Featuredఅంతర్జాతీయ వార్తలుజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలువార్తలుస్టేట్ న్యూస్

ఆత్మీయ వీడ్కోలు..

గవర్నర్‌ దంపతులకు ఆత్మీయ సత్కారం

  • ప్రగతిభవన్‌లో సన్మానించిన సీఎం కేసీఆర్‌
  • బేగంపేట విమానాశ్రయంలో వీడ్కోలు
  • నేడు గవర్నర్‌గా ప్రమాణం చేయనున్న తమిళసై సౌందర్య రాజన్‌

హైదరాబాద్‌,సెప్టెంబర్‌7(ఆర్‌ఎన్‌ఎ): గవర్నర్‌ నరసింహన్‌ శకం ముగిసింది. ఆయన తన స్వరాష్ట్రం తమిళనాడు వెళ్లారు. చివరి రోజు సిఎం కెసిఆర్‌ ఘనంగా సత్కరించి వీడ్కోలు పలికారు. ఇక తమిళ సై సౌందర్యరాజన్‌ ఆదివారం తదుపరి గవర్నర్‌గా ప్రమాణంచేయనున్నారు. ఈ మేరకు రాజ్‌భవన్‌లో ఏర్పాట్లు సాగుతున్నాయి. మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ దంపతులకు తెలంగాణ ప్రభుత్వం ఆత్మీయ వీడ్కోలు పలికింది. అనంతరం నరసింహన్‌ బేగంపేట ఎయిర్‌ పోర్టు నుంచి బెంగళూరుకు బయల్దేరారు. అంతకు ముందు ప్రగతి భవన్‌లో గవర్నర్‌ దంపతులకు సిఎం కెసిఆర్‌ ఆత్మీయ సన్మానం చేశారు. ఈ సందర్భంగా కెసిఆర్‌ మాట్లాడుతూ గవర్నర్‌ నరసింహన్‌ సేవలు కోల్పోవడం అత్యంత బాధగా ఉందన్నారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కొత్త రాష్ట్రం ప్రస్థానం పూర్తిగా తెలిసిన వ్యక్తి నరసింహన్‌ అని కొనియాడారు. నరసింహన్‌ ఎప్పటికప్పుడు వెన్నుతట్టి, ధైర్యం చెప్పి స్ఫూర్తి నింపారని ప్రశంసించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ దంపతులు ప్రతి పండుగను గొప్పగా నిర్వహించేవారని గుర్తు చేశారు. నరసింహన్‌ ఇచ్చిన స్ఫూర్తిని, మార్గదర్శకత్నాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు. నాకు పెద్దదిక్కులా, రాష్టాన్రికి మార్గదర్శకుడిగా వ్యవహరించారని, నరసింహన్‌ హయాంలో ఉద్యమకారుడిగా, సిఎంగా బాధ్యతలు నిర్వర్తించానని, నాడు ఉద్యమాన్ని అణచివేయడానికే నరసింహన్‌ వచ్చారనే భయం ఉండేదని, ఉద్యమ నేపథ్యాన్ని నరసింహన్‌ చాలా ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారని కెసిఆర్‌ గుర్తు చేశారు. ఇంటెలిజెన్స్‌ బ్యూరో విభాగాధిపతిగా పని చేసిన అనుభవం ఆయనదని తెలియజేశారు. స్వరాష్ట్ర ఉద్యమం, ప్రజల డిమాండ్‌ గురించి కేంద్రానికి సరైన నివేదికలే పంపుతారని ఆనాడు విశ్వసించానన్నారు. నన్ను కూడా ఆయన సిఎంలా కాకుండా తమ్ముడిలా ఆదరించారని చెప్పారు. అంతకుముందు కెసిఆర్‌ దంపతులు నరసింహన్‌కు సత్కారం చేశారు. అనంతరం బేగంపేట ఎయిర్‌పోర్టులో కెసిర్‌ సాదర వీడ్కోలు పలికారు.

ప్రగతి భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌కు రాష్ట్ర ప్రభుత్వం వీడ్కోలు సభ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ప్రగతి భవన్‌కు చేరుకున్న నరసింహన్‌ దంపతులకు సీఎం కేసీఆర్‌, మంత్రులు ఘన స్వాగతం పలికారు. వీడ్కోలు కార్యక్రమం ముగిసిన అనంతరం సాయంత్రం నరసింహన్‌ దంపతులు ప్రత్యేక విమానంలో చెన్నై వెళ్ళారు.ప్రగతి భవన్‌లో జరిగే వీడ్కోలు సభకు మంత్రులు, శాసనసభ స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌, డిప్యూటీ చైర్మన్‌, ఉన్నతాధికారులకు మాత్రమే అనుమతించారు.  ఇక ఆదివారం ఉదయం తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్‌గా తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త గవర్నర్‌ ప్రమాణస్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు రాజ్‌భవన్‌లో కొనసాగుతున్నాయి. ఆమె తదుపరి గవర్నర్‌గా ప్రమాణం చేయనున్నారు. 

పద్మాదేవేందర్‌కు ప్రగతిభవన్‌ వద్ద చేదు అనుభవం రాష్ట్ర మాజీ డిప్యూటీ స్పీకర్‌, మెదక్‌ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. గవర్నర్‌ నరసింహన్‌కు వీడ్కోలు సభకు ప్రగతిభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాగా ఆమెకు అనుమతి నిరాకరించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కొత్త గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌ నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్‌ నరసింహన్‌ కు హైదరాబాదులోని ప్రగతి భవన్‌ లో ఘనంగా వీడ్కోలు పలకబోతున్నారు. ఈ క్రమంలో ప్రగతి భవన్‌ కు మంత్రులు, ఐఎఎస్‌, ఐపిఎస్‌లు చేరుకున్నారు. అయితే ఈ కార్యక్రమానికి పద్మా దేవేందర్‌ రెడ్డి ప్రగతి భవన్‌ కు వెళ్లారు. కాగా, ఆమెను పోలీసులు లోనికి పంపించలేదు. కేవలం మంత్రులు, ఐఎఎస్‌, ఐపిఎస్‌ అధికారులకు మాత్రమే అనుమతి ఉందన్న పోలీసులు ఎమ్మెల్యేలకు అనుమతి లేదని చెప్పారు. పోలీసులు చెప్పిన మాటలు విన్న ఆమె షాక్‌ తిన్నారు. తక్షణమే అక్కడి నుంచి ఆమె వెనుదిరిగారు.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close