బిజినెస్

దిగొస్తున్న బంగారం ధర

న్యూఢిల్లీ (ఆదాబ్‌ హైదరాబాద్‌): గత మూడు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధర నేడు మరింత తగ్గింది. సోమవారం రూ.236 తగ్గడంతో పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ. 40, 432 కి చేరింది. అమెరికా-ఇరాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణగడం, రూపాయి బలపడటం వల్ల బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ నిపుణులు వెల్లడించారు. అటు అంతర్జాతీయ మార్కెట్లోను బంగారం ధర తగ్గింది. ఔన్సు బంగారం ధర 1,5 50 డాలర్లు ఉండగా, వెండి 17.97డాలర్లు పలికింది. పసిడి బాటలోనే వెండి పయనించి రూ. 48వేల మార్క్‌ దిగువకు చేరింది. రూ.376 తగ్గడంతో కిలో వెండి రూ.47,635గా ఉంది. విదే శాల నుంచి దిగుమతి చేసుకునే బంగారంపై దిగుమతి సుంకం ఎక్కువగా విధిస్తుండటం వల్ల పసి డికి గిరాక తగ్గిందని వర్తకులు వాపోతున్నారు.ఆరునెలల్లో30శాతంఅమ్మకాలుతగ్గుముఖం పట్టాయని ఆల్‌ఇండియా జెమ్స్‌అండ్‌జ్యూయలరీ డొమెస్టిక్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ అనంత పద్మనాభన్‌ తెలిపారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close