బిజినెస్

ఒక్కరోజే రూ. 1000 తగ్గిన వెండి రూ. 41వేలకు పడిపోయిన పసిడి

దిల్లీ: దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు అమాంతం పడిపోయాయి. బుధవారం ఒక్కరోజే వెండి ధర ఏకంగా రూ. 1,083 తగ్గింది. దీంతో బులియన్‌ మార్కెట్లో కేజీ ధర రూ. 46,610గా ఉంది. అటు పసిడి కూడా దిగొచ్చింది. రూ. 182 తగ్గడంతో దేశ రాజధానిలో 10 గ్రాముల పుత్తడి ధర రూ. 41,019 పలికింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పుంజుకోవడం, అంతర్జాతీయ మార్కెట్లో రాత్రికి రాత్రే పసిడి విలువ తగ్గడం ఈ లోహాల ధరలపై తీవ్ర ప్రభావం చూపించాయి. దీనికి తోడు స్థానికంగా నగల వ్యాపారులు, నాణేల తయారీ దారుల నుంచి డిమాండ్‌ లేకపోవడం కూడా ధరల తగ్గుదలకు కారణమైందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close