Featuredస్టేట్ న్యూస్

వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్న గవర్నర్‌

వరంగల్‌: రాష్ట్ర గవర్నర్‌ డాక్టర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ సోమ, మంగళవారాల్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈమేరకు ఆమె పర్యటన షెడ్యూల్‌ ఖరారైంది. వరంగల్‌ అర్బన్‌, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా 9వ తేదీ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు వరంగల్‌కు హరిత కాకతీయ ¬టల్‌కు చేరుకుంటారు. అక్కడే భోజనం చేసిన అనంతరం కాసేపు రెస్టు తీసుకుంటారు.

  • మధ్యాహ్నం 3గంటలకు ¬టల్‌ నుంచి బయలు దేరి 3.10 వరకు సుబేదారిలోని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌కు చేరుకుంటారు.
  • 3.10గంటల నుంచి 3.15 వరకు గార్డ్‌ హానర్‌ బై జూనియర్‌, యూత్‌ రెడ్‌క్రాస్‌ మెంబర్స్‌ ఫాలోడ్‌ బై ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ ఫ్లాగ్‌ను ఆవిష్కరిస్తారు.
  • 3.15గంటల నుంచి 3.25వరకు ప్లానిటేషన్‌, జనరిక్‌ మెడికల్‌ షాపును సందర్శిస్తారు.
  • 3.25గంటల నుంచి 3.40 వరకు తలసేమియా ఎక్సెటెన్షన్‌ బ్లాక్‌కు శంకుస్థాపన చేస్తారు. తలసేమియా సెంటర్‌ను సందర్శిస్తారు.
  • 3.40 గంటల నుంచి 3.45 వరకు బ్లడ్‌ బ్యాంకును సందర్శిస్తారు.
  • 3.45గంటల నుంచి 4.15 వరకు రెడ్‌క్రాస్‌ సమావేశ మందిరంలో జూనియర్‌, యూత్‌ రెడ్‌క్రాస్‌ సభ్యులతో సమావేశమై రివ్యూ చేస్తారు.
  • సాయంత్రం 4.15 గంటలకు రెడ్‌క్రాస్‌ నుంచి బయలుదేరి 4.25కి వేయి స్తంభాలగుడికి చేరుకుంటారు.
  • 4.25 గంటల నుంచి 4.40 వరకు ఆలయాన్ని సందర్శిస్తారు.
  • 4.40గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4.45కు భద్రకాళీ దేవాలయానికి వెళ్తారు.
  • 4.45 గంటల నుంచి 5వరకు భద్రకాళీ దేవాలయం సందర్శిస్తారు.
  • సాయంత్రం 5గంటలకు దేవాలయం నుంచి బయలుదేరి 5.15 వరకు ఫోర్టు వరంగల్‌లోని ఖుష్‌మహల్‌కు వెళ్తారు.
  • రాత్రి 6.40గంటల వరకు అక్కడే ఉండి సౌండ్‌ సిస్టం, లైట్‌ షోను వీక్షిస్తారు.
  • రాత్రి 6.40 గంటలకు ఫోర్టు వరంగల్‌ నుంచి బయలుదేరి 7 గంటల వరకు హన్మకొండలోని హరిత కాకతీయ ¬టల్‌కు చేరుకుంటారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

మంగళవారం పర్యటన

  • 10వ తేదీ ఉదయం 8గంటలకు హరిత కాకతీయ ¬టల్‌ నుంచి బయలు దేరి రోడ్డు మార్గంలో 9.15 గంటలకు భూపాలపల్లికి చేరుకుని జనరిక్‌ మందుల షాపును ప్రారంభిస్తారు.
  • 9.30గంటలకు భూపాలపల్లి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి కాటారం మండలం బోడగూడెం (నస్తూర్‌పల్లి పరిధిలోని) గ్రామాన్ని 10.20కి సందర్శిస్తారు.
  • 11.20 గంటలకు బోడగూడెం నుంచి బయలుదేరి రోడ్డు మార్గం ద్వారా 11.50కి కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దేవాలయానికి వెళ్తారు.
  • మధ్యాహ్నం 12.30కు ఆలయం నుంచి బయలు దేరి 12.45కు లక్ష్మీపంప్‌హౌస్‌ గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు.
  • 12.45గంటల నుంచి 1.30 వరకు భోజనం విరామం
  • 1.30 గంటల నుంచి 2.15 వరకు కన్నెపల్లిలోని పంప్‌హౌస్‌ను సందర్శిస్తారు.
  • 2.15గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 2.45 వరకు మేడిగడ్డ లక్ష్మీ బరాజ్‌కు చేరుకుటారు.
  • సాయత్రం 4గంటలకు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ నుంచి బయలుదేరి 4.30కు అన్నారం సరస్వతీ బ్యారేజీకి చేరుకొని సందర్శిస్తారు.
  • సాయంత్రం 5.30గంటలకు సరస్వతీ బ్యారేజీ నుంచి రోడ్డు మార్గం ద్వారా పెద్దపల్లి జిల్లాలోని రామగుండం వెళ్తారు.
Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close