విద్య

జర్నలిస్టులకు ఉచితంగా ట్రెయినింగ్ ఇవ్వనున్న గూగుల్

భారత్‌లో ఉన్న జర్నలిస్టులకు సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ ఉచితంగా ట్రెయినింగ్ ఇచ్చేందుకు సిద్ధమైంది. నేటి తరుణంలో పుట్టలు పుట్టలుగా పుట్టుకొస్తున్న వెబ్‌సైట్లకు తోడు, సోషల్ మీడియాలోనూ తప్పుడు సమాచారం, తప్పుడు వార్తలు బాగా ప్రచారమవుతున్నాయి. ఈ క్రమంలో అలాంటి సమాచారం, వార్తలు జనాలకు ఇబ్బందులను తెచ్చిపెడుతున్నాయి. దీంతో ఇలాంటి తప్పుడు వార్తలను తెలుసుకునేందుకు, మరింత నాణ్యమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలనే ఉద్దేశ్యంతో గూగుల్ దేశంలో ఉన్న జర్నలిస్టులకు ఉచితంగా ట్రెయినింగ్ ఇవ్వాలని సంకల్పించింది.

‘గూగుల్ న్యూస్ ఇనిషియేటివ్’ పేరిట దేశంలో ఉన్న జర్నలిస్టులకు గూగుల్ ప్రత్యేక వర్క్‌షాపుల్లో ట్రెయినింగ్ ఇవ్వనుంది. మరో ఏడాదిలోగా మొత్తం 8వేల మందికి ఈ ట్రెయినింగ్ ఇవ్వనున్నారు. ఇంగ్లిష్, హిందీ, కన్నడ, తమిళం, తెలుగు, మరాఠీ, బెంగాలీ భాషలకు చెందిన జర్నలిస్టులకు ట్రెయినింగ్ ఇస్తారు. ఈ భాషలకు చెందిన ఔత్సాహికులైన జర్నలిస్టులు https://goo.gl/Ttur3b అనే వెబ్‌సైట్‌ను సందర్శించి అందులో ఉండే దరఖాస్తు ఫాంలో వివరాలను నింపి ట్రెయినింగ్ పొందేందుకు ఫాంను సబ్‌మిట్ చేయవచ్చు. ఇందుకు గాను ఇంగ్లిష్‌కు జూలై 5వ తేదీ వకు, హిందీ, కన్నడ, తమిళ్ జర్నలిస్టులకు జూలై 15వ తేదీ వరకు గడువిచ్చారు. అలాగే తెలుగు, మరాఠీ, బెంగాలీ భాషలకు చెందిన జర్నలిస్టులకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు విధించారు. ఆ గడువులోగా ట్రెయినింగ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. అందులో అర్హత ఉన్నవారిని ఎంపిక చేసి ఉచితంగా ట్రెయినింగ్ ఇస్తారు.

ట్రెయినింగ్‌లో భాగంగా జర్నలిస్టులకు ఉచిత రవాణా, భోజన సదుపాయాలతోపాటు స్టయిఫండ్ కూడా ఇస్తారు. ఇక ట్రెయినింగ్ సమయంలో జర్నలిస్టులకు పలు రకాల నూతన తరహా సాఫ్ట్‌వేర్ల గురించి అవగాహన కల్పిస్తారు. వాటి సహాయంతో వార్తలను ఎలా సేకరించాలి, నకిలీ వార్తలు, సమాచారాన్ని ఎలా గుర్తించాలి అనే విషయాలపై జర్నలిస్టులకు అవగాహన కల్పిస్తారు. అలాగే ట్రెయినింగ్ మొదటి దశలో మొత్తం 200 మంది జర్నలిస్టులకు శిక్షణనిస్తారు. శిక్షణ తరగతులు జరగనున్న తేదీలు, ప్రదేశాల వివరాలు ఇలా ఉన్నాయి.

* ఇంగ్లిష్ – జూలై 20 నుంచి ఆగస్టు 3 వరకు – గురుగ్రామ్ – దరఖాస్తుకు చివరి తేదీ జూలై 5
* హిందీ – ఆగస్టు 20 నుంచి 24 వరకు – గురుగ్రామ్ – దరఖాస్తుకు చివరి తేదీ జూలై 15
* కన్నడ – ఆగస్టు 27 నుంచి 31 వరకు – బెంగళూరు – దరఖాస్తుకు చివరి తేదీ జూలై 15
* తమిళం – సెప్టెంబర్ 17 నుంచి 22 వరకు – చెన్నై – దరఖాస్తుకు చివరి తేదీ జూలై 15
* తెలుగు – నవంబర్ 19 నుంచి 22 వరకు – హైదరాబాద్ – దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 15
* మరాఠీ – డిసెంబర్ 3 నుంచి 7 వరకు – ముంబై – దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 15
* బెంగాలీ – జనవరి 15 నుంచి 19వ తేదీ వరకు – కోల్‌కతా – దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 15

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close