలుపులో కీలక పాత్ర పోషించారు. గత ఎన్నికల్లో 19,366 ఓట్లతో వంటేరుపై గెలిచిన కేసీఆర్‌.. ఈ సారి ఎన్నికల్లో 50వేలకు పైగా మెజారిటీ విజయం సాధించారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close