Featuredజాతీయ వార్తలు

పసుపు రైతులకు కేంద్రం తీపి కబురు

  • స్పైసెస్‌ రీజినల్‌ సెంటర్‌ ఏర్పాటు
  • నిజామాబాద్‌ కేంద్రంగా కార్యాలయం
  • కేంద్ర వాణిజ్య పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటన

న్యూఢిల్లీ

నిజామాబాద్‌లో స్పైసెస్‌ రీజినల్‌ ఎక్స్‌టెన్షన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని కేందప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ కీలక ప్రకటన చేశారు. స్పైసెస్‌ రీజినల్‌ ఎక్స్‌ టెన్షన్‌ సెంటర్‌ ఏర్పాటుతో పసుపు బోర్డు కంటే మించి రైతులకు లాభం జరుగుతుందన్నారు. నిజామాబాద్‌ ఎంపీ ఆర్వింద్‌ చొరవతో ఈ సెంటర్‌ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ సెంటర్‌ తో పసుపు, మిరప పంటలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల రైతులకు ఉపయోగమని అన్నారు. స్పైస్‌ బోర్డు విస్తరణపై కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ కీలక ప్రకటన చేశారు. నిజామాబాద్‌ కేంద్రంగా స్పైస్‌ ప్రాంతీయ బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ బోర్డు పసుపు పంట ఎగుమతులపై ప్రత్యేక దృష్టితో పనిచేస్తుందని చెప్పారు. పసుపు సహా మిగతా మసాలా దినుసుల కోసం కార్యాలయం పనిచేస్తుందన్నారు. పసుపు బోర్డుకు మించిన ప్రయోజనాలు స్పైసెస్‌ బోర్డు ప్రాంతీయ కార్యాలయం ద్వారా లభిస్తాయన్నారు. పసుపు పంట నాణ్యత, దిగుబడి పెంచే విషయంలో బోర్డు ప్రాంతీయ కార్యాలయం పని చేస్తుందన్నారు. పంట దిగుబడి వచ్చిన తర్వాత ఎగుమతులకు బోర్డు అన్ని విధాలుగా సహకరిస్తుందన్నారు. రైతులకు అంతర్జాతీయ బయ్యర్లతో సమావేశం ఏర్పాటు చేసి అధిక ధరలు లభించేలా తోడ్పడుతుందన్నారు. నిజామాబాద్‌ రైతులు కోరిన దానికంటే ఎక్కువ ప్రయోజనాలు కల్పించామని చెప్పారు. ఇప్పటివరకు కేరళలో స్పైసెస్‌ బోర్డు ఆఫీస్‌ ఉండేది. మన రాష్ట్రంలోని పసుపు రైతుల కోసం రీజినల్‌ ఎక్స్‌ టెనషన్‌ సెంటర్‌ ను నిజామాబాద్‌ లో ఏర్పాటుచేసినట్టు కేంద్రం తెలిపింది. పసుపు పంట నాణ్యత, మద్దతు ధర విషయాలను రీజినల్‌ బోర్డు చూసుకోనుంది. పసుపుకు మద్దతు ధర కోసం నిజామాబాద్‌ రైతులు ఎన్నాళ్లుగానో పోరాటం చేస్తున్నారు. రీజినల్‌ బోర్డు ఎక్స్‌ టెన్షన్‌ సెంటర్‌ ను ఐఏఎస్‌ అధికారులు నేరుగా పర్యవేక్షిస్తారు. నిజామాబాద్‌ రైతులు కోరినదానికంటే ఎక్కువ ప్రయోజనం ఉండేలా రీజినల్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేసినట్టు పియూష్‌ గోయల్‌ చెప్పారు. రీజినల్‌ ఎక్స్‌ టెన్షన్‌ సెంటర్‌ నిజామాబాద్‌ పసుపు రైతులకు కేంద్రం ఇచ్చిన గిప్ట్‌ అని ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అన్నారు. పసుపు పంటకు మద్దతు ధర పెంచేలా.. గడిచిన మూడునాలుగేళ్లపాటు వాణిజ్య శాఖ కసరత్తు చేసిందన్నారు. రైతుల పోరాటానికి ఇది ఫలితం అన్నారు. వారు ఎన్నోల ఏళ్లుగా దీనికోసం పోరాడుతున్నారని, అయితే అంతకు మించి ప్రయోజనం కలిగేలా తాము కేంద్రంతో పోరాడి సాధించామని అన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close