Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలువిద్యస్టేట్ న్యూస్

8న గవర్నర్‌గా.. సౌందర్ రాజన్‌ ప్రమాణస్వీకారం

ప్రమాణం చేయించనున్న హైకోర్టు సీజే

హైదరాబాద్‌

తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా నియమితులైన తమిళనాడు బీజేపీ నేత తమిళసై సౌందరరాజన్‌ ఈనెల 8న(ఆదివారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 11గంటలకు ఆమెచేత హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. తెలంగాణ గవర్నర్‌గా తమిళసై నియమితులైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర నూతన గవర్నర్‌ తమిళసై సౌందరరాజన్‌కు బుధవారం ఢిల్లీలో తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ వేదాంతంగిరి నియామకపత్రం అందజేశారు. చెన్నైలోని ఆమె నివాసంలో అపాయింట్మెంట్‌లెటర్‌ ను అందించారు. ఈ సందర్భంగా కొత్త గవర్నర్‌ కు వేదాంతంగిరి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ గవర్నర్‌ గా బాధ్యతలు దక్కడంపై సంతోషం వ్యక్తంచేశారు. సెప్టెంబర్‌ 8వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నట్లు ఆమె తెలిపారు. బీజేపీ తమిళనాడు ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఆమెకు కేంద్రం గవర్నర్‌ గా అవకాశం కల్పించింది. తమిళసై సౌందర్య రాజన్‌ వృత్తిరిత్యా వైద్యురాలు. తమిళనాడు కన్యకుమారి జిల్లా నాగర్‌ కోయిల్‌లో పుట్టారు. మద్రాస్‌ మెడికల్‌ కాలేజీలో సౌందర్‌ రాజన్‌ ఎంబీబీఎస్‌ చదివారు. ఆ సమయంలో విద్యార్థి సంఘం నేతగా కూడా పనిచేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శిగా కూడా ఆమె పనిచేశారు. ఇప్పటివరకు రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లుగా ఎంపీగా పోటీ చేసిన ఆమె ఒక్కసారి కూడా గెలవలేదు. మొన్నటివరకు రెండు తెలుగు రాష్టాల్రకు గవర్నర్‌గా ఉన్న నరసింహన్‌ తెలంగాణ గవర్నర్‌ గా మారగా.. ఆయనను తొలగించి సౌందర్యరాజన్‌ ను తెలంగాణ గవర్నర్‌ గా నియమించింది కేంద్రం. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చివరి గవర్నర్‌గా సరికొత్త రికార్డు నమోదు చేశారు నరసింహన్‌. రెండు రాష్ట్రాల తొలి ప్రభుత్వాలకు పూర్తి కాలం గవర్నర్‌గా పనిచేశారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఏకంగా ఆరుగురితో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించిన నరసింహన్‌, 2010 నుంచి 2019 వరకు గవర్నర్‌ గా బాధ్యతలు నిర్వహించారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close