స్పీడెక్కిన ఫెడరల్‌ ఫ్రంట్‌ చర్చలు..

0

హైదరాబాద్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌):

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు టీఆర్‌ఎస్‌కు ఫుల్‌ జోష్‌ ఇచ్చింది. ఇదే ఉత్సాహంతో పార్లమెంట్‌ ఎన్నికలకు సిద్ధమవుతోంది. పార్టీ బాధ్యతల్ని కేటీఆర్‌కు అప్పగించిన గులాబీ బాస్‌ .. జాతీయ రాజకీయా లపై ఫోకస్‌ పెడుతున్నారు. ఢిల్లీలో బీజేపీ, కాంగ్రె సేతర కూటమి లక్ష్యంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం రెండో రౌండ్‌ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఫ్రంట్‌ చర్చల్లో భాగంగా ఆదివారం ( డిసెంబర్‌ 23)న కేసీఆర్‌ భువనేశ్వర్‌ వెళ్తారు. అక్కడ సాయంత్రం 6 గంటలకు ఒడిశా సీఎం, బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌ను కలిసి.. ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై చర్చిస్తారు. కూటమిలో చేరికపై నవీన్‌ పట్నాయక్‌తో ప్రత్యేకంగా మంతనాలు జరుపుతారు. మరునాడు ఢిల్లీ వెళ్ళి అక్కడ జాతీయ పార్టీల నేతలు కొందర్ని కలవబోతున్నారు. పనిలో పనిగా ప్రధాని మోదీతో కూడా భేటీ అవుతారు. ఒడిశాకు వెళ్లబోయే ముందు.. కేసీఆర్‌ విశాఖలోని శారదా పీఠాన్ని సందర్శించి.. స్వామి స్వరూపానం దేంద్ర సరస్వతి ఆశీర్వాదం తీసుకుంటారు.

ఫ్రంట్‌ కేసీఆర్‌ స్టంట్‌:బాబు

అమరావతి: తనకు రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తానన్న కేసీఆర్‌ ఏపీకి వస్తే సంతోషమేనని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. దేశ ప్రజలను గందరగోళపర్చేందుకు గాను ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు పేరుతో కేసీఆర్‌ టూర్‌ చేయనున్నారని ఆయన విమర్శించారు. శుక్రవారం నాడు అమరావతిలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశంలో రానన్న రోజుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నేతలతో చర్చించారు. కొన్ని రాజకీయపార్టీలు కలిసి ఆడుతున్న గేమ్‌ గురించి ప్రజలకు వివరించాలని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు వివరించారు. ఏపీలోని వైసీపీ, జనసేనతో పాటు కేసీఆర్‌, అసద్‌లపై బాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో తాను ప్రచారం నిర్వహించినందున తనకు కేసీఆర్‌ రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తారని చేసిన వ్యాఖ్యలను బాబు గుర్తు చేశారు. కేసీఆర్‌ ఏపీకి వస్తే సంతోషమేనని ఆయన చెప్పారు. ఏ పార్టీ ఏ పార్టీతో కుమ్మక్కయ్యాయో ప్రజలకు అర్ధమయ్యేలా వివరించాలని బాబు తెలిపారు. దేశంలో ప్రజలను గందరగోళపర్చేందుకు కేసీఆర్‌ పర్యటిస్తున్నారని బాబు ఆరోపించారు. బీజేపీకి అనుకూలమైన ఫ్రంట్‌లు కూడ దేశంలో ఏర్పడే అవకాశం ఉందన్నారు. పరోక్షంగా కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ పై బాబు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఈవీఏంలపై ప్రజల్లో నమ్మకం పోయిందన్నారు. పోలైన ఓట్ల కంటే కౌంటింగ్‌ సందర్భంగా ఓట్లు ఎలా పెరిగాయని బాబు ప్రశ్నించారు. తెలంగాణ ఎన్నికల్లో ఈ తరహా ఘటనలు చోటు చేసుకొన్నాయని బాబు అభిప్రాయపడ్డారు. తాము ఎవరికీ ఓటు వేశామో తెలుసుకొనే హక్కు అందరికీ ఉంటుందన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here