దోస్త్‌ మేరా దోస్త్‌..!

0
  • అన్నాడీఎంకే – పీఎంకే మధ్య సీట్ల సర్దుబాటు

చెన్నై : తమిళనాడులో అన్నాడీఎంకే, పీఎంకే పార్టీల మధ్య పొత్తు కుదిరిన విషయం తెలిసిందే. ఈ కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా చేరింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌, ఇతర భాజపా నేతలు మంగళవారం చర్చలు జరిపి సీట్ల సర్దుబాటుపై తుది నిర్ణయం తీసుకున్నారు. పీఎంకే ఏడు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు వారు వెల్లడించారు. తమిళనాడులోని 39, పుదుచ్చేరిలోని ఒక లోక్‌సభ స్థానాల్లో ఈ ఇరు పార్టీలు కలిసి పనిచేయనున్నాయి. అన్నాడీఎంకే నేత, రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వంతో పీఎంకే నేతలు ఎస్‌.రామదాస్‌, జీకే మణి మంగళవారం చర్చలు జరిపారు. అనంతరం పళనిస్వామి విూడియాతో మాట్లాడుతూ… ‘అన్నాడీఎంకే, భాజపా మధ్య పొత్తు కుదిరింది. రానున్న ఎన్నికల్లో గెలుపు సాధిస్తాం. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో భాజపా మాతో కలిసి పోటీ చేయనుంది. ఆ పార్టీ ఐదు స్థానాల్లో బరిలోకి దిగుతుంది. తమిళనాడు, పుదుచ్చేరిలో కలిసి పనిచేస్తాం’ అని తెలిపారు. అనంతరం పీయూష్‌ గోయల్‌ మాట్లాడుతూ… ’21 స్థానాలకు జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఉప ఎన్నికల్లో మేము అన్నాడీఎంకేకు సహకరిస్తాం. పళనిస్వామి, పన్నీర్‌సెల్వం నాయకత్వంలో రాష్ట్రంలో అన్నాడీఎంకే, భాజపా పోటీ చేస్తాయి. కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలో అందరం కలిసి పనిచేస్తాం’ అని తెలిపారు. కాగా, అన్నాడీఎంకే, పీఎంకే కలిసి పని చేస్తాయని మంగళవారం మధ్యాహ్నం ఆ పార్టీలు ప్రకటించిన విషయం తెలిసిందే. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పీఎంకే ఏడు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు వారు వెల్లడించారు. తమిళనాడులోని 39, పుదుచ్చేరిలోని ఒక లోక్‌సభ స్థానాల్లో ఈ మూడు పార్టీలు కలిసి పనిచేయనున్నాయి. పీఎంకేకి అన్నాడీఎంకే.. ఓ రాజ్యసభ సీటు కూడా ఇవ్వనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here