-కాళేశ్వరం ప్రారంభోత్సవం

0

ముఖ్యఅతిధి సీఎం జగన్‌

  • స్వయంగా వెళ్లి ఆహ్వానించనున్న కేసీఆర్‌
  • దేవేంద్ర ఫడణవీస్‌కు కేసీఆర్‌ ఫోన్‌లో ఆహ్వానం

హైదరాబాద్‌ :

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యఅతిథిగా ఆహ్వానించనున్నారు. ఇప్పటికే కాళేశ్వరం ట్రయల్స్‌ రన్స్‌ విజయవంతమైన సంగతి తెలిసిందే. ప్రాజెక్టు పంపుల ద్వారా గోదావరి నీటిని విడుదల చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. కోటి ఎకరాలకు సాగునీరందించేందుకు కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీ డిజైనింగ్‌ చేస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. పనులు చివరి దశకు వచ్చాయి. ఈ వేసవిలోనే నీటిని అందించాలని సీఎం కేసీఆర్‌ కృతనిశ్చయంతో ఉన్నారు. జూన్‌ 21న ప్రాజెక్టును సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యఅతిథిగా ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ను ఆహ్వానించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు జూన్‌ 17వ తేదీ సోమవారం విజయవాడకు కేసీఆర్‌ వెళ్లనున్నారు. ఆ రోజున జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని సీఎం జగన్‌ను కేసీఆర్‌ ఆహ్వానించనున్నారు. ఇదిలా ఉంటే వివిధ రాష్ట్రాల ముఖ్యనేతలను కూడా కేసీఆర్‌ ఆహ్వానించనున్నారని సమాచారం. జూన్‌ 15వ తేదీన ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్‌ సమావేశానికి సీఎం కేసీఆర్‌ హాజరు కానున్నారు. కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని ఆహ్వానించనున్నారని తెలుస్తోంది.

‘కాళేశ్వరం ప్రారంభోత్సవానికి మీరూ రండి’

ఈనెల 21న జరిగే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి రావాలని మరో ముఖ్యమంత్రికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆహ్వానించారు. బుధవారం మధ్యాహ్నం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌కు కేసీఆర్‌ ఫోన్‌ చేసిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావాలని కోరారు. కేసీఆర్‌ ఆహ్వానానికి స్పందించిన ఫడణవీస్‌.. ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు అంగీకరించారు. త్వరలోనే స్వయంగా ముంబయి వెళ్లి ఆయనను ఆహ్వానించాలని కేసీఆర్‌ నిర్ణయించారు. మరోవైపు ఏపీ సీఎం జగన్‌నూ కేసీఆర్‌ ఆహ్వానించనున్నారు. త్వరలో ఆయన విజయవాడ వెళ్లి ఏపీ సీఎంను కలవనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here