Featuredజాతీయ వార్తలుప్రాంతీయ వార్తలురాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

మున్సిపల్‌ ఎన్నికలకు సిద్ధం కండి

ప్రజలంతా కేసీఆర్‌ వెన్నంటి ఉన్నారు

  • పార్టీ సభ్యత్వ నమోదు అమోఘం
  • త్వరలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు
  • పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ దిశానిర్దేశం

హైదరాబాద్‌,ఆగస్ట్‌28(ఆర్‌ఎన్‌ఎ): ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్‌ దిశానిర్దేశం చేశారు. మున్సిపాలిటీల వారీగా టీఆర్‌ఎస్‌, ఇతర పార్టీల బలాబలాలపై ఆరా తీశారు. ఈ నెల 31లోపు బూత్‌, డివిజన్‌, గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్దేశిరచారు. కమిటీల ఏర్పాటు తర్వాత శిక్షణ తరగతులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయాల నిర్మాణాల పర్యవేక్షణకు నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఎంపీ సంతోష్‌ కుమార్‌, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌ రెడ్డి, పల్లారాజేశ్వర్‌ రెడ్డి, శ్రవణ్‌ కుమార్‌ రెడ్డితో కమిటీ ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సమావేశమయ్యారు. సుమారు 5 గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశం కొనసాగింది. మున్సిపల్‌ ఎన్నికలు, పార్టీ సంస్థాగత నిర్మాణంపై చర్చించారు. ఒక్కో మున్సిపాలిటీ వారీగా సవిూక్ష నిర్వహించారు. మొత్తం 141 మున్సిపాల్టీలపై సవిూక్ష నిర్వహించారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా పార్టీ ఇంచార్జిలను ప్రకటించారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల్లోని పురపాలక ఎన్నికలను పార్టీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఇంఛార్జిలు సమన్వయం చేయనున్నారు. ఈ సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ..మున్సిపల్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘనవిజయం సాధిస్తుందని స్పష్టం చేశారు. పురపాలక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొంటామని, ఎన్నికలకు పార్టీ పరమైన కసరత్తు ప్రారంభించినమని కేటీఆర్‌ అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా అన్ని మున్సిపాలిటీల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి గొప్ప స్పందన లభించిందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో టీఆర్‌ఎస్‌ సభ్యత్వాన్ని లక్షల మంది స్వచ్ఛందంగా తీసుకున్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌ విజయం ఏకపక్షమేనని ఈ సందర్భంగా కేటీఆర్‌ ధీమావ్యక్తం చేశారు. పార్టీ సభ్యత్వ నమోదు జరిగిన తీరుపై టిఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ రామారావు సంతృప్టిని వ్యక్తం చేశారు. టిఆర్‌ఎస్‌ తిరుగులేని పార్టీ అన్నారు. కెసిఆర్‌ పట్ల ప్రజల్లో అచంచలమైన వివ్వాసం ఉందనడానికి పార్టీ సభ్యత్వ నమోదు కూడా కారణమన్నారు. ప్రజలు అభివృద్దిని కోరుకుంటున్నారని, అందుకే ప్రతి ఎన్నికల్లోనూ గులాబీ బాస్‌ వెంట నడుస్తున్నారని అన్నారు. తెలంగాణ భవన్‌ లో పార్టీ ప్రధాన కార్యదర్శులతో కెటిఆర్‌ సమావేశమయ్యారు. త్వరలో నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తెలిపారు. పార్టీ కార్యాలయాల పురోగతిపై కేటీఆర్‌ సవిూక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో కమిటీల ఏర్పాటుపై దృష్టి సారించాలన్నారు.ఇప్పటికే కమిటీల ఏర్పాటు దాదాపు పూర్తయిందని ప్రధాన కార్యదర్శులు తెలిపారు. ఈ నెల 31 నాటికి అన్ని కమిటీలను ఏర్పాటు చేసి సెప్టెంబర్‌ 1వ తేదీ నాటికి పూర్తిస్థాయి నివేదిక పార్టీకి ఇవ్వాలని కేటీఆర్‌ కోరారు. పార్టీ సభ్యత్వ నమోదు తోపాటు కమిటీల నిర్మాణం పూర్తయిన నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా నియోజకవర్గ స్థాయి సమావేశాలను ఏర్పాటు చేసుకోవాలని, ఈ మేరకు ఆయా సమావేశాల తేదీలను సైతం పార్టీకి అందజేయాలని తెలిపారు. ఈనెల 31 నాటికి అన్ని కమిటీలను ఏర్పాటు చేసి సెప్టెంబర్‌ 1 నాటికి పూర్తిస్థాయి నివేదిక ఇవ్వాలని సూచించారు. త్వరలోనే నియోజకవర్గ స్థాయి సమావేశాలు నిర్వహిస్తామని చెప్పారు. అదేవిధంగా జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణ పనుల పురోగతిపై కేటీఆర్‌ సవిూక్ష జరిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close