Featuredస్టేట్ న్యూస్

కేసీఆర్‌ భజనకు గద్దర్‌ ‘నో’

  • కళా ‘దరఖాస్తు’ తిరస్కరణ
  • ఎర్ర పార్టీలకు ఏమైంది..?
  • ‘తూటా’పై సిపిఐ ‘సారీ’
  • భూదందాలో సిపిఎం
  • అడవుల్లో ‘మావో’ లొల్లి

(అనంచిన్ని వెంకటేశ్వరరావు, ఆదాబ్‌ హైదరాబాద్‌)

ఎవరి సిద్దాంతం వారిదే. కొందరు పెన్‌.. మరికొందరు తటస్థం. ఇంకొందరు ‘గాలిపటం లాంటి గద్దర్‌’ పాటలతో..వెలుగు లేని కాగాడా పట్టుకొని.. భుజాన ‘గన్‌’ వేసుకొని గమ్యం తెలియని అడవుల్లో పరుగెడుతూనే ఉన్నారు. ఉన్నారు. కాలచక్రం గిర్రున తిరిగింది. అడ్రస్‌ లేని పార్టీలు అధికారంలోకి వచ్చాయి. లక్షలాది మంది ప్రాణాలను ‘గమ్యం’ తెలియని తీరాలకు తాకట్టు పెట్టి… అర్థంకాని ‘బూర్జువా’ పార్టీలతో బలవంతంగా ‘వాటేసుకుని’ కేసీఆర్‌ భజనకు ‘గద్దర్‌’ ఈ వయస్సులో ఎలాంటి ‘సిగ్గు పడకుండా’ నెలకు ఓ పాతికవేలకే.. తనకు తెలియకుండా ఎగబాతున్నానని అనుకొని దిగజారాడు. లక్షలాది మందిని ఉత్తేజ పరిచి, వేలాది మరణాలకు కారణమైన ఈ ‘ప్రజా యుద్ధనౌక’ ఓ ప్లాప్‌. ఎర్రపార్టీల భవిష్యత్‌ ఏమిటి..? ఏ సమస్యపైన అయినా ‘ఎర్రజెండా’ కార్యకర్తలు ‘రక్తం’ చిందించడానికి ఎప్పుడూ సంసిద్దమే. సందేహం అవసలం లేదు. అందుకు రక్తపరీక్షలు అవసరం లేని వేలాది యువత ‘క్యూ’లో ఉంటుంది. కమ్యునిజం భుజాన వేసుకుని మోసే నాయకులకే ఓ విధమైన గందరగోళంలో స్పష్టత కొరవడింది. అందుకే తమ పార్టీ ‘బూజు’ పట్టిన సిద్దాంతాలకు వ్యతిరేకంగా (పైకి చెప్పడానికి ఇష్టపడటం లేదు కానీ… వారి మనసులకు అంగీకారమే..!) ముందు ప్రకటనలు ఆ తర్వాత ‘సారీ’లు. స్వాతంత్య్ర పోరాటం అనంతరం ఎర్రపార్టీలు చీలికపేలికలు అయ్యాయి. ‘ఆదాబ్‌ హైదరాబాద్‌’ అందిస్తున్న విశ్లేషణ కథనం

కేసీఆర్‌ భజన సిద్దమైన గద్దర్‌:

ప్రజాగాయకుడు గద్దర్‌. ఆయన గళమెత్తితే.. రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఎక్కడ ఏ ప్రజాఉద్యమం జరిగినా గద్దర్‌ ముందుంటారు. తనదైన శైలిలో పాటలతో ఉత్తేజపరిచారు. ఇంకా పరుస్తున్నారు. ఆయన పాట ఎన్నో ఉద్యమాలకు ‘పోరుబాట’ చూపింది. మరెన్నో పోరాటాలకు ఊపిరిపోసింది. ఏ ఉద్యమం జరిగినా ఆయన ముందు వరుసలో ఉండేవారు. ఉన్నొరు. ఉంటారు. అలాంటి గళం ఇప్పుడు ప్రభుత్వానికి వంత పాడుతానంటోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పై దుమ్మెత్తిపోసిన ఆ గొంతుక… ఇప్పుడు సర్కారీ స్కీములకు సలాం కొడతానంటూ… దరఖాస్తు చేసుకుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పునకు అనుగుణంగా ప్రభుత్వం ఇప్పుడు కళాకారుల నియమకాలు చేపట్టింది. ఆశ్చర్యకరంగా గద్దర్‌ దరఖాస్తు చేసుకున్నారు.

నిజమే..:

ఇటీవలే సాంస్కృతిక సారథిలో కళాకారుల నియామకాలకు ఆన్‌ లైన్‌ లో దరఖాస్తులు స్వీకరించింది. ఈ ఉద్యోగానికి అప్లికేషన్‌ పెట్టుకున్నది నిజమేనని కళాకారుడిగా తాత్కాలిక ఉద్యోగం అడిగినట్లు గద్దర్‌ తెలిపారు. ‘దాదాపు అయిదు వేల మంది కళాకారులు దరఖాస్తు చేసుకున్నారు.

