Featuredస్టేట్ న్యూస్

మానవసంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పేద, అనాధ పిల్లలకు నోట్‌ బుక్స్‌ ఉచితంగా పంపిణీ

హైదరాబాద్‌ (ఆదాబ్‌హైదరాబాద్‌): స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువకుల దినోత్సవాన్ని పురస్కరిం చుకొని మానవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 300 మంది పేద మరియు అనాధ పిల్లలకు నోట్‌ బుక్స్‌, పెన్సిల్స్‌, పెన్స్‌ ఇతర వస్తువులను ఉచితంగా పంపిణి చేయడం జరిగింది. తరగతి గదిలోనే దేశ భవిష్యత్తు అంతా దాగి ఉందని ప్రతి విద్యార్ధి చిన్నప్పటి నుండి సక్రమమైన బాటలో నడిచి మహనీయుల ఆదర్శాలను వారి త్యాగాలను ఎల్లకాలం గుర్తు పెట్టుకొని ఇప్పటి నుండే ఇష్ట పడి కష్ట పడి చదువుకోవాలని, ప్రతి విద్యార్ధి భవిష్యత్ను బంగారు భవిష్యత్తుగా విద్యార్థులు తీర్చు దిద్దు కోవాలని మానవ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జయ ప్రకాష్‌ భారత్‌ కార్యక్రమంలో తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ప్రముఖ రచయిత, సామాజిక వేత్త, కామర్స్‌ అధ్యాపకులు జాగతి కాలేజీ వైస్‌ ప్రిన్సిపాల్‌ శ్రీ సూర్యప్రకాష్‌, ప్రముఖ సంస్కత అధ్యాపకులు మరియు సామజిక వేత్త చింత పల్లి కష్ణ రావు, జాతీయ ఓ బి సి ఛైర్మెన్‌ భాగ్యలక్ష్మి అలాగే ఇం టర్నేషనల్‌ కరాటే ఫైటర్‌ మరియు పేదల న్యాయవాది బాలరాజు అతిధులుగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి మాట్లా డారు. ఈ కార్యక్రమంలో టీచర్స్‌, విద్యార్థులతో పాటు సంఘం ప్రతిని ధులు అశోక్‌, సాయి, అనిత, చందు ఇతరులు పాల్గొన్నారు.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close