రైతులకు చల్లని కబురు

0
In heavy rain a farmer ploughs his paddy field, while women transplant rice seedlings nurtured in irrigated plots, Goa, Western India. National Geographic Magazine, Monsoons: Life Breath of Half the World", December 1984, Vol. 166, No. 6 Monsoon_Book
  • జూన్‌ మొదటి వారంలోనే వర్షాలు
  • నైరుతిలో భారీ వానలు
  • వెల్లడించిన వాతావరణశాఖ నివేదిక

హైదరాబాద్‌ : భారత వాతావరణ శాఖ రైతులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఎల్‌నినో బలహీన పడడంతో మంచి వర్షాలు పడతాయని నివేదిక విడుదల చేసింది. నైరుతీ రుతుపవన కాలంలో సాధారణం కంటే అధికంగా.. భారీగా వానలు పడతాయని రైతులకు చల్లని కబురు చెప్పింది. 2019 నైరుతి రుతుపవనాల వర్షపాతంపై ఐఎండీ అంచనాలు వెల్లడించింది. రైతులకు ఖరీఫ్‌ సీజన్‌ ఉపయోగకరంగా ఉంటుందని ఐఎండీ సీనియర్‌ అధికారి వెల్లడించారు.ఈ ఏడాది జూన్‌ మొదటి వారంలో కేరళను రుతుపవనాలు తాకనున్నట్టు వెల్లడించింది. రైతులకు ఖరీఫ్‌ సీజన్‌ ఉపయోగకరంగా ఉంటుందని, జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు సాధారణ వర్షపాతం నమోదు అవుతుందని తెలిపింది. జూన్‌ లో వర్షపాతంపై రెండో విడత అంచనాలను విడుదల చేస్తామని, దీర్ఘకాలికంగా 96 శాతం వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్‌ జనరల్‌ తెలిపారు. రుతుపవనాల ప్రభావంపై పూర్తిస్థాయి అంచనాలను మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 15 మధ్య విడుదల చేయనున్నట్లు ఇటీవలే ప్రకటించిన సంగతి తెలిసిందే. 96 నుండి 104 శాతం వర్షపాతం నమోదైతే సాధారణ వర్షపాతం లేదా సరాసరి వర్షపాతంగా పరిగణిస్తారు. దేశంపై జూన్‌ మాసం నుండి సెప్టెంబర్‌ మాసం వరకు నైరుతి రుతుపవనాల ప్రభావం ఉంటుంది. వ్యవసాయరంగం ఉత్పత్తి పూర్తిగా నైరుతి రుతుపవనాల ప్రభావంపైనే ఆధారపడి ఉంటుందనే సంగతి తెలిసిందే. మరోవైపు ఈ సంవత్సరం ఎండలు దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అధికంగా ఎండలు ఉంటుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు భూగర్భ జలాలు అడుగుంటుండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. నీరు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి. ఈసారైనా విస్తారంగా వర్షాలు కురుస్తాయని రైతులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here