Featuredప్రాంతీయ వార్తలు

గౌడ మహిళలు రాజకీయంగా ఎదగాలి : స్వామి గౌడ్

హైదరాబాద్ ఆదాబ్ హైదరాబాద్….రాజకీయ చైతన్యం తోనే సకల సమస్యలు పరిష్కారం అవుతాయని గౌడ కులస్తులు రాజకీయాల్లో మరింతగా రాణించేందుకు తన వంతు బాధ్యతలను నిర్వహిస్తానని మాజీ ఎమ్మెల్సీ ,కే .స్వామి గౌడ్ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర గౌడ మహిళా సంఘం ఆధ్వర్యంలో చంద్రాయణగుట్ట లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో వెనుకబాటుతనం కారణంగానే నేటికీ గ్రామాలలో గౌడ కుటుంబా లు పేదరికంతో అలమటిస్తున్నాయి అని ఆవేదన వ్యక్తపరిచారు. గౌడ కులస్తులు అందరూ ప్రతి గ్రామంలో ఒక యూనిట్ గా ఏర్పడి కుల సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని కుల సంఘాల ద్వారా నే  రాజకీయ చైతన్యం పెంపొందించుకోవచ్చు నని ఆయన సూచించారు.కుల సంఘం మహిళల్లో అక్షరజ్ఞానం తో పాటు రాజకీయ అవగాహన కోసం ప్రముఖులతో అవగాహన తరగతులను ఏర్పాటు చేసుకోవాలని స్వామిగౌడ్ విజ్ఞప్తి చేశారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని అయితే వాటిని సద్వినియోగం చేసుకునే స్థాయికి మహిళల్లో చైతన్యం పెంపొందించాల్సిన బాధ్యత ను ప్రతి ఒక్కరు స్వీకరించాలని ఆయన కోరారు.ప్రభుత్వ పథకాలతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను విస్తృతంగా వినియోగించుకోవాలని ఇందుకోసం బ్యాంకులు విరివిగా రుణాలు మంజూరు చేస్తున్నాయని, ప్రభుత్వం సైతం సబ్సిడీ లు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారని స్వామిగౌడ్ వివరించారు. ఈ కార్యక్రమంలో గౌడ మహిళలతో పాటు గౌడ సంఘం నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.Attachments area

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close