Featuredజీవనశైలి

గో గ్రీన్ తో కొత్త సంవత్సరం.. కొత్త భవిష్యత్తు

ప్లాస్టిక్‌ రహిత నగరంగా మారుదాం…

  • నూతన సంవత్సరం సందర్భంగా 500 మొక్కలు పంపిన చేసిన జీఎస్‌ఎం మాల్‌ మేనేజర్‌ రఘునాథ్‌

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ను ప్లాస్టిక్‌ రహితంగా మార్చి, కాలుష్య భూతాన్ని తరమికొట్టాలని జీఎస్‌ఎం మాల్‌ మేనేజర్‌ రఘునాథ్‌ పేర్కొన్నారు. కాలుష్యానికి కారణమవుతోన్న ప్లాస్టిక్‌ను నిషేదించి చెట్లను నాటాలని రఘునాథ్‌ పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం 2020 సందర్భంగా 500 మొక్కలను కస్టమర్లకు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ కవర్లపై సంపూర్ణ నిషేధం విధించాలని సూచించారు. మన హైదరాబాద్‌ నగరంలో రోజూ 400 నుంచి 500 మెట్రిక్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు వస్తాయని, వీటితోపాటు మరో 100 నుంచి 150 టన్నులు అదనంగా చెరువులు, నాలాల్లో పడేస్తున్నారు. అలా పాస్టిక్‌ను పడేయడంతో కాలుష్యం పెరిగి మన భవిష్యత్తుకు ముప్పు వాటిలితుందని, అలా జరగకుండా ఉండాలంటే మనం చెట్లను పెంచాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్‌ కాలుష్యం జీవజాతుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. దేశంలోని పంపునీటిలో 72 శాతం ప్లాస్టిక్‌ రేణువులు ఉన్నట్లు తేలింది. ఒక వ్యక్తి సంవత్సరానికి 3 వేల నుండి 4 వేల సూక్ష్మప్లాస్టిక్‌ కణాలను లేదా 250 గ్రాముల బరువు గల ప్లాస్టిక్‌ను తీసుకుంటున్నారని తేలింది. ఈ కాలుష్యం నీటి వనరుల్లో చేరి చేపల ద్వారా మన ఆహారంలోకి ప్రవేశిస్తుంది. ప్లాస్టిక్‌ వల్ల మురికి చేరి దోమలు పెరుగుతున్నాయి. రోడ్లపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతుంది. మన శరీరంలో హార్మోన్‌ వ్యవస్థ దెబ్బతింటోంది. ఎండోక్రైన్‌ వ్యాధులు వస్తున్నాయి. వ్యంధత్వానికి దారితీస్తోంది. 2019లో ప్లాస్టిక్‌, పర్యావరణ నివేదిక ప్రకారం ప్లాస్టిక్‌ కాలుష్యం వల్ల 850 మిలియన్‌ టన్నుల కార్బన్‌ డై ఆక్సైడ్‌కు సమానమైన గ్రీన్‌ హౌజ్‌ వాయువుల ఉద్గారం జరిగింది.

అనంతరం డిజిటల్‌ కనెక్ట్‌ సీఈవో నికిల్‌ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ వ్యర్థాలు పర్యావరణానికి, మానవాళికి పెద్ద ముప్పుగా మారాయి. భూమి, గాలి, నీరు, ఆహారం.. ఇలా అన్ని కలుషితమవుతున్నాయి. ప్లాస్టిక్‌ తయారీ దశ నుండి సముద్రాలను చేరే దశవరకు కణాలుగా గాలిలో కలుస్తోంది. విష రసాయనాలను విడుదల చేస్తోంది. దీంతో పర్యావరణం కాలుష్యం అవుతోంది. ప్లాస్టిక్‌ పదార్థాలు చిన్న, మధ్యతరహా, 5.5 ట్రిలియన్‌ ప్లాస్టిక్‌ ముక్కలు సముద్రాలపై తేలియాడుతున్నాయి. ప్రతి ఏటా 8.8 మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలు సముద్రాల్లోకి చేరుతున్నాయి. 1950 నుండి 2018 వరకు ప్రపంచంలో 6.3 బిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ ఉత్పత్తి కాగా ఇందులో 9శాతం రీసైకిల్‌ అయ్యింది. 12 శాతం మండించారు. మన దేశంలో 2017-18లో 5వేల 500 టన్నుల ప్లాస్టిక్‌ను రీసైకిల్‌ చేశారు. ఇది మొత్తం ఉత్పత్తిలో 60 శాతం. 2022 నాటికి ఆరు రకాల సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్స్‌ను పూర్తిగా నిషేధించాలని కేంద్ర ప్రభుత్వ ఆలోచన. స్పూన్లు, కప్పులు, స్ట్రాలు, బాటిల్స్‌, క్యారీ బ్యాగులు.. దేశంలోని మొత్తం ప్లాస్టిక్‌ వ్యర్థాలలో 50శాతం వీటి వల్లే జరుగుతోంది. కాబట్టి మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడండి అని సూచించారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close