బంగారం ధర పరుగు.. వెండి డౌన్‌

0

న్యూఢీల్లీ : పసిడి ధర పెరిగింది. దేశీ మార్కెట్‌లో సోమవారం పది గ్రాముల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ.32,870కు చేరింది. జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్‌ పెరగడం సహా బలమైన అంతర్జాతీయ ట్రెండ్‌ ఇందుకు కారణం. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం తగ్గింది. కేజీ వెండి ధర రూ.30 తగ్గుదలతో రూ.38,570కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌ మందగించడం ప్రతికూల ప్రభావం చూపింది. గ్లోబల్‌ మార్కెట్‌లో బంగారం ధర సోమవారం ఔన్స్‌కు 0.42 శాతం పెరుగుదలతో 1,281.35 డాలర్లకు చేరింది. వెండి ధర ఔన్స్‌కు 0.35 శాతం పెరుగుదలతో 15.00 డాలర్లకు ఎగసింది. అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు పెరగడం వల్ల క్రూడ్‌ ధరలు పైకి కదిలాయి. దీంతో ఇన్వెస్టర్లు సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనమైన బంగారం వైపు మొగ్గు చూపారు. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ.32,870కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరుగుదలతో రూ.32,700కు చేరింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 వద్ద స్థిరంగా ఉంది. కేజీ వెండి రూ.30 తగ్గుదలతో రూ.38,570కు క్షీణిస్తే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర మాత్రం రూ.297 పెరుగుదలతో రూ.37,527కు చేరింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000 వద్ద, అమ్మకం ధర రూ.81,000 వద్ద స్థిరంగా కొనసాగింది.

హైదరాబాద్‌లో10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.31,720కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.30,210కు పెరిగింది. కేజీ వెండి ధర రూ.40,500కు చేరింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here