Featuredస్టేట్ న్యూస్

ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు.. జీ..హుజూర్‌ అంటున్న జీవోలు

డిసెంబర్‌ 7వ తేదీలోగా సమగ్ర విచారణ జరిపించి నివేదిక అందజేయాల్సిందిగా డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌, ఆర్జెడి హైదరాబాద్‌ డి.ఇ.ఓలకు మైనారిటీ కమిషన్‌ ఆదేశం. అంబర్‌ పేటలోని కె.ఆర్‌.కె ఉన్నత పాఠశాలలో 200 గజాలలో 1240 గజాల ఆట స్థలం చూపించిన యజమాన్యం. అనుమతులు లేకుండా ఐదు అంతస్తుల భవన నిర్మాణం, ప్రమాదపు అంచున పసివాళ్లు. ఇరుకు భవనాల్లో రోగాల బారిన పడుతున్న విద్యార్థులు. మున్సిపల్‌, రెవెన్యూ విభాగాలను తలదన్నే రీతిలో అవినీతికి అలవాటు పడిన విద్యాశాఖ

హైదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): ప్రైవేట్‌ పాఠశాలలో ప్రభుత్వ జీవోలు నామమాత్రంగానైనా అమలు కావడం లేదని ,విద్యార్థుల జీవితాలు ప్రమాదపు అంచున ఉన్నవని భావిస్తూ ఈ వ్యవహారంపై డిసెంబర్‌ 7వ తేదీలోగా పూర్తి నివేదికను సమర్పిం చాలని మైనారిటీ కమిషన్‌ చైర్మన్‌ జనాబ్‌ మహమ్మద్‌ ఖ్మారుద్దీన్‌ ఆదేశించారు. మాదరెస్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు మహమ్మద్‌ ఫరీదుద్దీన్‌ తెలంగాణ మైనారిటీస్‌ కమిషన్‌ కు చేసిన ఫిర్యాదు మేరకు స్కూల్‌ ఎడ్యుకేషన్‌ జె డి రమేష్‌, హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట నరసమ్మ, హైదరాబాద్‌ రీజినల్‌ జాయింట్‌ డైరెక్టర్‌ పిలిపించి విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఫరీదుద్దీన్‌ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కరువైనావని, ఫోర్జరీ సంతకాలతో, బోగస్‌ పత్రా లను సమర్పించి రికార్డులను తారుమారు చేస్తున్న విద్యాశాఖ అధికారులు అవినీతికి అలవాటుపడి బాలబాలికల విద్యార్థుల ప్రాణాలకు ప్రమాదం తెచ్చి పెడుతున్నారని ఆరోపించారు. అంబ ర్పేట్‌ లోని కె ఆర్‌ కె ఉన్నత పాఠశాల పేరుతో ప్రారంభించిన ప్రైవేట్‌ పాఠశాల 200 గజాల స్థలంలో ఐదు అంతస్తులు నిర్మిం చారని ఈ పాఠశాల భవనంలో సుమారు 800 మంది విద్యా ర్థులు చదువుకుంటున్నారని ఆయన వివరించారు. అయితే పాఠశాల ఎలాంటి జిహెచ్‌ఎంసి అనుమతులు లేవని ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించి హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేసిన ఎటువంటి చర్యలు తీసుకోక పోవడం పట్ల ఆయన విచారం వ్యక్త పరిచారు. అంతేకాకుండా 200 గజాల స్థలంలో నిర్మించిన అక్రమ భవనంలో 12 వందల గజాల పై ఆట స్థలం ఉందని రికార్డు సష్టించిన అధికారులు గుడ్డిగా వివరించి ఉన్నత పాఠశాలగా గుర్తింపు నివ్వడం ఏమిటని ప్రశ్నించారు. కెఆర్‌కె పాఠశాలలో ప్రధాన ఉపాధ్యా యురాలిగా కే. పద్మని అధికారులు గుర్తించారని కానీ ఆమెకు కనీస విద్యార్హతలు లేవని ఫరీదుద్దీన్‌ ఆధారాలను సమర్పించారు .ఈ విధంగా నగరంలోని అనేక ప్రైవేట్‌ పాఠశాలలు ధనార్జనే ముఖ్య ఉద్దేశంగా, విద్యార్థులకు బలిపీఠంపై నెక్కించి పండగ చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు .ప్రభుత్వ ఉత్తర్వులను అమలు పరచవలసిన కనీస జ్ఞానం బాధ్యత అధికారులకు లేని కారణంగా ఇరుకు గదుల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు 20 సంవత్సరాలు దాటిన శారీరకంగా ఎదగలేక రోగాల బారిన పడుతున్నారని కొన్ని ప్రైవేటు పాఠశాలలో ట్రాఫిక్‌ పోలీసులు ఎన్‌ఓసిలు జారీ చేయగా తేలిగ్గా అనేక పాఠశాలలు వాటిని ఫోర్జరీ చేసి జిరాక్స్‌ లపై వారి పేరున ఎక్కించుకొని ప్రభుత్వ గుర్తింపు కోసం సమర్థిస్తున్నారని, ఎన్ని అవకతవకలు చేస్తున్న అధికారులు గుర్తించకపోవడం పట్ల ఆయన విచారం వ్యక్తపరిచారు. బోగస్‌ టీచర్లు పనిచేస్తున్నారని కానీ రికార్డుల్లో మాత్రం అన్ని అర్హతలూ ఉన్న వారి పేర్లను జత చేస్తున్నారని ఫరీదుద్దీన్‌ ఆరోపించారు. మైనారిటీ కమిషన్‌ ఫిర్యాదు పై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమగ్ర నివేదికను సమర్పించాలని హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటనర్సమ్మ ను ఆదేశించారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close