గుబాళించిన గులాబీ

0

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయభేరి

  • చిన్నపరెడ్డి, శ్రీనివాస్‌ రెడ్డి, మహేందర్‌ రెడ్డిల విజయం
  • పోటీ ఇవ్వలేకపోయిన కాంగ్రెస్‌
  • గెలుపుపై కేసీఆర్‌, కేటీఆర్‌ హర్షం

హైదరాబాద్‌ :

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం మూడు సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఎన్నికల ఫలితాలు టిఆర్‌ఎస్‌కు అనుకూలంగా వచ్చాయి. మూడుచోట్ల టిఆర్‌ఎస్‌ అభ్యర్థులు గనవిజయం పాధించారు. మొత్తానికి స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రభంజనం సృష్టించింది. మూడుకు మూడు ఎమ్మెల్సీ సీట్లు గెలిచి టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేసింది. నల్గొండ, వరంగల్‌, రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు విజయం సాధించారు. నల్గొండ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిన్నపరెడ్డి, వరంగల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌ రెడ్డి, రంగారెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహేందర్‌ రెడ్డి విజయం సాధించారు. వరంగల్‌, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాస ఘన విజయం సాధించి తన పట్టునునిలుపుకుంది. ఈ మూడు స్థానాలకు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టారు. వరంగల్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై 825 ఓట్ల ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. నల్గొండలో కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మిపై తెరాస అభ్యర్థి చిన్నపరెడ్డి 226 ఓట్ల తేడాతో గెలుపొందారు. రంగారెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి.. కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రతాప్‌రెడ్డిపై 244 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ ఎన్నికలకు ముందు స్థానిక ప్రజాప్రతినిధులను క్యాంపులకు తరలించారు. వారు నేరుగా పోలింగ్‌ కేంద్రాలకు చేరుకుని ఓటేశారు. దీంతో ఎక్కడా క్రాస్‌ ఓటింగ్‌కు అవకాశం రాలేదు. నల్గొండ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డికి 640 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌ అభ్యర్థికి 414 ఓట్లు పోలయ్యాయి. 19 ఓట్లు చెల్లలేదు. దీంతో 226 ఓట్ల మెజార్టీతో చిన్నపరెడ్డి విజయం సాధించారు.

వరంగల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డికి 848 ఓట్లు పోలవగా.. కాంగ్రెస్‌ అభ్యర్థికి 23 ఓట్లు పోలయ్యాయి. దీంతో కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై 825 ఓట్ల ఆధిక్యంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి ఘన విజయం సాధించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న 806 ఓట్లకు గాను.. 797 ఓట్లు పోలయ్యాయి. వీటిలో 21 ఓట్లు చెల్లుబాటు కాలేదు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం మహేందర్‌ రెడ్డికి 510 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి ప్రతాప్‌ రెడ్డికి 266 ఓట్లు వచ్చాయి. దీంతో మహేందర్‌ రెడ్డి 244 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను సీఎం కేసీఆర్‌ అభినందించారు. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఏకపక్ష విజయాన్ని అందించిన స్థానిక సంస్థల ప్రతినిధులకు సీఎం కేసీఆర్‌ కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ అభ్యర్థులకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అభినందనలు తెలిపారు. అభ్యర్థుల విజయానికి కృషి చేసిన జిల్లా నేతలకు కృతజ్ఞతలు చెప్పారు.

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్గొండ జిల్లా నుంచి టీఆర్‌ఎస్‌ తరుపున పోటీ చేసిన తేరా చిన్నపరెడ్డి ఘన విజయం సాధించడంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. టీఆర్‌ఎస్‌ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. హాలియా, నిడమనూరులో టీఆర్‌ఎస్‌ శ్రేణులు టపాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. చింతపల్లి మండలంలో టీఆర్‌ఎస్‌ నాయకులు ర్యాలీ నిర్వహించి కేక్‌ కట్‌ చేశారు. చిట్యాలలో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు స్వీట్లు పంచారు.

ఎమ్మెల్సీలకు సీఎం కేసీఆర్‌ అభినందనలు

స్థానిక సంస్థల కోటాలో గెలిచిన ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందనలు తెలిపారు. స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన మహేందర్‌రెడ్డి, తేరా చిన్నపరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డిని ఆయన అభినందించారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు ఏకపక్ష విజయాన్ని అందించిన స్థానిక సంస్థల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల విజయానికి కృషి చేసిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులకు సీఎం కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హవా కొనసాగింది. నల్గొండ, వరంగల్‌, రంగారెడ్డి ఎమ్మెల్సీ స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. నల్గొండ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చిన్నపరెడ్డి, వరంగల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌ రెడ్డి, రంగారెడ్డి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహేందర్‌ రెడ్డి గెలుపొందారు. మహేందర్‌ రెడ్డి తన ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి కొమ్మూరి ప్రతాపరెడ్డిపై గెలుపొందారు. నల్లొండ ఎమ్మెల్సీగా తేరా చిన్నపరెడ్డి 850 ఓట్లతో తన ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మీపై విజయం సాధించారు. వరంగల్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌ రెడ్డి 825 ఓట్ల మెజారిటీతో తన ప్రత్యర్థి కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై ఘన విజయం సాధించారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here