బతకాడినికే ‘నట’..! గద్దర్‌ వింత సమర్థన:

దరఖాస్తు చేసుకోవటంలో తప్పేముంది? నా వృత్తి పాడటమే. నాకు పాడటం వచ్చు. నేను బతకాలి కదా. అందుకే అప్లికేషన్‌ పెట్టుకున్న. ఉద్యోగమడిగా. నేనేం లీడర్షిప్‌ అడగలే. అందరు కళాకారులతో కలిసి రోజుకు ఎనిమిది గంటలు తిరుగుతాను. డబుల్‌ బెడ్రూం ఇళ్లు.. మూడెకరాల భూమి.. ఆ స్కిట్లు నేను కూడా చేస్తాను’ అని గద్దర్‌ మీడియాకు తెలిపారు. గత ముప్పై ఐదేళ్ల క్రితం ‘మాభూమి’ సినిమాలో ‘బండెనెక బండి కట్టి.. పదహారు బండ్లు కట్టి…ఏ బండ్లో వస్తొవో నైజాం సర్కరోడా..’ అంటూ పాడిన గొంతుక సివరికి అదే సాగిలపడటం ఆయన అభిమానులకు నచ్చడం లేదు.

దేబిరించినా.. దేఖలేదు..::

ప్రచారం నిర్వహించేందుకు నిర్దేశించిన కళాకారుని ఉద్యోగం కోసం గద్దర్‌ దరఖాస్తు చేసుకున్నారు. తన పేరు గద్దర్‌ అని, తాను గాయపడ్డ ప్రజల పాటనని, చిన్నప్పటి నుంచే పాటలు పాడుతున్నానని, రాయడం, పాడడం, ఆడడం తన వృత్తి అని, తన వద్ద ఎటువంటి సర్టిఫికెట్లు కూడా లేవని, కళాకారునిగా తనను నియమించాలని గద్దర్‌ క్లుప్తంగా దరఖాస్తు చేశారు. వాస్తవానికి ఈ ఉద్యోగ నియామకానికి సంబంధించి ప్రభుత్వం నిబంధనలను కూడా రూపొందించింది. ఏ ప్రాతిపదిన చూసినా గద్దర్‌ టీఎస్‌ఎస్‌ నిబంధనల పరిధిలోకి వచ్చే అవకాశమే లేదని నియామకపు కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం. ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేయాల్సి ఉండగా, టీఎస్‌ఎస్‌ కో-ఆర్డినటర్‌ శివకుమార్‌ ను అడ్రస్‌ చేస్తూ గద్దర్‌ దరఖాస్తు చేసిన సంగతి తెలిసిందే. అయితే గద్దర్‌ దరఖాస్తును ఆసాంతం పరిశీలించిన కమిటీ కళాకారుని ఉద్యోగానికి గద్దర్‌ అర్హతలు (ముఖ్యంగా వయస్సు) సరిపోవని తేల్చినట్లు తెలిసింది. అయితే అధికారికంగా మాత్రం కమిటీ ఈ విషయాన్ని వెల్లడించకపోవడం గమనార్హం. కానీ తెలంగాణా ప్రభుత్వం ప్రతి కళాకారున్ని గౌరవిస్తుందని, ఈ దరఖాస్తును గద్దర్‌ నేరుగా ప్రభుత్వానికే చేసుకుంటే ఏదేని నామినేటెడ్‌ పదవి వచ్చే అవకాశముండేదని కమిటీ అభిప్రాయపడినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అంతేకాదు గద్దర్‌ దరఖాస్తును టీఎస్‌ఎస్‌ కమిటీ ప్రభుత్వానికి పంపించినట్లు కూడా తెలిసింది. గద్దర్‌ ఉద్యోగ వ్యవహారాన్ని తేల్చవలసింది ఇక సీఎం కేసీఆర్‌ మాత్రమేనని కమిటీ అభిప్రాయపడినట్లు సమాచారం.

చెంపలేసుకోవడం నారాయణకు పరిపాటి:

సంచలనం రేపిన ‘దిశ’ హత్యాచారం నిందితుల ఎన్‌ కౌంటర్‌ పై తాను చేసిన వ్యాఖ్యలపట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ విచారం వ్యక్తం చేశారు. పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో నారాయణ వ్యాఖ్యలను పలువురు సభ్యులు తప్పుబట్టడంతో పార్టీకి, ప్రజలకు నారాయణ బహిరంగ క్షమాపణలు చెప్పారు. పార్టీ విధానాలకు భిన్నంగా తన వ్యాఖ్యలు ఉండటంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇది ఈయనకు కొత్త కాదు. 2003లో ‘విజయవిహారం’ మాసపత్రికలో ఇదే రచయిత ‘ఎమ్మెల్యేల భూకబ్జా’ అంటూ వరుస పరిశోధన కథనాలు అందించారు. దాన్నో ఉమ్మడి రాష్ట్రకార్యదర్శి ¬దాలో ఖండించారు. ఆ తర్వాత ఆ పత్రిక దుమ్ము దులిపి ఆరేసింది. దిక్కుతోచక మిన్నకున్నారు. అలాగే గాంధీ జయంతి సందర్భంగా తన కిష్టమైన ‘కోడి మాసం’ తిని.. మీడియాకు దొరికి ‘ఇక జీవితంలో మాంసం తినను’ అని చెప్పారు. బ్యాలెట్‌ ముందు బుల్లెట్‌ దోగదుడుపే. ఈ విషయం అర్థం కావడానికి ‘గద్దర్‌’ ఓ జీవితకాలం పట్టింది.

భూ దందాలో సిపిఎం, ఆడవిలో ’18వ వార్షికోత్సవం’ పేరిట ఏర్పాటు చేసిన మావోయిస్టులు చివరకు మమ అనిపించుకున్నారు.

కొసమెరుపు:

40 ఏళ్ళ క్రితం పార్లమెంట్‌ లో ఉనికి లేని భాజపా నేడు రెండోసారి సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close