బిజినెస్

బంగారం భగభగ.. 10 గ్రాములుఏ41 వేలు

బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు పసిడి ధరలు పైపైకి వెళ్తున్నాయి. దేశీ మార్కెట్‌లో బంగారం ధర ఆల్‌టైమ్‌ గరిష్టానికి చేరుకుంది. సోమవారం 10 గ్రాములకు రూ. 918 పెరుగుదలతో బంగారం ధర రూ. 41 వేలకు చేరింది. బంగారం ధర శుక్రవారం ఏకంగా రూ. 850 పెరిగిన సంగతి తెలిసిందే. ఈ రెండు రోజుల్లోనే బంగారం ధర రూ. 1800 పెరిగింది. అంతర్జాతీయ అనిశ్చితికి తోడు అమెరికా – ఇరాన్‌ మధ్య యుద్ధ మేఘాల వాతావరణం బంగారం ధరలపై పడింది. దీంతో శుక్రవారం నుంచి నేటి వరకు దేశీ మార్కెట్‌లో బంగారం ధర పరుగులు పెడుతుంది. దేశీ మార్కెట్‌లో బంగారం ధర పెరగడానికి రూపాయి కూడా దోహదపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్‌ రూపాయి సోమవారం 72 మార్క్‌ కిందకు పతనమైంది. ఇది కూడా బంగారం ధర పెరగడానికి కారణం. హైదరాబాద్‌ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 390 పెరగడంతో.. దాని ధర రూ. 38,320కు చేరింది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు రూ. 390 పెరగడంతో.. దాని ధర రూ. 41,770కి చేరింది. కిలో వెండి ధర రూ. 200 పెరుగుదలతో.. రూ. 49,600కు చేరింది. బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close