బీజేపీలోకి వెళ్తున్నా..!

కాంగ్రెస్ మునిగిపోయే పడవ..
- రాంమాధవ్‌తో చర్చించానని వెల్లడి
- టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయే
- కుంతియా వల్లనే అవకాశాలు రాలేదని విమర్శ
- కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యం
న్యూఢిల్లీ
బిజెపిలో చేరడం ఖాయమని మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పస్టం చేశారు. ఇప్పటికే బిజెపితో సంప్రదింపులు చేశాని కూడా చెప్పారు. ఎప్పుడు చేరేది త్వరలో చెబుతానని అన్నారు. బిజెపి మాత్రమే టిఆర్ఎస్కు ప్రత్యామ్నాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అందుకే పార్టీ మారాలని అనుకుంటున్నట్టు వెల్లడించారు. భాజపా నుంచి తనకు ఆహ్వానం అందిందని, రెండుసార్లు పార్టీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌తో కూడా చర్చించానన్నారు. నూటికి నూరు శాతం తాను పార్టీ మారడం ఖాయమన్నారు. తెరాసకు భాజపానే ప్రత్యామ్నాయమని 10 రోజుల క్రితమే తాను చెప్పానని.. నేడూ అదే చెబుతున్నానని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి ఆర్సీ కుంతియా పొరపాట్ల వల్లే తెలంగాణలో రెండోసారీ అధికారం కోల్పోయామని విమర్శించారు. రాష్ట్రంలో భవిష్యత్తులో భాజపా బలపడే అవకాశం ఉందని చెప్పారు. దేశంలోని యువత బలమైన నాయకత్వాన్ని కోరుకుంటోందన్నారు. తమకు ఏవైనా ఆర్థిక ఇబ్బందులు ఉంటే తెరాస పిలిచినప్పుడే వెళ్లేవాళ్లమని చెప్పారు. స్వార్థంతో కాకుండా.. దూరదృష్టితో ఆలోచించి పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్టు రాజగోపాల్‌రెడ్డి వెల్లడించారు. బిజెపి బలోపేతానికి తనవంతుగా కృషి చేస్తానని అన్నారు. అందుకు క్షేత్రస్థాయిలో పనిచేయడానికి వెనకాడబోనని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దింపేందుకే తాను పార్టీ మారుతున్నట్టు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్కు బీజేపీనే ప్రత్యామ్నయం అని తెలిపారు. పీసీసీ చీఫ్‌గా ఎవరిని తీసుకున్నా తెలంగాణలో కాంగ్రెస్ బతికే పరిస్థితి లేదని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని ధీమా వ్యక్తం చేశారు. తన కార్యకర్తల్లో ధైర్యం నింపేందుకే సీఎం అని మాట్లాడినట్టు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. త్వరలో బీజేపీలో చేరనున్న రాజగోపాల్‌రెడ్డి మంగళవారం ఢిల్లీలో విూడియాతో మాట్లాడారు. తనను బీజేపీలోకి రావాలని కేంద్ర ¬ం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి కోరినట్టు వెల్లడించారు. ఈ విషయంపై రాం మాధవ్‌ను కలిసి చర్చలు జరిపినట్టు పేర్కొన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి వెళ్లిన టీపీసీసీ నేతలు పట్టించుకోలేదని విమర్శించారు. తనకు షోకాజ్ ఇచ్చే నైతిక అధికారం టీపీసీసీకి లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ఒక మునిగిపోయే నావ అని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం సరిగా లేదని ఆరోపించారు. టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్‌ను కొనసాగించడం వల్లనే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. బీజేపీ అధిష్టానం నిర్ణయం ప్రకారమే నడుచుకోవాలన్నారు. అవసరమైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తెలిపారు. బీజేపీలో ఎలా చేరాలనే అంశంపై సంప్రదింపులు జరుపుతున్నట్టు వెల్లడించారు. రానున్న జమిలి ఎన్నికలతో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.