Featuredస్టేట్ న్యూస్

ఏసిబి వలలో ప్రభుత్వ అధికారులు

లంచం తీసుకుంటు పట్టుబడ్డ ఏల్లారెడ్డిపేట సిఐ లింగమూర్తి, గంబీరావుపేట ఏస్‌ఐ అనిల్‌ కుమార్‌, కానిస్టేబుల్‌ కనుక రాజు.

రంగారెడ్డి జిల్లాలోని హయత్‌నగర్‌ మండలం గౌరెల్లి పంచాయతీ కార్యదర్శి .

గంభీరావుపేట్‌(ఆదాబ్‌ హైదరాబాద్‌): రాజన్న సిరి సిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్‌ స్టేషన్‌పై శుక్రవా రం ఏసిబి డిఏస్పీ భధ్రయ్య ఆధ్వ ర్యంలో ఏసీబీ పోలీసుల బం దం లంచం తీసుకుం టున్న ఏల్లారెడ్డి పేట సిఐ లింగ మూర్తి ని.గంబీరా వుపేట ఏస్‌ఐ అనిల్‌ కుమార్‌ను. కానిస్టేబుల్‌ కనుక రాజు లను పట్టుకున్నారు. మాచా రెడ్డి మండలానికి చెందిన సింహాచలం తన ఇంటి అవసరాల కోసం ట్రాక్టర్‌ ధ్వారా ఇసుక తెప్పిస్తుండగా గంభీరా వుపేట పోలీసులు పట్టుకున్నారు. అట్టి ట్రాక్టర్‌ను కేసులేకుండా విడిచి పెట్టడానికి 25000 రూపాయల లంచం డిమాండ్‌ చేయ గా సింహాచలం 10000 వేల రూపా యలకు పోలీసులును ఓప్పించి ఏసీబీ అధికారులను కలిసినట్టు తెలిసింది. ఏసిబి అది కారుల సూచ నల మేరకు పథకం ప్రకారం ఏల్లారెడ్డిపేట సిఐ లింగమూర్తి. గంబీరావుపేట ఏస్‌ఐ అనిల్‌ కుమార్‌. కానిస్టేబుల్‌ కనకరాజు 10000 రూపాయల లంచం తీసుకొంటుఉండగా ఏసిబి డిఎస్పీ భద్రయ్య అదికారులు వలపన్నీ పట్టుకున్నారు. ఆ ముగ్గురి పై డిఏస్పి భద్రయ్య పంచనామా చేసి ఆనంతరం కేసు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు.

లంచం తీసుకుంటు పట్టుబడ్డ ఏల్లారెడ్డిపేట సిఐ లింగమూర్తి, గంబీరావుపేట ఏస్‌ఐ అనిల్‌ కుమార్‌, కానిస్టేబుల్‌ కనుక రాజు.

ఎసిబికి చిక్కిన గౌరెల్లి విఆర్వో…. రంగారెడ్డి జిల్లాలోని హయత్‌ నగర్‌ మండలం గౌరెల్లి పంచాయతీ కార్యదర్శి అవినీతికి పాల్ప డుతూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్‌ ఓ ఇంటి నిర్మాణదారుడికి నిరభ్యంతర పత్రం ఇచ్చేం దుకు లంచం డిమాండ్‌ చేశాడు. నిర్మాణదారు నుంచి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధకశాఖ అధికా రులు రైడ్‌ చేసి ప్రత్యక్షంగా పట్టుకున్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close