Featuredరాజకీయ వార్తలుస్టేట్ న్యూస్

అట్టహాసంగా శంకుస్థాపనలు

  • పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ ఛైర్మన్‌లు
  • ప్రజల సమస్యల పరిష్కార వేదికలుగా పార్టీ ఆఫీసులు
  • వెల్లడించిన మంత్రులు

హైదరాబాద్‌ :

రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా కార్యాలయ భవనాల శంకుస్థాపన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఒకే రోజు 29 చోట్ల శంకుస్థాపనలు చేశారు. తొమ్మిది చోట్ల మంత్రులు, మిగతా జిల్లాల్లో జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్లు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. సిరిసిల్లలో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కేటీఆర్‌ పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు. తెలంగాణ వ్యాప్తంగా నిర్మిస్తున్న టీఆర్‌ఎస్‌ కార్యాలయాలు ప్రజా సమస్యల పరిష్కారానికి నిలయాలుగా మారుతాయని మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. నిర్మల్‌ జిల్లా చించొలి క్రాస్‌ రోడ్డ దగ్గర గులాబీ పార్టీ జిల్లా కార్యాలయానికి భూమి పూజ నిర్వహించిన ఆయన.. అన్ని జిల్లాలకు టీఆర్‌ఎస్‌ పార్టీ భవనాలను మంజూరు చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయాన్ని పచ్చదనంతో నింపాలని పేర్కొన్నారు. రాష్ట్రంలోని గడప గడపకు టీఆర్‌ఎస్‌ ను చేర్చాలన్న ఉద్దేశంతో అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ చెప్పారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గులాబీ పార్టీ జిల్లా కార్యాలయానికి ఎమ్మెల్యే హన్మంత్‌ షిండేతో కలిసి ఆయన భూమి పూజ నిర్వహించారు. 60 లక్షలతో నిర్మించబోతున్న భవనాలను.. దసరా రోజున ప్రారంభించనున్నట్లు తెలిపారు. తెరాసకు ఇప్పటి వరకు ఖమ్మం, వనపర్తి జిల్లాల్లో కార్యాలయాలున్నాయి. మొత్తం 33 జిల్లాల్లోనూ కార్యాలయాలుండాలని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఖమ్మం, వనపర్తి మినహా మిగిలిన 29 జిల్లాల్లో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. ఒక్కో జిల్లా కార్యాలయానికి రూ.60 లక్షల చొప్పున పార్టీ అధిష్ఠానం కేటాయించింది. అన్ని కార్యాలయాలు ఒకే నమూనాతో నిర్మించనున్నారు. ఆదివాసీల జిల్లా అదిలాబాద్‌లో గులాబీ పార్టీ జిల్లా కార్యాలయం నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు. కైలాస్‌నగర్‌లో ఆదిలాబాద్‌ జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్ధన్‌, ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్‌ బాపురావు టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయం నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి నగేష్‌, డిసిసిబి చైర్మన్‌ దామోదర్‌ రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ రంగినేని మనీషా పాల్గొన్నారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయం నిర్మాణానికి జెడ్పీ చైర్మన్‌ అంగోత్‌ బిందు శంకుస్థాపన చేశారు. కలెక్టరేట్‌కు సమీపంలో 60 లక్షలతో ఒక ఎకరం స్థలంలో కార్యాలయ నిర్మాణ పనులకు ఆమె భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు రెడ్యా నాయక్‌, శంకర్‌ నాయక్‌, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్‌, రవీందర్‌ రావు, సుధాకర్‌ రావు పాల్గొన్నారు. ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. జెడ్పీ చైర్‌ పర్సన్‌ కోవా లక్ష్మీ పార్టీ ఆఫీస్‌ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు. వికారాబాద్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయం నిర్మాణానికి ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు. సాకేత్‌ నగర్‌ లో జెడ్పీ చైర్‌ పర్సన్‌ సునీతా రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌, పట్నం నరేందర్‌ రెడ్డి తో కలిసి టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయం నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ బైండ్ల విజయ్‌ కుమార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ నాగేందర్‌ గౌడ్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నూతన కార్యాలయం నిర్మాణానికి మంత్రి జగదీష్‌ రెడ్డి శంకుస్థాపన చేశారు. వేదమంత్రొచ్చరణల మధ్య గులాబీ పార్టీ కార్యాలయానికి ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్‌, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌ లతో కలిసి భూమి పూజ నిర్వహించారు. జనగామ జిల్లాలో టీఆర్‌ఎస్‌ నూతన కార్యాలయం శంకుస్థాపన వైభవంగా జరిగింది. యశ్వంతాపూర్‌ గ్రామ శివార్లలో టీఆర్‌ఎస్‌ నూతన జిల్లా కార్యాలయ నిర్మాణానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు, ఎమ్మెల్యే రాజయ్య, ప్రభుత్వ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జెడ్పి చైర్మన్‌ పాగాల సంపత్‌ రెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ ఎడవెల్లి కృష్ణారెడ్డి, కొమురవెల్లి దేవస్థాన చైర్మన్‌ సేవెల్లి సంపత్‌ పాల్గొన్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ కొత్త కార్యాలయం శంకుస్థాపన ఉత్సాహంగా జరిగింది. బాలసముద్రంలో టీఆర్‌ఎస్‌ జిల్లా కార్యాలయ నిర్మాణానికి జడ్పీ చైర్మన్‌ సుధీర్‌ కుమార్‌, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎంపీ దయాకర్‌, ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌ భాస్కర్‌, అరురి రమేష్‌, నన్నపునేని నరేందర్‌ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్‌ ప్రకాష్‌ రావు, కుడా చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో టీఆర్‌ఎస్‌ పార్టీ జిల్లా కార్యాలయ భవనం నిర్మాణానికి జెడ్పీ చైర్మన్‌ కోరం కనకయ్య భూమి పూజ చేశారు. ప్రజా సంక్షేమంతో పాటు పార్టీపటిష్టతే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు కొత్తగూడెంలో పార్టీ కార్యాలయ భవన నిర్మాణంకు శంకుస్థాపన చేసినట్లు కోరం కనకయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, రేగా కాంతారావు, హరిప్రియ నాయక్‌, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌ పాల్గొన్నారు. ములుగు జిల్లా కేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నూతన కార్యాలయం నిర్మాణం భూమిపూజ పండగలా నిర్వహించారు. వేదపండితలు మంత్రొచ్చరణల మధ్య బండారుపల్లి గ్రామ శివారులో గులాబీ పార్టీ కార్యాలయం నిర్మాణానికి ఎంపీ మాలోత్‌ కవిత, జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీష్‌ లు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత జెడ్పీ చైర్మన్‌ కుసుమ జగదీష్‌ ప్రత్యేక భూమి పూజ ¬మం నిర్వహించారు. మొత్తం 60 లక్షలతో నిర్మించనున్న భవనాన్ని.. దసరా నాటికి పూర్తి చేస్తామని జెడ్పీ చైర్మన్‌ కుసమ జగదీష్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి చందూలాల్‌, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌ తో పాటు టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్‌ఎస్‌ ను మరింత బలోపేతం చేసేందుకు జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మిస్తున్నట్లు మంత్రి ప్రశాంత్‌ రెడ్డి చెప్పారు. నిజామాబాద్‌ నగరంలోని ఎల్లమ్మగుట్టలో టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణానికి ఆయన భూమి పూజ నిర్వహించారు. పార్టీ కార్యాలయాల నిర్మాణంతో పాటు..కాళేశ్వరం ప్రాజెక్టుపై కొన్నిపార్టీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ ప్రారంభించిన కాళేశ్వరంతో రైతన్నల కష్టాలు తిరుతాయాన్నారు.

Tags
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close