నష్టమైనా.. కష్టమైనా తెలంగాణ ఇచ్చా

0

మేడ్చల్‌ (ఆదాబ్‌ హైదరాబాద్‌): రాజకీయంగా నష్టపోతామని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చామని యూపీఏ ఛైర్పర్సన్‌ సోనియా గాంధీ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ”తెలంగాణ ప్రజలందరికీ నా నమస్కారాలు. అందరికీ కార్తీక పూర్ణిమ, గురు నానక్‌ జయంతి శుభాకాంక్షలు. ఇవాళ ఒక తల్లి సంవత్సరాల తర్వాత సొంతబిడ్డల దగ్గరకు వచ్చిన తర్వాత ఎంత సంతోష పడుతుందో నేను అలాంటి సంతోషాన్ని అనుభవిస్తున్నా. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు కష్టతరమైన సమస్య అనిపించింది. అప్పుడు ఆంధ్రా, తెలంగాణ ప్రజల బాగోగులు రెండూ నా కళ్ల ముందు ఉన్నాయి. అంత పెద్ద సమస్య అయినప్పటికీ తెలంగాణ ప్రజల ఆంకాక్షల, స్ఫూర్తి గుర్తించి వారి కలను సాకారం చేశాం. ఈ నిర్ణయం వల్ల రాజకీయంగా మాకు నష్టం జరిగింది. అయినా తెలంగాణ ప్రజల జీవితాలు బాగుపడాలని ఈ నిర్ణయం తీసుకున్నాం”

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ఆంధ్రాకు ప్రత్యేక ¬దా ఇస్తాం!

”ఆంధ్రా ప్రజల జీవితాలు బాగుపడాలని ప్రత్యేక ¬దా ఇవ్వాలని ఆనాడు పార్లమెంట్లో ప్రకటన చేశాం. మేము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ¬దా ఇస్తాం. ప్రతి తల్లీ తన సంతానం బాగుపడాలని కోరుకుంటుంది. నేనూ అలాగే కోరుకున్నా. కానీ, విూ జీవితాలు, బతుకులు చూస్తుంటే నాకు ఎంతో బాధగా ఉంది. ఈ నాలుగున్నర సంవత్సరాల కేసీఆర్‌ పాలనలో ప్రజలు ఆశించిన అభివృద్ధి జరగలేదు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసం విూరు చేసిన పోరాటం తెరాస ప్రభుత్వం సాకారం చేసిందా?”

వారి కుటుంబానికి ఉపయోగ పడే పనులే చేసుకున్నారు

”ఈ నాలుగున్నరేళ్లలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. భూసేకరణ చట్టం అమలు చేయకుండా రైతులకు నష్టం చేసింది. కూలీలకు ఎంతో మేలు చేసే ఉపాధి హావిూ చట్టాన్ని కూడా తెరా అమలు చేయలేదు. కేసీఆర్‌ కుటుంబం, బంధువులకు మాత్రమే ఉపయోగపడే పనులు చేసుకున్నారు. ఎన్నో కలలు, ఆశయాలతో తెలంగాణ ఇస్తే.. అవి సాకారం కాలేదు”

తెరాస పాలన అంతం చేసే సమయం ఇది!

”చిన్న పిల్లాడి పెంపకంలో లోపం ఉంటే అతడి భవిష్యత్‌ ఎలా నాశనం అవుంతుందో ఈ నాలుగున్నర పాలనలో తెలంగాణ రాష్ట్రం పూర్తిగా భ్రష్టు పట్టింది. భవిష్యత్‌ అంధకారంగా మారే పరిస్థితి ఏర్పడింది. ఈ ఎన్నికలతోనే తెలంగాణ ప్రజల భవిష్యత్‌ ముడి పడి ఉంది. తెరాస పాలన అంతం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. కాంగ్రెస్‌ అభ్యర్థులతో పాటు మహాకూటమిలోని ఇతర పార్టీల అభ్యర్థులను గెలిపించాలని తెలంగాణ ప్రజలను కోరుకుంటున్నా.” అంటూ తెరాస పాలనపై సోనియా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.

తల్లి తన బిడ్డల వద్దకు వచ్చిన ఆనందం: సోనియా

పెంపకం సరిగా లేకపోతే పిల్లల భవిష్యత్తు ఎలా నాశనమవుతుందో.. తెలంగాణ పరిస్థితి అలాగే తయారైందని యూపీయే ఛైర్‌పర్సన్‌ సోనియా అన్నారు. ఒక తల్లి చాలా ఏళ్ల తర్వాత తన బిడ్డల దగ్గరకు వస్తే ఎలాంటి ఆనందం కలుగుతుందో.. తనకు ఇవాళ అలాంటి సంతోషం కలుగుతోందని చెప్పారు. ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు చెబుతూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నాలుగేళ్ల కిందటి వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం చాలా క్లిష్టమైన సమస్యగా కనిపించిందని సోనియా చెప్పారు. పరిస్థితులు చూస్తే తెలంగాణ ఆవిర్భావం సులువు కాదని చాలా మంది భావించారన్నారు. ఇరు ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన పరిస్థితి ఉందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం వల్ల కాంగ్రెస్‌ పార్టీకి రాజకీయంగా నష్టం జరిగిందని తెలిపారు. నష్టం జరుగుతుందని తెలిసినా.. తెలంగాణ ప్రాంత ప్రజల బాగోగుల కోసం రాష్ట్ర ఏర్పాటుకు తీసుకున్నామని చెప్పారు.

ఏపీకి ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉన్నాం..

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తామని మేడ్చల్‌ వేదికగా సోనియా గాంధీ హామీ ఇచ్చారు. ఏపీ ప్రజల బాగోగుల కోసం ప్రత్యేక హోదా ఇవ్వాలని రాష్ట్ర విభజన సందర్భంగా నిర్ణయం తీసుకున్నామని, దానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here