పెరిగిన బంగారం ధర

0

న్యూఢిల్లీ: పసిడి ధర జిగేల్‌మంది. దేశీ మార్కెట్‌లో సోమవారం పది గ్రాముల బంగారం ధర రూ.65 పెరుగుదలతో రూ.33,018కు చేరింది. గ్లోబల్‌

మార్కెట్‌లో బంగారం తగ్గినా కూడా దేశీయంగా ధర పెరగడానికి జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్‌ పుంజుకోవడం ప్రధాన కారణం. బంగారం ధర పెరిగితే

వెండి ధర మాత్రం పడిపోయింది. కేజీ వెండి ధర రూ.175 తగ్గుదలతో రూ.38,000కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల

నుంచి డిమాండ్‌ మందగించడం ప్రతికూల ప్రభావం చూపింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.25 శాతం తగ్గుదలతో

1,284.05 డాలర్లకు క్షీణించింది. వెండి ధర ఔన్స్‌కు 0.89 శాతం క్షీణతతో 14.65 డాలర్లకు తగ్గింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల

బంగారం ధర రూ.65 పెరుగుదలతో రూ.33,018కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.65 పెరుగుదలతో రూ.32,848కు చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ

పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.100 పెరుగుదలతో రూ.26,500కు ఎగసింది. కేజీ వెండి ధర రూ.175 తగ్గుదలతో రూ.38,000కు క్షీణిస్తే..

వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.267 పెరుగుదలతో రూ.37,290కు చేరింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే..

కొనుగోలు ధర రూ.79,000 వద్ద, అమ్మకం ధర రూ.80,000 వద్ద స్థిరంగా కొనసాగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here