Featuredస్టేట్ న్యూస్

జనవరి నెలాఖరు నాటికి గజ్వేల్‌కు కాళేశ్వరం

పర్యాటక కేంద్రంగా మల్లన్న సాగర్‌ అభివృద్ధి

గజ్వేల్‌ అడవులను అభివృద్ధి చేసి చూపాం

అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్‌ ఇళ్లు

ప్రతి ఇంటికి పని కల్పించేలా చర్యలు

గజ్వేల్‌ నుంచే ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రారంభం

గ్రామసర్పంచులంతా కథానాయకులు కావాలి

మహతి ఆడిటోరియం నుంచి కేసీఆర్‌ ప్రసంగం

గజ్వేల్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): గజ్వేల్‌ నియోజకవర్గానికి వచ్చే ఏడాది జనవరి నెలఖారు నాటికి కాళేశ్వరం నీళ్లు వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. మల్లన్నసాగర్‌ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ప్రతీ చెరువు, కుంట నిండి పంటలు పండినప్పుడే నిజమైన సంతోషం వస్తుందని సీఎం తెలిపారు. దేశమే ఆశ్చర్యపోయే విధంగా గజ్వేల్‌లో అడవులను పునరుద్ధరిస్తున్నామన్నారు. గజ్వేల్‌ను పచ్చగా చేయాలను కున్నామని, అందుకు తగ్గట్లుగా చేసి చూపించామని అన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో 30 వేల ఎకరాల్లో అడవి విస్తరించిందన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో

ఏర్పాటు చేసిన మహతి ఆడిటోరియాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ ఆడిటోరియంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖులతో సీఎం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామన్నారు. ఇల్లు లేనివారు ఉండకూడదన్నదే తన ప్రయత్నమని అన్నారు. ఎన్నికలప్పుడు ఎవరు ఏ పార్టీకి ఓటేసినా.. ఇప్పుడు అందరూ మనవాళ్లే. నియోజకవర్గాలను ఆదర్శంగా తీర్చిదిద్దాలనే సంకల్పం ఉంది. ఆదర్శం ఉంటే అధికారులు పని చేయడానికి సిద్ధంగా ఉన్నారని సీఎం స్పష్టం చేశారు. గజ్వేల్‌లో ప్రతీ మనిషికి చేతినిండా పని ఉండాలి. ప్రతీ ఇల్లు పాడి పరిశ్రమలో కళకళలాడాలి. నియోజకవర్గంలో ప్రతి పేద కుటుంబానికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తాం. దేశాన్ని, రాష్టాన్న్రి ఆర్థికమాంద్యం పట్టిపీడిస్తోంది. ప్రజాజీవితంలో ఉన్న వ్యక్తి ఎప్పుడూ విశ్రమించకూడదు. ఏ గ్రామంలో ఏముంది.. ఏం కావాలి అనే విషయంపై అవగాహన రావాలి. ఏ ఊరి సర్పంచ్‌ ఆ ఊరికి కథానాయకుడు కావాలి. ప్రజల మధ్య ఉండే ఏ రాజకీయ నాయకుడూ రిలాక్స్‌ కావొద్దు. ఇతరులు గజ్వేల్‌ను చూసి నేర్చుకోవాలి. ఏ గ్రామంలో ఏ పని లేకుండా ఉన్నవాల్ళెవరు.. వాళ్లకేం పనివ్వాలో ఆలోచించాలి అని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ప్రతి ఇంటికి పాడి పశువులు ఇచ్చి ప్రతి ఇళ్లు కళకళలాడాలని సీఎం అన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో ఉండే వాళ్లందరికీ ఇళ్లు ఉండాలని అన్నారు. ప్రజలు అధికారులు, కలెక్టర్ల సేవలు వినియోగించుకోవాలని అన్నారు. గజ్వేల్‌ ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని సీఎం అన్నారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక పని ఉండాలని పని లేకుండా ఉన్నవాళ్లకు పని పుట్టించాలని కేసీఆర్‌ అన్నారు. పైరవీలు లేకుండా, పార్టీలు లేకుండా ఇళ్లు లేని వారికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని సమస్యలపై చర్చిద్దామని కేసీఆర్‌ అన్నారు.గజ్వెల్‌ నుంచే హెల్త్‌ ప్రొఫైల్‌ ప్రతి మనిషికి హెల్త్‌ కార్డ్‌ ఉండేలా గజ్వేల్‌ నియోజకవర్గం నుండే హెల్త్‌ కార్డ్‌ లను ప్రారంభించేలా చర్యలు తీసుకోబోతున్నామని సీఎం కెసిఆర్‌ అన్నారు. త్వరలో ఒకరోజంతా మీతోనే ఉంటానని సీఎం కేసీఆర్‌ అన్నారు. కరెంట్‌ బాధలు ఇక లేవని అన్నారు. 7,500 ఎకరాల అటవీ భూమిని వనమూలికల పార్క్‌ గా అభివృద్ధి చేస్తామని కేసీఆర్‌ అన్నారు. సీఎం కేసీఆర్‌ పలు అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. సిద్ధిపేట జిల్లా ములుగులో అటవీ కళాశాల, పరిశోధన కేంద్రాన్ని కేసీఆర్‌ ప్రారంభించారు. సీఎం కేసీఆర్‌ విద్యార్థులతో మాట్లాడారు. కళాశాల భవనాలను 175 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. కంటి వెలుగు పథకం మాదిరే రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారు చేయాలనేది తన కోరిక అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు.అభివృద్ధి చెందిన దేశాల్లో హెల్త్‌ ప్రొఫైల్‌ ఉంటుంది.

హెల్త్‌ ప్రొఫైల్‌ పక్రియను గజ్వేల్‌ నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కోరుతున్నాను అని సీఎం తెలిపారు. ఇది ప్రజలందరికీ చాలా ఉపయోగంగా ఉంటుంది. ప్రజల వైద్య పరీక్షలకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలి. గజ్వేల్‌ నియోజకవర్గ ఆరోగ్య సూచిక వెంటనే రూపొందించాలి. ప్రతి కుటుంబ పరిస్థితికి అనుగుణంగా ప్రణాళికలు తయారు చేయాలి. దేశానికి ఆదర్శంగా గజ్వేల్‌ను తీర్చిదిద్దాలి. త్వరలోనే గజ్వేల్‌ నియోజకవర్గం ప్రజాప్రతినిధులతో సమావేశం ఉంటుంది. గజ్వేల్‌ అభివృద్ధి ప్రణాళిక తయారు చేసుకుందాం అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు.

మహతి అనే పేరు నేనే పెట్టాను

తెలంగాణ సాహితీ సౌరభం ఈ మహతి ఆడిటోరియం. మహతి ఆడిటోరియం నుంచి నలు దిశలా వెలుగులు ప్రసారించాలని తన కోరిక. ఈ హాల్‌కు మహతి అనే పేరు తానే పెట్టాను అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. సంగీతంలో ఆరితేరిన వారు నారదుడు, తుంబురుడు. నారద మహర్షి వాయించే వీణ పేరు మహతి. జిల్లా కేంద్రాల్లో ఇలాంటి హాళ్లు నిర్మించేందుకు కృషి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్‌ రావు, ఈటెల రాజేందర్‌, ఇంద్రకరణ్‌ రెడ్డి,నిరంజన్‌ రెడ్డి, శ్రీనివాస గౌడ్‌, ఎంపి కొత్త ప్రభాకర్‌ రెడ్డి, ఎమ్మెల్యేలు రామలింగారెడ్డి,రసమయి బాలకిషన్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close